Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
Fathers's Day 2025 Gifts: నాన్న చిరునవ్వుకు ఎంతైనా వెలకట్టలేం..ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నకు బెస్ట్ గిఫ్ట్ ఇదే
నాన్నంటే కేవలం ఓ వ్యక్తి కాదు, మన జీవితానికి మూల స్తంభం. మన ఆనందంలో ఆనందించే, మన కష్టాల్లో తోడుండే ఆ తండ్రి ప్రేమకు, త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పే అద్భుతమైన రోజు ఫాదర్స్ డే. ప్రతి ఏటా జూన్ మూడవ ఆదివారం నాడు ఈ పండగను జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2025 జూన్ 15న ఫాదర్స్ డే వస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున మీ నాన్నగారికి ప్రేమతో కూడిన బహుమతిని అందించి, వారి ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటున్నారా?
మీ బడ్జెట్ తక్కువైనా, ప్రేమతో కూడిన ఓ చిన్న బహుమతి కూడా నాన్నకు ప్రపంచమంత ఆనందాన్ని ఇస్తుంది. బహుమతి విలువ దాని ధరలో ఉండదు, దాని వెనుక ఉన్న ప్రేమ, శ్రద్ధలో ఉంటుంది. ఈ ఫాదర్స్ డే నాడు మీ నాన్నగారి ఇవ్వగల కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్ లు ఏవో ఇక్కడ చూడండి.

జ్ఞాపకాలను పదిలపరిచే ఫోటో ఫ్రేమ్
మీరు మీ నాన్నగారితో దిగిన ఓ అందమైన ఫోటోని లేదా కుటుంబమంతా కలిసి ఉన్న ఓ చిత్రాన్ని ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇవ్వండి. ఆ ఫ్రేమ్ ను చూడగానే మీ నాన్నగారి ముఖంలో ఆనందం వెల్లివిరియడం ఖాయం. ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకోవడం కంటే గొప్ప బహుమతి ఇంకోటి ఉండదు.
అవసరమైన స్మార్ట్ ఫోన్
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. మీ నాన్నగారికి స్మార్ట్ ఫోన్ అవసరం ఉంటే అది ఆయనకు చాలా ఉపయోగపడుతుంది. టెక్నాలజీతో అనుసంధానమై ఉండటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇది ఆయన రోజువారీ పనులను సులభతరం చేస్తుంది.
తోటపని కిట్
మీ నాన్నకు తోటపని అంటే ఇష్టమైతే పూర్తి ఈ ఫాదర్స్ డే రోజున తోటపని కిట్ అతని అభిరుచిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ కిట్ లో మొక్కలు, విత్తనాలు, పనిముట్లు, తోటపని గైడ్ ఉంటాయి. ఈ గిఫ్ట్ అతన్ని బిజీగా ఉంచడమే కాకుండా మానసిక ప్రశాంతతను, ప్రకృతితో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా ఇస్తుంది.
వినోదానికి బ్లూటూత్ స్పీకర్ లేదా పుస్తకాలు
సంగీతం వినడం అంటే ఇష్టపడే నాన్నగారికి బ్లూటూత్ స్పీకర్ ఒక బెస్ట్ బహుమతి. ఆయనకు నచ్చిన పాటలు, భజనలు లేదా రేడియో వింటూ ఆనందించడానికి ఇది దోహదపడుతుంది. ఒకవేళ ఆయనకు పుస్తకాలు చదవడం అలవాటైతే ఆయనకు ఇష్టమైన రచయిత పుస్తకాలు లేదా ఆసక్తి ఉన్న అంశాలపై పుస్తకాలు కొనివ్వండి. ఇది ఆయనకు నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా సహాయపడుతుంది.

హెల్త్ ట్రాకింగ్ గాడ్జెట్
ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగల ఫిట్ నెస్ బ్యాండ్ లేదా స్మార్ట్ వాచ్ ఈ ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి గ బహుమతిగా ఇవ్వండి. ఈ గాడ్జెట్ అతని హార్ట్ బీట్ రేటు, నిద్ర, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈ బహుమతితో మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చు.
చేతితో చేసిన కార్డుతో మనసులో మాట
మీ హృదయంలోని భావాలను వ్యక్తం చేయడానికి చేతితో చేసిన కార్డు కంటే గొప్ప బహుమతి లేదు. మీ నాన్నగారిపై మీకు ఎంత ప్రేమ ఉందో, ఆయన చేసిన త్యాగాలకు మీరు ఎంత కృతజ్ఞతతో ఉన్నారో ఆ కార్డుపై రాయండి. మీ చేతి రాతలో ఉన్న ఆ అక్షరాలు ఆయన మనసును కదిలిస్తాయి. ఇది కేవలం ఒక కార్డు మాత్రమే కాదు మీ ప్రేమకు ప్రతిరూపం.
ఉపయోగకరమైన బట్టలు, బూట్లు
నాన్నగారికి ఉపయోగపడే షర్ట్, ప్యాంట్ లేదా మంచి చెప్పులు లేదా బూట్లు కొనివ్వండి. ఇవి ఆయనకు తరచుగా ఉపయోగపడతాయి. ఆయన వాటిని ధరించిన ప్రతిసారీ మీ ప్రేమను గుర్తు చేసుకుంటారు. ఇది చూసినప్పుడు ఆయన ముఖంలో తప్పకుండా చిరునవ్వు వస్తుంది.



Click it and Unblock the Notifications