Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
May Day Wishes: ప్రపంచాన్ని నడిపే శ్రామిక శక్తికి వందనం..కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను ఇలా చెప్పుకోండి
ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికలు చేసే పనిని అభినందించడం, గౌరవించడం దీని ఉద్దేశ్యం. 19వ శతాబ్దంలో కార్మికులు ఎదుర్కొన్న తీవ్రమైన పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల జ్ణాపకార్థంగా ఈ రోజును జరుపుకుంటారు. అప్పట్లో కార్మికులు రోజుకు 12 గంటలకు పైనే పని చేయాల్సి వచ్చేది.. తక్కువ జీతాలు, వర్క్ ప్లేస్ లో కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. ఈ పరిస్థితులు మార్చడానికి కార్మికులు సమ్మెలు, నిరసనలు చేపట్టారు.
1886లో అమెరికాలోని చికాగోలు 8 గంటల వర్క్ డే కోసం కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై పెద్ద బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో అనేకమంది మరణించారు. చాలామంది గాయపడ్డారు. ఈ సమ్మె సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనలు కార్మిక ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు గుర్తుగా,వారి త్యాగ్యానికి గౌరవంగా ప్రతి ఏటా మే1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.

1889లో పారిస్ లో జరిగిన రెండవ అంతర్జాతీయ సమావేశంలో చికాగో సంఘటనను గుర్తుచేసుకోడానికి, ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కల కోసం పోరాటాన్ని పమన్వయం చేయడానికి మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుంచి మే డే కార్మికుల ఐక్యతకు వారి హక్కుల సాధనకు,సమాజానికి కార్మికులు చేస్తున్న కృషికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులు, బంధుమిత్రులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు, కార్మికులకు పంపగలిగే కొన్ని అద్భుతమైన శుభాకాంక్షల సందేశాలు ఇక్కడ చూడండి.
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను ఇలా తెలుగులో చెప్పుకోండి
-ప్రపంచాన్ని నడిపే శ్రామిక శక్తికి వందనం. కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు.
-కష్టజీవులందరికీ నా హృదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు సుఖమయం కావాలి.
-శ్రమ జీవుల స్వేదమే దేశానికి నిజమైన సంపద. మే డే శుభాకాంక్షలు.
-కష్టించే ప్రతి గుండెకు వందనం. కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు.
-సమానత్వం కోసం, న్యాయం కోసం కార్మికుల ఐక్యత వ్యర్థిల్లాల్లి. మే డే శుభాకాంక్షలు.
-కష్టంలోనే ఉంది విజయం. శ్రమను గౌరవిద్దాం,కార్మికులను ప్రోత్సహిద్దాం.
-కార్మిక శక్తికి జోహార్లు. మీ కృషి ఎప్పటికీ మర్చిపోలేము. హ్యాపీ లేబర్ డే.
-ప్రతి పనిలోనూ ఒక గౌరవం ఉంటుంది. ఏ పని చిన్నది కాదు. హ్యాపీ లేబర్ డే.
-కార్మికుల కలలు నిజం కావాలి. మే డే ఆకాంక్ష ఇదే.
-నిజమైన హీరోలు మీరే. మీ శ్రమకు ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-మీ కలలను నెరవేర్చేవాడు కూలీ. కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు.
-మీ హస్తాల మీదుగా ఎదిగిన ప్రపంచానికి వందనం. మే డే శుభాకాంక్షలు.
-శ్రమ గొప్పతనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే.
-హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం స్ఫూర్తిదాయకం. మే డే శుభాకాంక్షలు.
-శ్రమను ఆరాధిద్దాం. కార్మికులకు అండగా నిలుద్దాం. హ్యాపీ మే డే.
-కష్టపడి పనిచేయండి,సిగ్గుపడకండి..బలవంతంగా కాకుండా కార్మికుడిగా ఉండండి..బలవంతంగా కాకుండా బలంగా ఉండు. కష్టపడి పనిచేసేవాళ్లే ప్రగతిశీలులు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-శ్రమయే జీవితం, శ్రమించేవారికే విజయం. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-శ్రమతోనే అభివృద్ధి సాధ్యం. శ్రామికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-మీ శ్రమ ఒక వెలుగులా అందరికీ మార్గదర్శకం కావాలి. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కార్మిక ఐక్యతకు జై. హ్యాపీ లేబర్ డే.
