Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
China Lying Flat: పనీ పాటా చేయమంటున్న చైనా యువత, రోజురోజుకూ పెరుగుతున్న లైయింగ్ ఫ్లాట్ కల్చర్
చైనా అనగానే చాలా మంది పని రాక్షసులు ఉంటారని, వారికెప్పుడు పని, పని అనే ధ్యాస ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. అక్కడి వారు పాటించే 996 వర్క్ కల్చర్ కూడా ఇందుకో కారణం. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజులు పని చేస్తుంటారు. విపరీతమైన పని వల్ల అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంటుంది. నిరంతర పని ఒత్తిడితో అక్కడి ప్రజలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పాత తరం వ్యక్తులు ఇప్పటికీ 996 వర్క్ కల్చర్‌లోనే కొనసాగుతున్నారు. కానీ యువత క్రమంగా దీనికి దూరం జరుగుతోంది. విపరీతమైన పని ఒత్తిడిని భరించలేక పనీ పాటా చేయమని తేగేసి చెబుతోంది. పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి ఇప్పటికే చైనా యువత విముఖత చూపిస్తోంది. ఒంటరిగా జీవించాలనే అక్కడి చాలా మంది యువతీ యువకులు కోరుకుంటున్నారు. యువత పనులు మానేసి ఓ చిన్న టెంట్ లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

లైయింగ్ ఫ్లాట్ కల్చర్ అంటే?
విపరీతమైన పని ఒత్తిడి వల్ల చాలా మంది యువతీ యువకులు వారాంతాల్లో ప్రశాంతత కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్తున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో కొందరు ఏకంగా పని మానేసి మరీ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎంతో కొంత సంపాదించిన డబ్బుతో ఓ చిన్న టెంట్ కొనుక్కుంటున్నారు. వాటిని రోడ్ల పక్కన, ప్రభుత్వ స్థలాలు, నగర శివారు ప్రాంతాల్లో వేసుకుంటూ అందులోనే కాలం గడిపేస్తున్నారు. దీనికే లైయింగ్ ఫ్లాట్ కల్చర్ అని పిలుస్తున్నారు. రోజంతా విశ్రాంతి తీసుకుంటూ, ప్రశాంతంగా గడుపుతున్నారు.
పని మానేసి ఐదేళ్లుగా విశ్రాంతి:
సిచువాన్(Sichuan) ప్రావిన్స్ కు చెందిన లీ షు(Li Shu) అనే 29 ఏళ్ల యువకుడు విపరీతమైన పని ఒత్తిడి భరించలేక 2018లోనే ఉద్యోగాన్ని వదిలేశాడు. అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బుతో అద్దె ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకున్నాడు. క్రమంగా డబ్బు అయిపోతుండటాన్ని గమనించి మళ్లీ ఎక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుందోనని భయపడి ఖర్చులు విపరీతంగా తగ్గించుకున్నాడు. కేవలం 10 యువాన్లతో మన కరెన్సీలో 117 రూపాయలతో రోజు గడిపేవాడు
అద్దె భారం కావడంతో టెంట్ కొనుక్కున్నాడు:
అద్దె ఇంట్లో ఉండటం భారంగా మారడంతో ఆ ఇంటిని ఖాళీ చేసి సామాన్లను 400 యువాన్లకు అమ్మేశాడు. ఓ టెంట్ కొనుక్కుని పార్కింగ్ యార్డులో వేశాడు. నిర్మాణ వ్యర్థాల చెంతనే టెంట్ వేసుకుని అందులో ఉండటం మొదలుపెట్టాడు. 200 రోజులకు పైగా అక్కడే అదే టెంటులో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. విపరీతమైన పని ఒత్తిడితో అలసిపోయానని, ఇక విశ్రాంతి తీసుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతునాని అంటున్నాడు. మళ్లీ ఉద్యోగం చేసే ఆలోచన లేదని తేల్చి చెబుతున్నాడు.
ఏం తింటాడు, ఎలా ఉంటాడంటే..:
లీ షు ఏవి చౌకగా దొరికితే వాటినే తింటుంటాడు. నూడుల్స్, డంప్లింగ్స్ మాత్రమే తింటూ కాలం గడుపుతున్నాడు. ఏరోజైనా రుచిగా తినాలనిపిస్తే తన వద్ద ఉండే చిన్న స్టవ్ పై బీఫ్, ఆలూతో వంట చేసుకుని తింటాడు. ఓ చోటుకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటాడు. అక్కడే ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాడు.
జీవితంలో చాలా ప్రశాంతంగా ఉన్నా:
మంచి చదువు చదువుకుని, మంచి ఉద్యోగం చేసి ఇలా ఆఖరికి ఓ టెంట్ లో ఉంటున్నావు ఏంటి అని ఎవరైనా అడిగితే.. లీ షూ చెప్పే సమాధానం ఒక్కటే. పని ఒత్తిడి నుండి విశ్రాంతి తీసుకుని ఇప్పుడే నేను ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా. ఇప్పుడు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉన్నా అని సమాధానం ఇస్తున్నాడు లీ షూ.
చైనాలో పెరుగుతున్న ఈ లైయింగ్ ఫ్లాట్ కల్చర్ కు లీ షూ ఓ ఉదాహరణగా నిలుస్తున్నాడు. విపరీతమైన పని ఒత్తిడి వల్ల ఎలాంటి విపరిణామాలు ఎదురవుతాయో చైనాలో కనిపిస్తున్న ఈ కల్చర్ అద్దం పడుతోందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











