Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
జీవితంలో ఒక్కసారి కూడా స్త్రీని చూడని ఏకైక వ్యక్తి ఇతడే..82 ఏళ్లు అలా ఎలా బతికాడో తెలుసా..
ఈ భూమి మీద పుట్టిన తర్వాత స్త్రీని చూడకుండా ఉండటం దాదాపు అసాధ్యం. మన ఇంట్లో, స్కూల్స్ లో, కాలేజీల్లో,హాస్పిటల్స్, పని ప్రదేశంలో, రోడ్లమీద, దుకాణాల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోటా స్త్రీలు ఉంటారు. అయితే ఓ వ్యక్తి అసలు స్త్రీ అంటే ఎవరో తెలియకుండానే..ఒక్క స్త్రీని కూడా చూడకుండానే 82 ఏళ్లు బతికాడు. చరిత్రలో స్త్రీని చూడకుండానే జీవించి మరణించిన ఏకైక వ్యక్తి అతడేనని చెబుతారు. అతనెవరు, ఒక్క మహిళను కూడా చూడకుండా ఎలా అన్నేళ్లు బతికాడో ఇప్పుడు చూద్దాం.
గ్రీస్ దేశంలోని హల్కిడికిలో 1856లో మిహైలో టోలోటోస్ అనే వ్యక్తి జన్మించాడు. అయితే ఇతడు పుట్టిన నిమిషాల వ్యవధిలో కన్నతల్లి మరణించింది. కన్నతల్లి స్పర్శని కూడా అనుభవించలేకపోయాడు. తల్లి మరణంతో అనాథగా మారిపోయిన మిహైలో టోలోటోస్ ని..ప్రపంచంలోనే అత్యంత ఏకాంతమైన, పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటైన మౌంట్ అథోస్ దగ్గర ఉన్న ఆర్థడాక్స్ సన్యాసులు చేరదీశారు. వారు టోలోటోస్ ని తమ క్రైస్తవ ఆశ్రమానికి తాసుకొచ్చి పెంచి పెద్దవాడిని చేశారు. తల్లి, తండ్రి లోటు తెలియకుండా అతడికి తమ జ్ణానాన్ని పంచుతూ ఆశ్రమంలోనే పెంచి పెద్దవాడిని చేశారు. మంచి, చెడు అన్నీ నేర్పించారు. మిహైలో టోలోటోస్ అనే పేరు కూడా వాళ్లే పెట్టారు.

అయితే అశ్రమంలో ఆశ్రమంలో ఓ రూల్ ఉండేది..అదేంటంటే అక్కడ ఏ స్త్రీకి అనుమతి ఉండదు. వందల ఏళ్ల నుంచి మౌంట్ అథోస్ దగ్గర ఈ నియమం అమల్లో ఉంది..ఇప్పటికీ ఆ రూల్ కొనసాగుతోంది. ఆశ్రమంలోకి లేదా చుట్టు పక్కల ప్రదేశానికి ఏ ఒక్క మహిళ వచ్చే అవకాశం లేదా ఉండే అవకాశం లేకపోవడంతో సహజంగానే మిహైలో టోలోటోస్ తన బాల్యంలోగానీ లేదా పెద్దయినాక గానీ ఏ స్త్రీని తన కళ్లతో చూడలేదు.
1054వ సంవత్సరం నుంచే ఆ రూల్
మౌంట్ అథోస్ అనేది ఈశాన్య గ్రీస్ లోని అథోస్ ద్వీపకల్పంలో ఏజియన్ సముద్రంపై ఉన్న ఒక పర్వతం. ఇది ఈస్ట్రన్ ఆర్ధోడాక్స్ సన్యాసిజం యొక్క ముఖ్యమైన కేంద్రం. ఈ పర్వతం, అథోస్ ద్వీపకల్పంలోని ఎక్కువ భాగం గ్రీస్ లోని స్వయంప్రతిపత్తి ప్రాంతంగా మౌంట్ అథోస్ సన్యాసుల సంఘం ద్వారా పరిపాలించబడుతుంది. 1054వ సంవత్సరం నుంచే ఆర్థడాక్స్ ఆధ్యాత్మిక కేంద్రమైన మౌంట్ అథోస్ స్వయంప్రతిపత్తి అధికారాన్ని కలిగి ఉంది. గ్రీకు చట్టం, మతపరమైన సంప్రదాయం ప్రకారం సన్యాసుల సంఘం పరిపాలించే ఈ ప్రాంతంలోకి మహిళలు ప్రవేశించడం నిషేధించబడింది. ఆడ జంతువులకు కూడా ఈ ప్రదేశలంలోకి ఎంట్రీని నిషేదించారు. సన్యాసులు బ్రహ్మచర్యాన్ని కొనసాగించడానికి, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడానికి ఈ కఠినమైన ఆంక్షలను ప్రవేశపెట్టారు. మహిళలకు, పిల్లలకు ఎంట్రీ లేని ఈ పవిత్ర పర్వతం గుర్తింపు పొందిన కళాత్మక ప్రదేశం కూడా.
ఇప్పటికీ అక్కడ
మౌంట్ అథోస్ కేవలం ఒక మతపరమైన ప్రదేశం కాదు..ఇదొక ప్రత్యేక ప్రపంచం లాంటిది. ఇక్కడ ఉన్న క్రైసవ మఠాలలో నేటీకి 2000 మందికిపైగా సన్యాసులు నివసిస్తున్నారని సమాచారం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో ఇప్పటికీ కూడా పురాతన సంప్రదాయాలు పాటించబడుతున్నాయి. ఇలాంటి చోట పెరిగిన మిహైలో టోలోటోస్..తన జీవింతాతం క్రైస్తవ ఆశ్రమాన్ని విడిచి బయటకు వెళ్లలేదు. బయట ప్రపంచం టెక్నాలజీ, అనేక మార్పులతో అభివృద్ధి చెందుతున్నా మిహైలో టోలోటోస్ మాత్రం క్రైస్తవ మఠం రూల్స్ ని పాటిస్తూ ఉండిపోయాడు. 1938లో అతను మరణించాడు. మౌంట్ అథోస్ సన్యాసులు మిహైలో టోలోటోస్ కి ఒక ప్రత్యేక ఖననం నిర్వహించారు. మిహైలో టోలోటోస్ తన జీవితంలో ఎప్పుడూ కారు, విమానం, సినిమా కూడా చూడలేదంట.



Click it and Unblock the Notifications