డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు

పెళ్లి అయ్యి 17 ఏళ్లు అయ్యింది. భర్త ఎలాంటి ఇబ్బందులు పెట్టట్లేదు. సంసారం హాయిగా సాగిపోతుంది. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఏదో ఏదో కావాలనే తపన ఆమెలో ఉండేది. చివరికి అందరినీ వదిలి సోషల్ మీడియాలో పరిచడం అయిన వాడితో లేచిపోయింది. అరెరే ఎందుకు పారిపోవడం అని తర్వాత భర్తే దగ్గరుండి తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించాడు. కుక్కర్ లో, డ్రమ్ లో శవమై పడి ఉండటం కన్నా ఇది బెటర్ బ్రో మంచి పనిచేశావ్ అంటూ నెటిజన్లు ఆ భర్తను అదృష్టవంతుడివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలోని మిశ్రిఖ్, రేఖ టౌన్ లో నివసించే విపిన్ భార్గవ, రేఖా భార్యాభర్తలు. 2009లో వీరికి పెళ్లి అయ్యింది. ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడిది 16 ఏళ్ల వయస్సు, ఇంకొకడికి 14 ఏళ్లు. అయితే రేఖాకి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరిక ఉండేది. దీంతో షార్ట్ వీడియోలు, రీల్స్ చేస్తూ వాటిని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో పెడుతుండేది. అయితే ఈ సమయంలో రాహుల్ కుమార్ అనే యువకుడితో ఫేస్ బుక్ లో రేఖాకి పరిచయం ఏర్పడింది.

Man Gets Wife Married To Her Lover After 17 Years Of Marriage Watch Viral Video

మొదట్లో ఫేస్ బుక్ లో మెసేజ్ లు, తర్వాత ఫోన్ కాల్స్, ఆ తర్వాత అప్పుడప్పుడు వీరు సీక్రెట్ గా కలవడం అన్నీ జరిగాయి. ఈ క్రమంలో ఇటీవల రేఖా తన ప్రియుడితో లేచిపోయింది. అయితే ఇదంతా తెలియని భర్త విపిన్ భార్గవ మాత్రం పాపం తన పెళ్లాంకి ఏమైందో అని టెన్షన్ పడుతూ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లెయింట్ కూడా ఇచ్చాడు. అయితే ప్రియుడితో 22 రోజులు గడిపిన తర్వాత అక్టోబర్ 14న ఇంటికి వచ్చింది రేఖా. భర్తకు తన వ్యవహారం మొత్తం చెప్పేసింది. ప్రియుడు లేకుండా తాను ఉండలేనని తేల్చి చెప్పింది.

పెళ్లి కాని ప్రసాద్‌ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!పెళ్లి కాని ప్రసాద్‌ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!

భార్య మాటలు విని ఒక్క క్షణం షాక్ అయిన భర్త వెంటనే తేరుకొని సరేలే నీ ప్రియుడితోనే వెళ్లు మంచిగా వాడితోనే ఉండు అని చెప్పేశాడు, అంతేకాకుండా రాహుల్ ని మిశ్రిఖ్ సిటీకి తీసుకొచ్చి తహసీల్దార్ కార్యాలయంలో విడాకుల ప్రక్రియ, చట్టపరమైన డాక్యుమెంట్లు పూర్తి చేసి స్థానిక ఆంజనేయస్వామి గుడిలో తన భార్య రేఖకు ఆమె ప్రియుడు రాహులతో దగ్గరుండి పెళ్లి జరిపించాడు. పిల్లలను మాత్రం తనే చూసుకుంటానని విపిన్ భార్గవ ఆమెకు చెప్పేశాడు. అంతేకాకుండా పెళ్లి తర్వాత దగ్గరుండి మంచి వారిని ఢిల్లీకి పంపించాడు విపిన్ భార్గవ.

అయితే గతంలో కూడా భర్త తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన అనేక సంఘటనలు చూశాం. కానీ పెళ్లై 17 ఏళ్ల తర్వాత కూడా ప్రియుడు, లేచిపోవడం ఏంటిది ఇదంతా, ఆ ప్రియుడే నిన్ను చెక్కేస్తాడు పో, వాడి మోజు తీరాక నిన్ను వదిలేసి పోతాడు అంటూ నెటిజన్లు ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు

Story first published: Wednesday, October 21, 2026, 20:54 [IST]
Desktop Bottom Promotion