Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
తెలంగాణ సంప్రదాయాలు సూపర్..మిస్ వరల్డ్ 2025 పోటీల్లో విన్నర్ ని అడిగిన ప్రశ్న ఇదే
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్ కి చెందిన సుచతా చువాంగ్ శ్రీ(suchata chuangsri) విశ్వసుందరిగా నిలిచారు. కేవలం అందంతోనే కాదు, తన తెలివితేటలు, వ్యక్తిత్వంతో ఓపల్ సుచతా మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఘనతతో ఆమె తన దేశానికి మొట్టమొదటి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే అందాల పోటీల ఫైనల్ లో ప్రశ్నోత్తరాల రౌండ్ లో బాలీవుడ్ నటుడు, జడ్జ్ అయిన సోను సూద్ అడిగిన ఒక ప్రశ్న అందరి హృదయాలను హత్తుకుంది. ఆ ప్రశ్నకు సుచత ఇచ్చిన సమాధానం ఆమెలోని మానవత్వాన్ని, లోతైన ఆలోచనలను ప్రతిబింబించింది.
సోను సూద్ అడిగిన ప్రశ్న ఏమిటంటే..కథలు చెప్పడంలో నిజాయితీ, వ్యక్తిగత బాధ్యత గురించి మీ మిస్ వరల్డ్ ప్రయాణం మీకు ఏమి నేర్పింది?..దీనికి ఓపల్ ఎంతో వినయంగాస్పష్టంగా సమాధానమిచ్చారు. "మనం ఎవరినైనా గౌరవించే వ్యక్తిగా ఉండాలి. వయసు, హోదాతో సంబంధం లేకుండా మనల్ని గౌరవించే ఒక్క వ్యక్తి అయినా మన జీవితంలో ఉంటారు. అది పిల్లలైనా, పెద్దలైనా, మన తల్లిదండ్రులైనా కావచ్చు.వారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా గౌరవిస్తారని నేను నమ్ముతాను. ప్రజలను నడిపించడానికి ఉత్తమ మార్గం మన చర్యలలో దయను చూపించడమే. మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం చేయగలిగే గొప్ప సహాయం అదే" అని జావాబిచ్చింది.
మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025 కిరీటాన్ని గెల్చుకున్న వారం రోజుల్లోనే.. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సుచతి గెల్చుకోవడం విశేషం. అంతేకాదు 2024లో మిస్ యూనివర్స్ పోటీలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించి మూడవ రన్నరప్ గా నిలిచింది.

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
అందాల పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాక ఇక్కడ బిర్యానీ అంటే తన ఫేవరెట్ డిష్ గా మారిందని ఆమె అన్నారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు తనకు చాలా నచ్చాయన్నారు. మిస్ వరల్డ్ కిరీటం ధరించి తన తోటి మిస్ వరల్డ్ పోటీదారులతో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
సుచతా బ్యాక్ గ్రౌండ్ ఇదే
థాయిలాండ్ లోని ఫుకెట్ లో సెప్టెంబర్ 30, 2003న జన్మించిన ఓపల్.. హోటళ్ల వ్యాపార కుటుంబంలో పెరిగారు. కాజోంకీట్సుక్సా స్కూల్, ట్రియామ్ ఉడోమ్ సుక్సా స్కూల్స్ లో విద్యాభ్యాసం చేశారు. ఇక్కడే ఆమె తన భావవ్యక్తీకరణ నైపుణ్యాలను, సాంస్కృతిక అవగాహనను పెంపొందించుకున్నారు. ఇంగ్లీష్, చైనీస్ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. భవిష్యత్తులో రాయబారి కావాలన్నది ఆమె లక్ష్యం. మనస్తత్వశాస్త్రం, ఆంత్రోపాలజీ పట్ల కూడా సుచతకు ఆసక్తి ఉంది. ఉకులేలే వాయిద్యాన్ని వెనుక వైపు నుండి వాయించడంలో ఆమెకు ప్రత్యేక ప్రతిభ ఉంది. అంతేకాకుండా ఆమెకు అనేక పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి.
ఆమె నినాదమైన ఇతరులు గౌరవించే వ్యక్తిగా ఉండటం అనే దానికి కట్టుబడి ఆరోగ్య అవగాహనను పెంపొందించడానికి, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే ప్రాముఖ్యతను తెలియజేయడానికి మిస్ వరల్డ్ తన జీవితాన్ని అంకితం చేశారు. 16 ఏళ్ల వయస్సులోనే సుచతా ఫర్ హర్ (Opal For Her) అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఆపరేషన్ ద్వారా తొలగించాల్సిన ఒక సాధారణ రొమ్ము గడ్డతో ఆమె పొందిన వ్యక్తిగత అనుభవమే ఈ ప్రచారానికి స్ఫూర్తి. జ్ఞానం, సరైన ఆరోగ్య సంరక్షణ ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలనేదే తన లక్ష్యమని ఆమె తెలిపారు.
ఈ అందాల పోటీ తన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని న్యాయనిర్ణేతలతో సుచతా అన్నారు. విజయం అంటే మీ జీవితాన్ని మీరు ఆనందంగా గడపడమే కాకుండా మీ చుట్టూ ఉన్నవారికి కూడా మెరుగైన జీవితాన్ని అందించడం అని ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.



Click it and Unblock the Notifications