Latest Updates
-
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే.. -
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.! -
జూన్ 4: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్లో అద్భుతమైన మార్పులు! -
జూన్ 4న అరుదైన బ్రహ్మ యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
వేసవిలో కడుపుకు హాయినిచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..5 నిమిషాల్లో దహీ పోహా ఎలా చేయాలంటే.. -
ఆంధ్రప్రదేశ్‌లో తప్పకుండా సందర్శించాల్సిన 10 అతి పురాతన శివాలయాలు -
12 ఏళ్ల తర్వాత కర్కాటకంలో గురు ఉచ్ఛ స్థితి: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
ధనస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. ఎవరికి ధన లాభం? - గురువారం, 04 జూన్ 2026
Mahaparinirvan Diwas 2022: మహాపరినిర్వాన్ దివాస్ చరిత్ర, ప్రాముఖ్యత ఏంటంటే..
భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్. బాబాసాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన భారతరత్న బీఆర్ అంబేడ్కర్ డిసెంబర్ 6వ తేదీ, 1956లో ప్రాణాలు వదిలారు. ఆయన వర్ధంతిని ఏటా మహాపరినిర్వాన్ దివాస్ గా జరుపుకుంటాం.
Mahaparinirvan Diwas 2022: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్. బాబాసాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన భారతరత్న బీఆర్ అంబేడ్కర్ డిసెంబర్ 6వ తేదీ, 1956లో ప్రాణాలు వదిలారు. ఆయన వర్ధంతిని ఏటా మహాపరినిర్వాన్ దివాస్ గా జరుపుకుంటాం. దేశంలోని అణగారిన వర్గాల కోసం ఆయన నిరంతరం శ్రమించారు. వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు కృషి చేశారు.

స్వతంత్ర భారత దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించే పనిలో ఉన్న ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా, దేశానికి ఆయన చేసిన సేవలు అనేకం. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు 1990 దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న అందించింది. దేశంలో డాక్టరేట్‌ను అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేడ్కర్. ఆయనకు తొమ్మిది భాషలు తెలుసు.
ఈరోజు ఆయన 66వ వర్ధంతి సందర్భంగా మహాపరినిర్వాన్ చరిత్ర, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మహాపరినిర్వాన్ దివాస్ చరిత్ర:
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిసెంబర్ 6, 1956న ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నాం. అంబేడ్కర్ బౌద్ధమతనాన్ని అవలంభించేవారు. బౌద్ధమతాన్ని ప్రచారం చేసేవారు. బౌద్ధమతం యొక్క ప్రధాన సూత్రాల్లో పరినిర్వాన్ ఒకటి కాబట్టి ఆయన వర్ధంతిని మహాపరినిర్వాన్ దివాస్‌గా జరుపుకుంటున్నాం.
బుద్ధు భగవానుడి మరణం అసలు మహాపరినిర్వాన్‌గా పరిగణించబడుతూ వస్తోంది. బౌద్ధమతంలోని కట్టుబాట్లను ఇష్టపడే అంబేడ్ర్ బౌద్ధమతాన్ని స్వీకరించడమే కాకుండా తన అనుచరులకు ఆ మతంలోని మాధుర్యాన్ని తెలియజెప్పేవారు. ఆయనను బౌద్ధ గురువుగా పరిగణించేవారు. అలా బుద్ధ భగవానుడి మరణంతో అంబేడ్కర్ మరణాన్ని పోలుస్తూ మహాపరినిర్వాన్ దివాస్‌గా జరుపుకుంటున్నాం.

మహాపరినిర్వాన్ దివాస్ ప్రాముఖ్యత:
భారతదేశంలోని ప్రతి ఒక్కరూ డాక్టర్ అంబేడ్కర్ జీవితాన్ని, వృత్తిని, ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుంచుకోవడానికి మహాపరినిర్వాన్ దివాస్‌ను ఏటా జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ జీవితంలోని ప్రతి అంశాన్ని గుర్తుంచుకోవడానికి, అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలు మదిలో ఉంచుకుని వాటి నుండి స్ఫూర్తి పొందే ఉద్దేశంతో ఏటా ఆయన వర్ధంతిని మహాపరినిర్వాన్ దివాస్‌గా జరుపుకుంటున్నాం.



Click it and Unblock the Notifications