Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Viral video : ప్రేయసిని వళ్లో కూర్చొబెట్టుకొని బైక్ రైడింగ్.. బెంగళూరు పోలీసుల చేతిలో బుక్..!
ఆర్ ఎక్స్ 100 సినిమాలో "పిల్లా రా" పాటలో హీరోయిన్‌ను హీరో బైక్ ముందట కూర్చోబెట్టుకొని నడుపుతాడు. ఆ సీన్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అలాంటి స్టంట్లు తరువాత చాలా మందే చేశారు. సరిగ్గా ఇలాంటి సీనే బెంగళూరు రోడ్డులో కనిపించింది. ప్రైమసిని బైక్ ముందట కూర్చోబెట్టుకొని ఓ వ్యక్తి ఫ్లైఓవర్‌పై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు పోలీస్ దీనిపై స్పందించి సదరు బైక్ రైడర్‌పై కేసు బుక్ చేశారు.
మే 17 రాత్రి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న రోడ్డుపై ఒక ప్రేమ జంట అందరినీ ఆకట్టుకుంటూ మరోవైపు మరికొంతమందిలో ఆందోళన చెలరేగిస్తూ రోడ్డుపై రొమాంటిక్‌గా దూసుకొని పోతున్నారు. ఈ వీడియోను బెంగళూరు పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సదరు బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు, ప్రేయసిని ముందు తన వళ్లో కూర్చోబెట్టుకున్నాడు. రోడ్డుపైన ఉన్న ఎవ్వరితో సంబంధం లేనట్టుగా ఫ్లైఓవర్ పైనుండి బైక్ నడుపుతూ వున్నాడు. ఈ వీడియోను అపలోడ్ చేసిన కొన్ని గంటల్లోనే వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రోడ్డు వున్నది స్టంట్లు చేయడానికి కాదని వాటిని సురక్షితంగా వుంచుకోవాల్సిన బాధ్యత అందరికీ వుందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బెంగళూరులోని హెబ్బల్ ట్రాఫిక్ పోలీసులు ఆ యువకుడిని తరువాత అరెస్ట్ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్న ఫోటోను కూడా అదే వీడియోలో అపలోడ్ చేయడం చూడవచ్చు. బెంగళూరు రోడ్లు అందరి సురక్షితం కోసం వున్నాయని, సమస్యలను సృష్టించడానికి లేదని వీడియోలో పోలీసులు స్పష్టం చేశారు.

వీడియోపై నెటిజన్ల కామెంట్లు
వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బైక్ రైడర్‌తో పాటు ఆమెను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయలేదని, చట్టం పురుషులనే టార్గెట్ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. సినిమాలో ఇలాంటి స్టంట్లకు కారణమని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అమ్మాయిని అరెస్ట్ చేయకుండా సమానత్వం ఎలా సాధ్యమౌతుందని ఇంకో నెటిజన్ ఫైర్ అయ్యాడు.
వరర్ట్ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో బెంగళూరు టాప్
ట్రాఫిక్‌పై అధికారిక లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయ్. ప్రపంచ వ్యాప్తంగా అత్యతం భారీ, చిరాకు తెప్పించే ట్రాఫ్‌క్ ఉన్న నగరాల్లో బెంగళూరు 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023వ సంవత్సరానికి టామ్‌టామ్ రిపోర్ట్ ట్రాఫిక్‌కు సంబంధించిన ఈ అధికారిక లెక్కలను ప్రచురించింది. బెంగళూరులో 10 కిలోమీటర్లు రోడ్డుపై ప్రయాణం చేయాలంటే సాధారణంగా 28 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేశారు. ఈ లిస్ట్‌లో లండన్ నగరం టాప్‌లో వుండడం విశేషం.
బెంగళూరు నగరంలో రోడ్డు ప్రమాదాలు
జాతీయ నేర గణాంకాల ప్రకారం 2023వ సంవత్సరంలో బెంగళూరు నగరంలో 870 ఘోరమైన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయ్. ఆ ప్రమాదాల్లో 899 మంది మరిణించారు. 10 సంవత్సరాల్లో ఇదే అత్యధికమని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో 70 శాతం బైక్ యాక్సిడెంట్లేనని పోలీసులు చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం.
జనావాసాలు వుండే ప్రదేశంలో స్టంట్లు చేయడం వల్ల అటు స్టంట్ చేసే వారికి మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్లే వారికి కూడా తీవ్ర ఇబ్బందలను, ప్రాణాలు పోయే పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు ప్రయాణించే ప్రదేశంలో స్టంట్లు చేయకపోవడం చాలా ఉత్తమం.



Click it and Unblock the Notifications