Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కారు నడుస్తుండగానే కారు పైకి ఎక్కిన డైవర్..! మండిపడుతున్న నెటిజెన్లు..!
పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్‌లను, ఫాలోవర్లను పెంచుకోవడానికి స్టంట్లతో వీడియోలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి కదులుతున్న కారు డోరు తీసి, డోరు సహాయంతో కారుపైకి ఎక్కి కెమెరాకు ఫోజు ఇచ్చాడు, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఒక పక్కైతే నెటిజన్లు ఇతనిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
అది రాజస్థాన్‌లోని ఒక ప్రదేశం అక్కడ ఒక హైవేరోడ్లు, స్ట్రీట్‌లైట్ల వెలుగులో ఒక కారు వేగంగా వెళ్తోంది. ఆ కారు డ్రైవర్ సీటులోంచి ఒక వ్యక్తి డోరు తీసి డోరుకు కాలు పెట్టి నిలబడ్డాడు. నిలబడి కారుపైకి ఎక్కాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఒక నెటిజన్ పోస్ట్ చేసింది. ఇక ఆ కారు నంబరు విషయానికి వస్తే నంబర్ ప్లేటుపై RJ17CB8495 అని రాసి వుంది.
ఇంటర్నెట్‌లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ పోస్టును ముంబై ట్రాఫిక్ పోలీసులు చూసి రాజస్థాన్ పోలీసులను అలర్ట్ చేసింది. దీనిపై పోలీస్ ఆఫీసర్ తగిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులు పోస్ట్ చేశారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూలు సొంతం చేసుకున్నాయ్. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ చేయాలని కోరుతున్నారు.

పాఠాలు నేర్పని పూనే పోర్చ్ కారు దుర్ఘటన
'ఇటీవల పూనెేలో ఒక టీనేజర్ పోర్చ్ కారును నడుపుతూ ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఇలాంటి వారికి ఇంకా బుద్ధి రావడం లేదని సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు'.
'దేశంలో ఇలాంటి స్టంట్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయ్. ఈ స్టంట్లను ఎంకరేజ్ చేయడం కూడా నేరంగా పరిగణించాలి. సమాజంలో కూడా చాలా మంది ఇలాంటి స్టంట్లను వ్యతిరేకిస్తున్నా వ్యక్తిగత ఆనందం కోసం ఇలాంటి స్టంట్లకు పాల్పడుతున్నారు'.
'ఈ వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన'
'సోషల్ మీడియాలో ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు వచ్చినప్పుడు నెటిజన్లు తమవంతు బాధ్యతగా స్పందిస్తున్నారు. ఈ వాడియోను చూసి సోషల్ మీడియాలో నెటిజెన్లు ఎలా స్పందించాలో కింద ఇస్తున్నాము'.
'వాహ్ నంబర్ కూడా వుంది కదా.. రాజస్థాన్ పోలీస్ గారూ, ప్లీజ్ ఇతని డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయండి'.
'నేను ఈ వీడియోను యాంబులెన్స్ అపలోడ్ చేస్తదని అనుకున్నా'
'ఈ వీడియో రెండవ పార్ట్ రాజస్థాన్ పోలీస్ అప్‌లోడ్ చేస్తుంది'.
'అమాయక సిటీజన్లు ఈ స్టంటుల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. పూనే పోర్చ్ ఘటన మళ్లీ జరగొద్దంటే ఖచ్ఛితంగా డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేయాల్సిందే'.
'పోలీసులంటే భయం లేదు, డబ్బు కట్టి, పరీక్షలు రాసి తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయ్'.
'పోలీసులు ఇతని వీడియోను కూడా ప్రస్తుతం షూట్ చేస్తుండొచ్చు ఆగండి త్వరలోనే ఆ వీడియో బయటకు వస్తుంది'.
'కిందపడితేనే ఇలాంటి వారికి బుద్ధి వస్తుంది'.
'ఇది చూస్తే తల్లిదండ్రులు కూడా అతన్ని వదలరు'
"అతనికి అతను సూపర్ మ్యాన్ అనుకుంటున్నాడా"



Click it and Unblock the Notifications