Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
భర్త రతి మన్మధుడు అయితే ?, కెవ్వుకేక, తాత ముత్తాతల ఆచారం అదుర్స్
హిందూ సంప్రధాయాల ప్రకారాం పూర్వ కాలం నుంచి వస్తున్న కొన్ని ఆచారాలను ఇప్పటికి మనవాళ్లు పాటిస్తుంటారు. పెద్దలు ఇచ్చిన ఆచారాన్ని భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఇప్పటికి పాటిస్తున్నారు. భారతదేశంలో హోలీ పండుగ ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హోలీ రోజు రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు.
హోలీ పండుగ అంటే ఎక్కువగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారని ప్రచారంలో ఉంది, అయితే హోలీ పండుగ రోజు తెలుగువాళ్లు చాలా ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాలతో కొత్తగా, వింతగా జరుపుంటారని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. హోలీ అంటే రంగులు చల్లుకోవడమే కాదని, మగవాళ్లు ఆడవాళ్లలా చీరలు కట్టుకుని, బంగారు నగలు అలంకరించుకుని, ప్రత్యేకంగా పిండివంటలు చేసి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ఈ ఆచారం ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఆచారం పాటిస్తున్నారని వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలోని సంతేకుళ్ళురు గ్రామంలో హొలీ పండుగ చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ రోజు మగవాళ్లు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులు తీర్చడం ఆనవాయితీగా వస్తోంది
సంతేకుళ్లురు గ్రామంలో నివాసం ఉండే వారి ఆచారం చాలా సంవత్సరాల నుంచి సంప్రదాయంగా వస్తోంది. హొలీ పండగ వచ్చిందంటే ఆ గ్రామంలో నివాసం ఉండే వాళ్లకు చాలా ప్రత్యేకత. ఉదయం ఆడవాళ్లు శుభ్రంగా స్నానంచేసి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తారు. మగవాళ్ళు చీరలు కట్టుకొని, బంగారు ఆభరణాలు ఒంటి మీద వేసుకొని ముస్తాబవుతారు.
ఇది వారి తాత, ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్లలాగా చీరలు కట్టుకుని, ఒంటి నిండా నగలు వేసుకుంటారు. అంతే కాకుండా హోలీ పండుగ రోజు ఇలా ముస్తాబు అయ్యి ప్రత్యేకంగా పిండి వంటలు చేసి తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేసిన తరువాత వారి కోరికలు ఏమైా ఉంటే మళ్లీ కోరుకుంటారు.

ఇలాంటి ఆచారాం మేము ప్రత్యేకంగా కనిపెట్టింది కాదని, మా పూర్వకాలం నుంచి వస్తోందని, మా ముత్తాతలు, తాతలు, మా నాన్నలు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారని, ఇప్పుడు మేము కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని, రాబొయే రోజుల్లో మా పిల్లలు ఈ ఆచారాన్ని పాటిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందని హోలీ రోజు ప్రత్యేక పూజలు చేసిన కొందరు మగవాళ్లు అన్నారు. మొత్తం మీద మగాళ్లు ఆడవాళ్లలా తయారు అయ్యి ప్రత్యేక పూజలు చెయ్యడం వింత ఆచారమనే చెప్పాలి.



Click it and Unblock the Notifications