Latest Updates
-
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి..
మనిషి పెద్ద పేగులో ఈగ, శాస్త్రవేత్తలకు శతకోటి సమస్యల్లో ఇప్పుడు ఈగ సమస్య, వాట్ నెక్ట్స్
రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ప్రతినిత్యం చాలా మంది ఆసుపత్రికి వెలుతుంటారు. అలాగే చెకప్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడి పెద్దపేగులో ఈగను చూసిన వైద్యులు బిత్తరపోయారు. అమెరికాలోని మిస్సౌరీలో ఓ వృద్ధుడి పెద్దపేగులో ఈగను గుర్తించిన వైద్యులు, సంబంధిత శాస్త్రవేత్తలు తలలు బాదుకుంటున్నారు.
కొలొనోస్కోపీ కోసం వెళ్లిన వృద్ధుడికి వైద్యులు మొదట వైద్యపరీక్షలు చేశారు. కొలొనోస్కోపీ ప్రక్రియలో ఓ ప్లెక్సిబుల్ ట్యూబ్‌కు కెమెరా, లైట్ అమర్చి పెద్దపేగులోకి పంపించి వాటిని పరీక్షిస్తారు.

ఈ క్రమంలో వైద్యులకు పెద్దపేగులో ఓ చోట చనిపోయినా చెక్కుచెదరకుండా ఉన్న ఈగ కనిపించడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని రోగికి చెప్పడంతో ఆయన బిత్తరపోయారు. వైద్యులు సూచించినట్టుగా కొలొనోస్కోపీకి ముందు తాను ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నానని, పిజ్జా, పాలకూర తిన్నానని ఆ రోగి వైద్యులకు చెప్పారు. అనుకోకుండా తాను ఈగను మింగినట్టు తనకు ఏమాత్రం గుర్తులేదని, బహుషా ఆహారంలో ఏమైనా వెళ్లిందేమో తనకు తెలీదని ఆ రోగి వైద్యులకు చెప్పాడు.
రోగి పెద్దపేగులోకి ఈగ ఎలా చేరిందన్న దానిపై మిస్సౌరీ విశ్వవిద్యాలయ గ్యాస్ట్రో ఎంటరాలిజిస్ట్ చీఫ్ మాథ్యూ బెచ్‌టోల్డ్ రెండు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో మొదటిది ఈగ మనిషి నోటి ద్వారా పెద్ద పేగులోకి చేరుకుని ఉంటుంది. అయితే, సాధారణ పరిస్థితుల్లో ఎగువ జీర్ణ ఎంజైములు పొట్టలోని ఆమ్లం ఈగని జీర్ణం చేసుకుని ఉండాలి. అలా జరగలేదు కాబట్టి నోటి ద్వారా ఈగ లోపలికి ప్రవేశించలేదని తెలుస్తోందని అంటున్నారు.

రెండో అనుమానం ప్రకారం పురీషనాళం ద్వారా ఈగ శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చు. అయితే ఈ రెండో అనుమానం కూడా పెద్ద అనుమానంగానే ఉంది అంటున్నారు. దిగువ నుంచి పెద్దపేగులోకి ఈగ జొరబడడం అసాధ్యం. ఎందుకంటే ఈగ అంతదూరం ప్రయాణించాలంటే అది పొడవుగా తెరుచుకుని ఉండాలి. కానీ, పెద్దపేగు మధ్యలో ముడుచుకుని వంకరగా ఉంటుంది. కాబట్టి ఈ అనుమానం కూడా అపద్దం అని తేలింది.
జీర్ణవ్యవస్థలో కీటకాలు చెక్కుచెదరకుండా ఉండి గుడ్లు లేదంటే లార్వాలను జీర్ణాశయాంతర పేగులలో ఉంచి పేగు మయాసిస్‌కు కారణమయ్యే సందర్భాలు గతంలోనూ అరుదుగా ఉన్నట్టు అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేర్కొంది. పిన్‌వార్మ్, సీట్‌వార్మ్, థ్రెడ్‌వార్మ్ వంటి పరాన్నజీవులు పేగులను ప్రభావితం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే పేగుల్లో జీర్ణం కాని ఈగను గుర్తించడం ఇదే తొలిసారి కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పెద్ద పేగు లోపలికి ఈగ ఎలా ప్రవేశించి ఉంటుంది అంటూ శాస్త్రవేత్తలు తలలు బాదుకుంటున్నారు. పెద్ద పేగులోకి ఈగ ఎలా చేరింది అని తెలుసుకోవడం అమెరికా శాస్త్రవేత్తలకు సవాలుగా మిగిలింది. మొత్తం మీద అమెరికాకు చెందిన రోగి పెద్ద పేగులో ఓ ఈగ ఉందని వెలుగు చూడటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.



Click it and Unblock the Notifications