-ఈ రోజు మన శ్రమను గౌరవించుకునే రోజు.హ్యాపీ లేబర్ డే.
-కష్టపడే వారిని ఎప్నపుడూ తక్కువ అంచనా వేయకండి. హ్యాపీ లేబర్ డే.
-ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో కష్టపడి పనిచేసే కార్మికులందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ లేబర్ డే.
-శ్రమతో వికసించే జీవితాలకు నా హృదయపూర్వక అభినందనలు. హ్యాపీ మే డే.
-మీ శ్రమతో మీరు చరిత్ర సృష్టించాలి. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-కార్మికులందరూ ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలి. ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-మీ శ్రమకు తగిన విలువ లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
-ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు.
-ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మీకు ఆనందం, విజయం కలగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ లేబర్ డే.
-కార్మికులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ జీవితం సుఖమయం కావాలి.
-కార్మికులందరూ తమ హక్కులను తెలుసుకోవాలి. ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-మీ శ్రమకు తగిన విలువ కట్టే రోజు రావాలి. అదే ఈ కార్మిక దినోత్సవం ఆకాంక్ష. హ్యాపీ లేబర్ డే.
-మీ పని ఒక కళ, మీ శ్రమ ఒక తపస్సు. ఈ రోజు మీ కష్టానికి సెలవు దినం.
-మీ చెమట చిందించిన ప్రతి బొట్టు ఒక విజయానికి నాంది. హ్యాపీ లేబర్ డే.
-శ్రమ ఒక యజ్ఞం, విజయం దాని ఫలితం. హ్యాపీ లేబర్ డే.
-ప్రపంచ కార్మిక దినోత్సవం. శ్రమకు సెల్యూట్ చేసే రోజు.మే డే శుభాకాంక్షలు.
-శ్రమకు సెలవు లేదు, విజయానికి విశ్రాంతి లేదు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-కష్టంలోనే సుఖం ఉంటుంది, శ్రమలోనే విజయం ఉంటుంది. హ్యాపీ లేబర్ డే.
-మీ శ్రమ రేపటి తరానికి ఆదర్శం. హ్యాపీ మే డే.
-కష్టపడే ప్రతి చేయికి నా అభినందనలు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-ఐక్యత లేని కార్మికులు వేర్వేరు పుల్లల్లాంటివారు..కలిస్తే తిరుగులేని కట్టెలాంటివారు. కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు.
-కలిసి నడిస్తే కొండలైనా పిండి చేయొచ్చు. కార్మికుల ఐక్యతే మన బలం. హ్యాపీ లేబర్ డే.
-మనందరి గొంతుక ఒకటై వినిపిస్తే తిరుగుండదు. కార్మిక ఐక్యతను చాటుదాం. హ్యాపీ లేబర్ డే.
-కలిసికట్టుగా నిలిస్తే మన హక్కులను సాధించగలం. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
-మన హక్కుల కోసం మనం పోరాడాలంటే ఐక్యత ముఖ్యం. కార్మిక ఐక్యతకు మద్దతు తెలుపుదాం.
-కలిసి నిలబడితే ఏ యజమాని మనల్ని విడదీయలేడు. కార్మిక ఐక్యత శాశ్వతంగా నిలవాలి.
-కార్మికుల ఐక్యత ముందు ఏ శక్తీ నిలవలేదు. హ్యాపీ లేబర్ డే.
-మనమంతా ఒకే కుటుంబం.. కార్మిక కుటుంబం. మన ఐక్యతను చాటుదాం. మే డే శుభాకాంక్షలు.
-వేర్వేరుగా ఉంటే బలహీనులం..ఒక్కటైతే శక్తిమంతులం. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. హ్యాపీ లేబర్ డే.



Click it and Unblock the Notifications