Latest Updates
-
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి
పీరియడ్ వచ్చిందని లీవ్ అడిగిన విద్యార్థిని..బట్టలిప్పి చూపించాలన్న కాలేజీ!
ప్రతి ఏటా ఫిబ్రవరి 28న మెన్ స్ట్రువల్ హైజీన్ డే(బుతు పరిశుభ్రత దినోత్సవం)జరుపుకుంటారు. బుతు పరిశుభ్రత నిర్వహణ(MHM)గురించి ప్రజల్లో అవగాహన పెంచడం దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం. అదే సమయంలో బుతుక్రమ సమయంలో మహిళలు ఎదుర్కొనే అనేక సవాళ్లను కూడా పరిష్కరించడం కూడా. అయితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మెన్ స్ట్రువల్ హైజీన్ డే 2025 జరుపుకుంటున్న సమయంలో ఓ విద్యార్థిని పీరియడ్ లీవ్ పట్ల ఓ కాలేజీ యాజమాన్యం వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాలేజీ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే
బీజింగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి అనుబంధ కాలేజీ అయిన గెంగ్డాన్ ఇనిస్టిట్యూట్ లో చదివే ఓ విద్యార్థిని మే 15,2025న తనకు పీరియడ్స్ కారణంగా సెలవు కావాలని కోరింది. దీంతో ఆ విద్యార్థినిని క్యాంపస్ లోని క్లినిక్ కు తీసుకెళ్లి నీ బట్టలు విప్పి చూపించు నీకు నిజంగా పీరియడ్స్ వస్తుంటే లీవ్ ఇస్తామని చెప్పారు. క్లినిక్ స్టాఫ్ మెంబర్ తనను బట్టలిప్పమనడం విని తాను షాక్ అయ్యానని, ఇబ్బందికరంగా ఫీల్ అయ్యానంటూ ఆ విద్యార్థిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపింది. అయితే కాలేజీలోని అందరు ఆడవాళ్లకి ఇదే రూల్ వస్తుందా లేక తనకే ఈ రూల్ వర్తిస్తుందా అని ఆ విద్యార్థిని వారిని అడగ్గా..ఇది అందరికీ వర్తించే రూల్,వ్యక్తిగత నిర్ణయం కాదంటూ క్లిక్ స్టాఫ్ మెంబర్ రిప్లై ఇచ్చింది. అయితే ఆ రూల్ రాత కాపీని తనకు ఇవ్వాలని విద్యార్థిని అడగ్గా..అలా ఇవ్వం నువ్వు హాస్పిటల్ కు వెళ్లు అని చెప్పేశారు.

అయితే విద్యార్థిని అంగీకారంతోనే తాము ఎగ్గామినేషన్ చేశామని, ఎలాంటి మెడికల్ టెస్టులు చేయలేదని, ఎలాంటి పరికరాలు వాడలేదని యూనివర్శిటీ తెలిపింది. విద్యార్థినిలు తరుచుగా పీరియడ్స్ ఇష్యూస్ అంటూ తరచుగా లీవ్ తీసుకుంటుంటారని, దానికి అడ్డుకట్ట వేసేందుకు తాము ఆ పాలసీ తీసుకున్నట్లు సూ అనే ఓ కాలేజీ స్టాఫ్ మెంబర్ చెప్పారు.
అయితే కాలేజీ తీరుపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ దరిద్రమైన రూల్ ని వెంటనే తొలగించాలంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పాలసీ మహిళా విద్యార్థుల ప్రైవసీని ఉల్లంఘిస్తోందని, మహిళలను కాపాడే చైనా చట్టాలకు విరుద్దంగా ఉందని చైనాకు చెందిన మాజీ లాయర్ జంగ్ యంగ్ క్వాన్ తెలిపారు. దీనిని లైంగిక వేధింపులుగానే చూడాలని అన్నారు.
అయితే కాలేజీ యాజమాన్యం గనుక ఆ పాలపీ రాతపూర్వక కాపీని తనకు అందిస్తేనే తాను సోషల్ మీడియాలో పెట్టిన తన పోస్టులు తొలగిస్తానని బాధిత విద్యార్థి తెగేసి చెప్పింది.



Click it and Unblock the Notifications