Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
Mark zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ మామూలోడు కాదు, తొలి టోర్నీలోనే గోల్డ్, సిల్వర్ గెలిచాడు
మార్క్ జుకర్‌బర్గ్ అనగానే మెటా సీఈవో, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ అని మాత్రమే అనుకుంటారు. తన తెలివితేటలతో చిన్న వయస్సులోనే ఫేస్‌బుక్‌ను స్థాపించి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అయితే మార్క్ లో ఓ వ్యాపార వేత్త, ఓ టెక్ దిగ్గజం మాత్రమే కాదు ఓ క్రీడాకారుడు కూడా ఉన్నాడు.
తొలి టోర్నీలోనే రెండు పతకాలు:
తాజాగా మార్క్ జుకర్‌బర్గ్ జియు జిట్సు అనే క్రీడలో పాల్గొన్న మొదటి టోర్నమెంట్ లోనే ఏకంగా బంగారు, రజత పతకాలు గెలుచుకున్నాడు. టెక్ టైకూన్ గా అందరూ భావించే మార్క్ జుకర్‌బర్గ్.. ఇలా ఓ క్రీడలో పాల్గొని అందులో గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలవడం విశేషం.

ఫేస్‌బుక్ లో ఈ టోర్నీ చిత్రాలను పంచుకున్నాడు మార్క్. ' నా మొదటి జియు జిట్సు టోర్నీలో పోటీ పడి గెరిల్లా జియు జిట్సు జట్టు కోసం కొన్ని పతకాలు సాధించాను. నాకు శిక్షణ ఇచ్చినందుకు డేవ్ కమరిల్లో, ఖైవు, జేమ్స్ టెర్రీకి థ్యాంక్స్' అంటూ మార్క్ జుకర్‌బర్గ్ రాసుకొచ్చాడు.
మార్క్ సైలెంట్ కిల్లర్:
మార్క్ జుకర్‌బర్గ్ మిక్స్‌డ్ మార్షర్ ఆర్ట్స్(MMA) శిక్షణ తీసుకుంటున్నట్లు గత సెప్టెంబర్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మార్క్ జియు జిట్సులో శిక్షణ తీసుకున్నాడు. ఆయనకు శిక్షణ ఇచ్చిన వారు మార్క్ ను సైలెంట్ కిల్లర్ గా పిలుస్తారు.
జియు జిట్సు అంటే ఏంటి:
జియు జిట్సు అనే పదం జపాన్ భాషలోనిది. జియు అంటే జెంటిల్(సున్నితమైనది, సౌమ్యమైనది), జిట్సు అంటే ఆర్ట్(కళ) అని అర్థం. జియు జిట్సును జెంటిల్ ఆర్ట్ అని కూడా అంటారు. దీనిని బ్రెజిలియన్ జియు జిట్సు(BJJ) అనే పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రీడ మొదట్లో జపాన్ లో ఆడే వారు, కాలక్రమేణ బ్రెజిల్ లో అభివృద్ధి చెందింది.
జియు జిట్సులో ప్రాథమికంగా గ్రౌండ్ ఫైటింగ్ ఉంటుంది. జాయింట్ లాక్‌లు, చోక్‌హోల్డ్‌లు, సబ్‌మిషన్‌లు వంటి వివిధ స్కిల్స్ ఉపయోగించి పాయింట్లు సాధిస్తారు. ప్రత్యర్థిని లాక్ చేసి విజయం సాధించాలి లేదంటే ప్రత్యర్థి కంటే ఎక్కువ పాయింట్లు గెలుచుకోవాలి.



Click it and Unblock the Notifications
