Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
అందరికీ గుడ్‌బాయ్ చెప్పిన మీమ్ డాగ్.. లివర్ వ్యాధితో మృతి చెందిన ఇంటర్నెట్ సెన్సేషన్ కబోసు..!
మీమ్ డాగ్ అనగానే మనకు ఒక కుక్కు గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ కుక్క ప్రాణాలు విడిచింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆ మీమ్ డాగ్ పేరు కబోసు. ఈ మీమ్ డాడ్ మీమ్‌ను ఎలాన్ మస్క్ కూడా తరచుగా ఉపయోగిస్తారు. ఆయనకు మీమ్స్ అంటే చాలా సరదా. ఇక మీమ్ ప్రపంచలో ఈ మీమ్ డాగ్ రారాజు అని చెప్పుకోవచ్చు. కేవలం తక ఒక్క చూపుతో వేల భావాలను ఈ మీమ్ డాగ్ పలికించగలదు. క్రిప్టోకరెన్సీలో డాచికాయిన్ గుర్తుగా ఈ మీమ్‌గాక్ పిక్‌నే ఎలాన్ మస్క్ చేర్చారంటే దీనికి ప్రపంచంలో వున్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.
ఈ డాగ్ సెలబ్రిటీ తన తుదిశ్వాసను విడిచి మొత్తం నెటిజన్లను, ప్రపంచంలో ఎంతో మందిని శోకసంద్రంలో ముంచింది. ఈ కుక్క అసలు పేరు కబుసో, ముద్దగా డాజీ, డాగీ పేరుతో పాపులారిటీ సంపాదించుకుంది. దీని ఓనర్ పేరు అట్సుకో. జపాన్‌లోని నారా నగరంలో తన యజమాని ఇంట్లో వుంటోంది. నిద్దరలోనే డాజీ తుది శ్వాస విడిచింది.

డాగీ మీమ్స్ మొదలైంది కబోసు నుండే. అసలు మీమ్స్ కు పాపులారిటీ తెచ్చింది కూడా కబోసూనే అని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కబోసుకు చెందిన ఒక ఫోటో ఇంటర్నెట్‌లో బాగా వైరల్‌గా మారింది. ఆ ఒక్క ఫోటోలో అనంతమైన భావాలను చాలా మంది ఊహించుకున్నారు. దీంతో ఆ ఒక్క ఫోటోతోనే మీమ్లు క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. 2008లో కబోసును తన యజమాని అట్సుకో దత్తత తీసుకొని పెంచడం ప్రారంభించారు.
కబోసు ఫోటో పై మీమ్లు గత రెండు మూడేళ్ల నుంచే వస్తున్నా.. కబోసు ఫోటోలకు పాపులరిటీ మాత్రం 2010లోనే స్టార్ట్ అయింది. ఈ డాజీ మీమ్ ఫోటో ఎన్‌ఎఫ్‌టీలో 40 లక్షల డాలర్లకు అమ్ముడైందంటే ఈ కక్కకు వున్న పాపులారిటీని అర్ధం చేసుకోవచ్చు. ఈ కుక్కు పేరుపై క్రిప్టోను తీసుకురావడంతో దానికి కూడా పాపులారిటీ వచ్చింది. ఈ కుక్కు పేరుపై వున్న డాగీ కాయిన్ మొత్తం క్రిప్టో కరెన్సీలో 8వ స్థానంలో వుంది.
కబోసు గతంలో లుకేమియా వ్యాధికి గురై చికిత్స తీసుకుంది. అప్పటి నుంచి చాలా బలహీనంగా వున్నట్లు యజమాని తెలిపాడు. ఇక సాధారణంగా ఒక కుక్కు జీవిత కాలం 14 నుంచి 16 ఏళ్లవరకు వుంటుంది. ఈ డాజీకి చనిపోయేప్పటికే వయసు 17 ఏళ్లు నిండిపోయాయ్. అంటే ఈ కుక్క చాలా ఏళ్లే బ్రతికిందని చెప్పుకోవచ్చు. జపాన్‌లో సహజంగా జీవిత కాలం రేటు చాలా ఎక్కువగా వుంటుంది. దీనికి వారి ఆహార అలవాట్లు, వాతావరణం, జీవిన విధానమే కారణం. కుక్క కూడా అలాగే దాదాపు నిండు నూరేళ్లు బ్రతికందని అనుకోవచ్చు.
ఇక కబోసు సంస్మరణ దినాన్ని మే 24న నిర్వహించనున్నట్లు కుక్కు యజమాని అట్సుకో స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరి ముఖాలపై చిరునవ్వును పూయించిన డాగీ ఇప్పుడు వాళ్లందరినీ శోకసంద్రంలో ముంచుతోంది. డాగీకి అనంతమైన ప్రేమను, ఆనందాన్ని పంచడం తప్ప ఏమీ తెలియదని డాగీ కాయిన్ స్పందించింది. డాగీ వెళ్లిపోయినా మీమ్లు మాత్రం కొనసాగుతూనే వుంటాయ్.



Click it and Unblock the Notifications
