Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Man Pregnant: ప్రెగ్నెంట్ అయిన పురషుడు, కడుపులో కవలలు గుర్తింపు!
వైద్య రంగంలో అప్పుడప్పుడు వింతలు చూస్తుంటాం. శిశువు నాలుగు చేతులతో, రెండుకు మించి కాళ్లతో, రెండు తలలతో, ఒకటే కన్నుతో ఇలా చాలా వింతలు చూసే ఉంటాం. అలాంటిదే మరో వింత జరిగింది. అది అలాంటిలాంటి వింత కాదు.
మహారాష్ట్రకు చెందిన ఓ పురుషుడికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతే కాదు అతడి పొట్టలో కవల పిల్లలు కూడా పెరుగుతున్నారు. 1999 నాటి ఈ సంఘటన ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వార్త చదివేయండి.

మహారాష్ట్రలో వెలుగు చూసిన వింత:
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ విచిత్ర ఘటన 1999లో వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌కు చెందిన సంజూ భగత్ వయస్సు 60 ఏళ్లు. అతడు ఓ అనారోగ్య సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్నాడు. ఆ జబ్బు ఏమిటో వైద్యులు కూడా కనిపెట్టలేకపోయారు. సాధారణంగా పొట్ట అందరికీ పెరుగుతుంది. పొట్టతో పాటు ఇతర శరీర భాగాలు కూడా ఎంతో కొంత పెరుగుతూ వస్తుంటాయి. కొవ్వు పేరుకుపోయి సాధారణంగా ఇలా జరుగుతుంది.
అయితే సంజూ భగత్ కు మాత్రం స్త్రీలు గర్భం ధరించినప్పుడు కేవలం పొట్ట మాత్రమే ఎలా పెరుగుతుందో అచ్చంగా అతడికి కూడా పొట్ట మాత్రమే పెరిగింది. 36 ఏళ్ల నుంచి సంజూ భగత్ పొట్ట కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తూనే ఉంది. ఇదేం రోగం అనుకున్న సంజూ భగత్.. చాలానే ఆస్పత్రులు తిరిగాడు. చాలా మంది స్పెషలిస్టులను కలిశాడు.
అలా చివరికి అతడికి సోకిన వ్యాధి పేరు ఫీటస్ ఇన్ ఫీటూ అనే అత్యంత అరుదైన వ్యాధిగా తేలింది. ఈ వ్యాధిని వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. భారీగా పెరిగిన పొట్టతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు భగత్. సంజూ భగత్ కు తన పొట్టతో తీవ్రంగా అవస్థ కావడంతో మరోసారి వైద్యుల వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు సంజూ భగత్ గర్భం దాల్చినట్లు తేల్చి చెప్పారు.
మొదట ట్యూమర్ అనుకున్నారు కానీ..:
సంజూ భగత్ కు చికిత్స చేసిన డాక్టర్ అజయ్ మెహతా ముందుగా అతనిని చూసి ట్యూమర్ తో బాధపడుతున్నాడని అనుకున్నారు. ఇక శస్త్ర చికిత్స మొదలు పెట్టిన తర్వాత వైద్యులు ఆశ్చర్యపోయారు. ట్యూమర్ కాకుండా సంజూ భగత్ పొట్టలో జననాంగం, వెంట్రుకలు, కొన్ని అవయవాలు, దవడ ఉన్నాయని గుర్తించారు.
సంజూ భగత్ ఒక్కడే కాదు..:
2020 లో బంగ్లాదేశ్ కు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక కూడా ఈ అరుదైన వ్యాధితో బాధపడినట్లు సైన్స్ డైరెక్ట్ మ్యాగజైన్ లోని ఓ నివేదిక పేర్కొంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన బాలికన పరీక్షించిన వైద్యులు, ఆమె పొట్టలో శిశువు లాంటిది ఉన్నట్లు గుర్తించారు.
2021 లో ఉత్తర ఆఫ్రికాలో ఇలాంటివి రెండు సంఘటనలు వెలుగు చూశాయి. 10 ఏళ్ల బాలిక పొట్టలో శిశువు లాంటిది కనుగొన్నారుడు వైద్యులు. మరో 4 నెలల బాలుడికి అల్ట్రాసౌండ్ చేయగా.. అతనిలో కూడా అవయవాలు కలిగిన పిండం లాంటిదాన్ని గుర్తించారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications