Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
హోలీ నుంచి ఉగాది వరకు..2026 మార్చి నెల ముఖ్యమైన పండుగలు, తేదీల వివరాలు ఇవే!
హిందూ క్యాలెండర్ లో మార్చి నెల అంటేనే పండుగల పర్వదినం. చలికాలానికి టాటా చెబుతూ వసంత రుతువుకు స్వాగతం పలికే ఈ నెల ప్రకృతిలోనే కాదు మన మనసుల్లో కూడా సరికొత్త ఉత్తేజం నింపుతుంది. ఒకవైపు శీతాకాలపు చలి గాలులు నెమ్మదిగా వీడ్కోలు పలుకుతుంటే, మరోవైపు లేత ఎండల వెచ్చదనం మనల్ని పలకరిస్తుంది.
చెట్లు పాత ఆకులు రాల్చి, సరికొత్త చిగుళ్లతో ముస్తాబవుతాయి. కోకిలల సుమధుర గానంతో ప్రకృతి అంతా వసంత రుతువుకు ఘనంగా స్వాగతం పలుకుతుంది. 2026 మార్చి నెల మనకు ఎన్నో అద్భుతమైన పండుగలను, వేడుకలను మోసుకొస్తోంది. రంగుల కేరింతలు, షడ్రుచుల సమ్మేళనాలు, ఆధ్యాత్మిక చింతనలతో ముడిపడి ఉన్న మార్చి 2026 ముఖ్యమైన పండుగలు, వాటి విశేషాలు ఇక్కడ చూడండి.

మార్చి 2026లో ముఖ్యమైన పండుగలు
హోలీ
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలీ పండుగను 2026లో మార్చి 4వ తేదీ (బుధవారం) నాడు ఘనంగా జరుపుకోనున్నారు. మార్చి 3న సాయంత్రం హోలికా దహనంతో ఈ వేడుకలు మొదలవుతాయి. మరుసటి రోజు ఉదయం చిన్నా పెద్దా, ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకుంటారు.
జీవితం కూడా హోలీ రంగుల్లాగా ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరుపుకుంటారు. చర్మ సంరక్షణ కోసం రసాయనాలు లేని సహజ సిద్ధమైన రంగులతో సురక్షితంగా హోలీ ఆడుకోవడం ఉత్తమం.
రంగ పంచమి
హోలీ ఉత్సాహం ముగియకముందే సరిగ్గా ఐదు రోజుల తర్వాత మార్చి 8వ తేదీ (ఆదివారం) నాడు రంగ పంచమి వస్తుంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఈ రోజున కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ప్రతి ఇంటా వెలుగులు నింపే మహిళలకు అంకితమైన రోజు మార్చి 8. సమాజంలో మహిళలు సాధిస్తున్న విజయాలను, వారి అంతులేని త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు.
ఇంట్లో అమ్మగా, భార్యగా, సోదరిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న స్త్రీ మూర్తులకు గౌరవం అందించే ప్రత్యేకమైన రోజు ఇది. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఇది సరైన సమయం.
శీతలాష్టమి
మార్చి 11న శీతలాష్టమి జరుపుకుంటారు. సాంప్రదాయం ప్రకారం, ఈ రోజున అమ్మవారికి ముందు రోజు వండిన (చల్లబడిన) ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం, అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించాలని ప్రార్థిస్తారు.

ఉగాది
తెలుగువారికి అత్యంత ఇష్టమైన, అతి ముఖ్యమైన పండుగ ఉగాది. 2026లో ఉగాది మార్చి 19వ తేదీన వస్తోంది. ఈ రోజుతోనే తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది హిందూ నూతన సంవత్సరానికి నాంది పలుకుతుంది. తీపి (బెల్లం), పులుపు (చింతపండు), కారం (పచ్చిమిర్చి), ఉప్పు, వగరు (లేత మామిడికాయ), చేదు (వేపపువ్వు).. ఇలా షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడి ఈ పండుగ విశిష్టత. జీవితంలో వచ్చే కష్టసుఖాలను, ఆనందాలను, బాధలను సమానంగా స్వీకరించాలన్న గొప్ప జీవిత సత్యాన్ని ఈ పచ్చడి మనకు నేర్పుతుంది.
కొత్త బట్టలు, మామిడి ఆకుల తోరణాలు, గుళ్లలో ప్రత్యేక పూజలు, పండితుల పంచాంగ శ్రవణంతో ప్రతి తెలుగు వాకిలి పండుగ శోభను సంతరించుకుంటుంది. ఇదే రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు సాగే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి.

గంగౌర్ పూజ
ముఖ్యంగా రాజస్థాన్, నార్త్ ఇండియాలోని ాచలా ప్రాంతాల్లో మహిళలు తమ సౌభాగ్యం, వైవాహిక ఆనందం కోసం గౌరీ దేవిని అత్యంత భక్తితో పూజించే గంగౌర్ పండుగను మార్చి 21న జరుపుకుంటారు.
శ్రీరామ నవమి
మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జన్మదినాన్ని 2026లో మార్చి 27న జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామచంద్రుని జన్మదినాన్ని, సీతారాముల దివ్య కల్యాణోత్సవాన్ని భక్తులు కనుల పండువగా జరుపుకుంటారు. భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలలో జరిగే కల్యాణ మహోత్సవాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు.
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పానకం, చలవ చేసే వడపప్పు ప్రసాదాలు ఈ పండుగ ప్రత్యేకత. ఈ పవిత్రమైన రోజున రామాయణ పారాయణం చేస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం లేదా పూజ పూర్తయిన తర్వాత పానకం, వడపప్పు స్వీకరించి ఉపవాసాన్ని విరమిస్తుంటారు.



Click it and Unblock the Notifications











