Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
వైద్య చరిత్రలో అద్భుతం..రెండు సార్లు పుట్టిన బాబు..ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారెంటీ!
చాలా సందర్భాలలో మెడికల్ మిరాకిల్ అనే పదం వింటుంటాం. అంటే డాక్టర్లు చేతులెత్తేసిన సమయంలో కూడా అద్భుతాలు జరిగి ఆ పేషెంట్ బతకడం లేదా నయం చేయలేము అనుకున్నది ఫట్ మని నయం అయిపోవడం లేదా ఎవ్వరికీ అంతుచిక్కకుండా తగ్గిపోవడం వంటివి మెడికల్ మిరాకిల్ గా చెబుతుంటారు. అయితే వైద్య శాస్త్రంలో ఇప్పటివరకు ఇలాంటిదెక్కడా వినలేదు, చూడలేదు అనేటువంటి ఓ మెడికల్ మిరాకిల్ తాజాగా బ్రిటన్ లో జరిగింది.
ఓ బేబి రెండుసార్లు భూమ్మీద జన్మించింది. రెండుసార్లు భూమ్మీద జన్మించడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే.. ఓ బేబీ నిజంగానే రెండుసార్లు జన్మించింది..అదెలాగో ఇప్పుడు చూద్దాం. బ్రిటన్ కు చెందిన 32 ఏళ్ల లూసీ ఇజాక్ 20 వారాల గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెకు ఆరోగ్య సమస్య వచ్చింది. కడుపులో నొప్పి వస్తుండటంతో హాస్పిటల్ కు వెళ్లి టెస్ట్ లు చేయించుకోగా ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ప్రసవం వరకు వేచి చూస్తే క్యాన్సర్ మరింత వ్యాప్తి చెంది మీ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని డాక్టర్లు లూసీకి చెప్పారు. ప్రాణాలు కాపాడాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో లూసీ దేవుడి మీద భారం వేసి గతేడాది అక్టోబర్ లో ఆపరేషన్ కి రెడీ అయ్యింది.

డాక్టర్లు చేసిన అద్భుతం
గర్భం చాలా మందు దశలో ఉండటంతో సాధారణ కీహోల్ ఆపరేషన్ సాధ్యం కాలేదు. దీంతో డాక్టర్లు మరో మార్గాన్ని అన్వేషించారు. డాక్టర్ సోలెయ్ మాని మజ్ద్ నేతృత్వంలోని 15 మంది వైద్యుల బృందం అరుదైన సంక్లిష్ఠమైన ఆపరేషన్ చేయాలని నిర్ణయించింది. గర్భంలో ఉన్న బేబీకి ఎలా ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగించడమే వారి లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా కొన్నిసార్లు మాత్రమే జరిగిన ఈ అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ 5 గంటల పాటు కొనసాగగా..ఏకంగా ఐదు గంటపాట పాటు సాగిన ఆపరేషన్ లో..లూసీ కడుపులోని బిడ్డతో సహా గర్భాశయన్ని డాక్టర్లు తాత్కాలికంగా బయటకు తీశారు. క్యాన్సర్ కణాలను తొలగించిన తర్వాత మళ్లీ ఆ గర్భాశయాన్ని లోపల ఉంచేశారు. దాదాపు 20 నిమిషాల పాటు లూసీ గర్భాశయం బయటనే ఉంది.
ఆ తర్వాత లూసీ పూర్తికాలం గర్భం మోసి ఈ ఏడాది జనవరి చివర్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు కూడా బాగా హెల్తీగా,మంచి బరువుతో పుట్టాడు. ఆ బాబుకి రాఫెర్టీ ఐజాక్ అని పేరు పెట్టారు. ఇటీవల లూసీ,ఆమె భర్త ఇటీవల జాన్ రాడిక్లిఫీ హాస్పిటల్ కు వెళ్లి ఆపరేషన్ చేసిన డాక్టర్ సోలెయ్ మాని మజ్డ్ ను కలిసి థ్యాంక్స్ చేశారు. ఆ బిడ్డను చూస్తుంటే ఏదో తెలియని అనుబంధం ఏర్పడిందని, ఆ ఆపరేషన్ చాలా అరుదైనదని,భావోద్వేగంతో కూడుకున్నదిగా డాక్టర్ సోలెయ్ మాని మజ్డ్ తెలిపారు.



Click it and Unblock the Notifications