Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
విజయ్-రష్మికల పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్..చూడముచ్చటగా జంట..మీరూ చూడండి
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఆన్ స్క్రీన్ కపుల్.. ఇప్పుడు రియల్ లైఫ్ కపుల్‌గా మారిపోయారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా (ప్రముఖ ఐటీసీ మెమెంటోస్ హోటల్) గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది.
రెండు భిన్నమైన సంప్రదాయాల అందమైన కలయికగా ఈ పెళ్లి జరగడం విశేషం. ఉదయం హిందూ (తెలుగు) సంప్రదాయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏడడుగులు నడిచిన ఈ జంట.. సాయంత్రం 4:30 గంటలకు రష్మిక మాతృకయైన కొడవ (కూర్గ్) సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

గురువారం తెల్లవారుజాము నుంచే పెళ్లింట సందడి మొదలైంది. గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాలతో వధూవరులకు శాస్త్రోక్తంగా మంగళస్నానాలు చేయించారు. పండితుల వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిగాయి.
అయితే పెళ్లి ఫొటోలు కోసం అభిమానుల ఎదరుచూపులను అర్థం చేసుకొని విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తమ పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక కూడా అభిమానులతో పంచుకుంటూ హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా మిస్టర్ విజయ్ దేవరకొండ అని తన ఇన్ స్టా పోస్ట్ లో తెలిపారు.
ఈ ఫొటోలను చూసిన అభిమానులు మేడ్ ఫర్ ఈచ్ అదర్, సూపర్ ఉన్నారు..చూడముచ్చటగా ఉన్నారంటూ కామెంట్లు పెడుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యసోషల్ మీడియా వేదికగా విరోష్ దంపతులకు లక్షలాదిగా శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి.
గీత గోవిందం సినిమాతో వీరిద్దరి మధ్య చిగురించిన పరిచయం.. డియర్ కామ్రేడ్ నాటికి గాఢమైన ప్రేమగా మారింది. ఏ కష్టం వచ్చినా దేవరకొండ ఫ్యామిలీకి అండగా ఉంటానని రష్మిక ఎన్నోసార్లు నిరూపించారు. విజయ్ కూడా ఆమెకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ముచ్చటగా వీరు మూడోసారి కలిసి నటిస్తున్న రణబాలి సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పూర్తవకముందే ఇలా పెళ్లిపీటలు ఎక్కడం విశేషం.
వివాహ వేడుకను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా ఉంచినప్పటికీ.. మార్చి 4న హైదరాబాద్‌లో అతిరథ మహారథుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సామాచారం. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెరమీద సూపర్ హిట్ అయిన ఈ జంట.. నిజ జీవితంలోనూ భార్యాభర్తలుగా మారడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.



Click it and Unblock the Notifications