Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
Mega Princess Horoscope: చిరు మనవరాలు సాక్షాత్తు శ్రీజగన్మాతే.. బిడ్డ జాతకం అద్భుతంగా ఉందన్న పండితులు
రామ్ చరణ్, ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన డెలివరీ అయింది. అలా మెగాస్టార్ కుటుంబంలోకి మహాలక్ష్మీ అడుగు పెట్టింది. మనవరాలి రాకతో చిరు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. మెగా కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు మెగా కపుల్ కు అభినందనలు తెలుపుతున్నారు.
తాజాగా ఆస్పత్రికి వెళ్లి తన ముద్దుల మనవరాలిని చూసొచ్చారు మెగాస్టార్ చిరు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. చెర్రీ దంపతులకు పాప పుట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున మనవరాలు జన్మించడం చాలా చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన చిరు.. వెల్‌కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ అని ట్వీట్ చేశారు.

మెగా ప్రిన్సెస్ జాతకం అద్భుతంగా ఉందన్న పండితులు:
చిరంజీవి మనవరాలి జాతకంపై పలువురు పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిరు మనవరాలి జాతకం అద్భుతంగా ఉందని అన్నారు. మేష లఘ్నంతో పాప జన్మించిందని తెలిపారు. ఆ చిన్నారి పునర్వసు నక్షత్రంలో పుట్టిందని అన్నారు. ఈ నక్షత్రం సాక్షాత్తు శ్రీ రాముడి నక్షత్రమని పేర్కొన్నారు.
విష్ణు అంశతో ఉన్న నక్షత్రంగా పండితులు వివరిస్తున్నారు. పార్వతీ దేవి, లక్ష్మీదేవి, సరస్వతి దేవి ముగ్గురమ్మల మూలపుటమ్మల అంశతో చిరు మనవరాలు పుట్టిందని పేర్కొన్నారు. చిరంజీవి మనవరాలు సాక్షాత్తూ జగన్మాతే అన్నారు. మంగళవారం జూన్ 20 వ తేదీన పూరీ జగన్నాథుడి రథయాత్రం ప్రారంభం అయింది. అలా కూడా ఈ రోజు చాలా శుభప్రదమైనదిగా పండితులు పేర్కొంటున్నారు.
ఇంతటి గొప్ప రోజున సాక్షాత్తు మహాలక్ష్మి దేవిగా ఆ ఆడబిడ్డ మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టిందని చెప్పారు. ఈ చిన్నారి రాబోయే రోజుల్లో రామ్ చరణ్, ఉపాసన కుటుంబాల పేరు ప్రతిష్టను పెంచుతుందని అన్నారు. మెగా కీర్తి మరింతగా పెరుగుతుందని చెప్పారు.
మెగా ఫ్యామిలీకి, నంబర్ 2కు మధ్య సంబంధం:
మెగా ఫ్యామిలీకి, నంబర్ 2కు మధ్య విడదీయరాని అనుభందం ఉంది. వారు తలపెట్టే పనిలో, ముఖ్యమైన సందర్భాల్లో 2 నంబర్ తప్పక చూస్తారని అంటారు. న్యూమరాలజీ ప్రకారం రెండు నంబర్ మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని కూడా చెప్పుకోవాలి.
మెగాస్టార్ చిరు వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చింది చేసింది చిరుత. ఇది పెద్దగా ఆడలేదు. కానీ రెండో సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే రామ్ చరణ్ స్టార్ గా ఎదిగారు. 2012 లో రామ్ చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు ఈ మధ్యే వారి 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అలా 12వ వసంతంలోకి అడుగుపెట్టారు.
ఇవాళ 20వ తేదీ. ఈరోజు ఉదయమే ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగాస్టార్ చిరు పుట్టిన రోజు ఆగస్టు 22. పవన్ కళ్యాణ్ బర్త్ డే కూడా సెప్టెంబర్ 2. ఎలా చూసినా మెగా ఫ్యామిలీకి రెండో నంబర్ కు విడదీయరాని అనుబంధం ఉంది. అలా పాప పుట్టిన తేదీ కూడా 2 కలిసి రావడం అద్భుతమని ఫ్యాన్స్ అంటున్నారు.



Click it and Unblock the Notifications