జులై 17న బుధుడు, చంద్రుడి కలయిక - ఈ మూడు రాశుల వాళ్లు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, బుధుడు గ్రహాలను.. తండ్రీ కొడుకులుగా వర్ణిస్తారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. బుధుడు జులై 8వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంలో జులై 17వ తేదీన చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి చంద్రునిచే పాలించబడుతుంది.

అయితే సొంత రాశిలో బుధుడు, చంద్రుడు కలిసి ఉండడం వల్ల పలు రాశుల వాళ్లు అనేక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీ జాతకంలో ఈ కలయిక ఏర్పడితే అపకీర్తిని పొందాల్సి వస్తుంది. అలాగే అనేక చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తుంది.

Mercury Moon Conjunction In Cancer On July 17th These Zodiac Signs Will Face Financial Problems Know In Telugu

కర్కాటక రాశిలో బుధ, చంద్ర కలయిక ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తున్నప్పటికీ.. ఓ మూడు రాశుల వాళ్లకి మాత్రం అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మూడు రాశుల వాళ్లలో కొన్ని విషయాలలో లాభదాయకంగా ఉన్నప్పటికీ, మరికొన్ని విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏ రాశి వారు ఏయే రాశుల వారి పట్ల జాగ్రత్తగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. మేషరాశి:

మేష రాశి 4వ ఇంట్లో చంద్రుడు, బుధుడు సంయోగం చెందబోతున్నారు. దీని వల్ల ఈ కాలంలో ఈ రాశుల వారి స్వభావం మృదువుగా ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా మాట్లాడే నైపుణ్యం బాగుంటుంది. ఎవైనా ప్రసంగాలు వంటివి ఇస్తే మొదటి బహుమతి పొందడం ఖాయం. అయితే ఈ కాలంలో తప్పుడు ఆరోపణలతో బాధపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీతోనే ఉంటూ మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్లు, మిమ్మల్ని మోసం చేసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీతో ఉన్న వారికి కూడా మీ విషయాలను ఎక్కువగా తెలియనీయకండి. అప్పుడే మీరు సంతోషంగా ఉండొచ్చు. సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే ఆరోగ్య పరంగా, ఊపిరితిత్తులు మరియు నరాల సమస్యలతో బాధపడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

2. మిథునరాశి:

బుధుడు మరియు చంద్రుడు మిథున రాశికి 2వ ఇంటిలో చేరతారు. దీని వల్ల ఈ రాశుల వారు ఈ కాలంలో ఇతరులకు ఆకర్షణీయంగా ఉంటారు. వీరు మాట్లాడే ప్రతీ మాట కూడా ఇతరులను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే వీరు ఈ సమయంలో చాలా తెలివిగా మాట్లాడతారు. సినిమాల్లో ట్రై చేయాలనుకునే వాళ్లకు ఇది చాలా మంచి సమయం. అలాగే కవిగా, వక్తగా మారాలనుకున్నా ఈ సమయాన్ని వాడుకోండి.

జులై 17వ తేదీ తర్వాత మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. స్నేహితులు, బంధువుల సహాయం కోరాల్సి వస్తుంది. ఆరోగ్య పరంగా మీరు ఒత్తిడికి గురవుతారు. అలాగే చంచలమైన మనస్సును కలిగి ఉంటారు. చేయాలనుకున్న పనులు చేయలేకపోవడం, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. వీటి వల్లే అడుగు ముందుకు వేయలేక అలాగే ఉండిపోతారు.

3. సింహ రాశి

సింహ రాశిలోని 12వ ఇంట్లో బుధుడు చంద్రుడు సంయోగం చెందబోతున్నారు. అందువలన ఈ రాశి చక్ర వ్యక్తులు ఈ కాలంలో ఆకర్షణీయమైన శరీరాకృతి మరియు చిరునవ్వుతో ఉంటారు. ఈ కాలంలో మంచి వక్త అవుతాడు. ప్రసంగాలు ఇస్తే ప్రజలను ఇట్టే ఆకట్టుకోవచ్చు. అలాగే విద్యార్థులు చదువులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలుసుకొని ముందడుగు వేయాలి.

సింహ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. డబ్బును అస్సలే ఆదా చేయలేరు. వ్యాపారంలో డబ్బు సమస్యలను ఎదుర్కునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఆరోగ్య పరంగా మీరు కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Friday, July 14, 2023, 14:00 [IST]
Desktop Bottom Promotion