Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Indira Devi: మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత
అనారోగ్యంతో కన్నుమూసిన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి.
Indira Devi: ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరాదేవి(Indira Devi) తన 70వ ఏట తుది శ్వాస విడిచారు. ఇందిరా దేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 28న బుధవారం వేకువజామున హైదరాబాద్ లోని నివాసంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంల విషాదఛాయలు అలుముకున్నాయి.

కృష్ణ - ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ఈ సంవత్సరంలో జనవరిలో రమేశ్ బాబు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇందిరా దేవి మృతితో మహేష్ బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మహేశ్ బాబు కుటుంబీకుల ప్రకటన ప్రకారం, ఇందిరాదేవి అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరుగుతాయని సమాచారం. ఆమె పార్థివ దేహాన్ని అభిమానుల కోసం పద్మాలయ స్టూడియోస్‌లో ఉంచనున్నారు.

'అమ్మ నీ ప్రేమ మరువలేనిది'
ఈ ఏడాది మేలో మహేష్ బాబు తన తల్లిపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అతను ఇందిర, అతని భార్య నమ్రతా శిరోద్కర్ మరియు వారి పిల్లలు - గౌతమ్ ఘట్టమనేని మరియు సితార ఘట్టమనేని చిత్రాలను పంచుకున్నారు. "అమ్మకు.. మరియు ప్రపంచంలోని తల్లులందరికీ.. చాలా సంతోషకరమైన మాతృదినోత్సవం! నీ ప్రేమ మరువలేనిది." అని పోస్టు చేశారు.
గత సంవత్సరం మదర్స్ డే సందర్భంగా, మహేష్ బాబు ఇందిర చేయి పట్టుకున్న ఫోటోను పంచుకున్నారు. "హ్యాపీ బర్త్ డే అమ్మా... ప్రతిరోజూ నీకు కృతజ్ఞతలు" అని రాశాడు మహేష్ బాబు.

'అమ్మంటే దేవుడితో సమానం'
"నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఏ చిత్రం విడుదల అయినా ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ.. గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం. ఆమె ఆశీస్సుల వల్లే నాకు ఈ విజయం వచ్చింది" అని మహర్షి మూవీ సక్సెస్ మీట్ లో మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి గురించి చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ఇందిరా దేవి మరణంతో మహేష్ బాబుకు చెందిన ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
#MaheshBabu హ్యాష్ ట్యాగ్ ను జత చేస్తూ 'ధైర్యంగా ఉండండి అన్నా' అని సోషల్ మీడియాలో మహేష్ బాబుకు అండగా ఉన్నామంటూ చెబుతున్నారు.



Click it and Unblock the Notifications