Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ టిప్స్ పాటిస్తే మంత్ ఎండ్‌లో కూడా మీ జేబులు డబ్బులతో నిండుగా ఉంటాయి!
మంత్ ఎండ్ వచ్చిందంటే చాలు అందరి జేబులు ఖాళీ అయిపోతాయి. ప్రతి ఒక్కరూ ఇంకో వ్యక్తిపై ఆధారపడి ఆ మంత్ ఎండ్ రోజులను ముందుకు నెట్టుకొస్తుంటారు. సంపాదించిందంతా రూమ్ రెంట్ అని, తిండి కోసమని, బట్టలకోసమని ఇలా ఖర్చు అయిపోతుంటుంది. నెల చివరికి వచ్చేసరికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొందరికి అసలు పొదుపు చేయడమే రాదు. ఇలా ఉండడం వల్ల కొన్ని అత్యవసర పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సమయానికి డబ్బు అందక తీవ్రంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటిస్తే మంత్ ఎండ్‌లో కూడా జేబులు నిండుగా ఉంటాయి. ఆ చిట్కాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డబ్బును ఆదా చేసేందుకు పాటించాల్సిన చిట్కాలు
ఈ మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువయ్యాయి. వాటి వల్ల మనం ఎంత ఖర్చు చేస్తున్నాము? దేనికి ఎక్కువగా వెచ్చిస్తున్నాము అనేది తెలియకుండా పోతుంది. అందుకే డిజిటల్ చెల్లింపులు జరిపే యాప్‌లను ఎంత తక్కువగా వినియోగిస్తే అంత మంచిది. వాటిని పక్కన పడేయడం వల్ల ఖర్చు అదుపులో ఉంటుంది. అలాగే డబ్బులు కొంత ఆదా అవుతాయి.

ప్రతినెలా బడ్జెట్ ప్లాన్ ముందుగానే చేసి పెట్టుకోవాలి. ఈనెల ఎన్ని ఖర్చులు ఉన్నాయి? ఏది అవసరం? ఏది అనవసరం అనేది తెలుసుకోవాలి. మీ ఆదాయాన్ని అనవసరమైన, పనికిరాని వాటిపైన ఖర్చు పెట్టకుండా ఉండడానికి ఈ బడ్జెట్ ప్లాన్ బాగా పనికొస్తుంది. అలాగే డబ్బులు కూడా ఆదా అవుతాయి.
ప్రతినెలా ఎంత ఆదా చేయాలో నిర్ధారించుకోండి. కచ్చితంగా మీరు ఆదా చేసిన డబ్బును దుబారా ఖర్చులకు కాకుండా అతి ముఖ్యమైన ప్రమాదాలు వస్తేనే వినియోగించాలి. లేని యెడల అలానే ఉంచుకోవాలి. ఇలా ప్రతినెలా ఆదా చేయడం వల్ల సంవత్సరానికి అది ఎంతో డబ్బుగా కనిపిస్తుంది.
అలాగే డబ్బు ఆదా అవడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండేందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ డబ్బు ఆదా అవడంతో పాటు మంచిగా ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహారాన్ని తింటారు. దీంతో మీరు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.
ఆన్లైన్‌లో ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ ఆర్డర్ చేయడం తగ్గించుకోవాలి. వాటిని తగ్గించుకోవడం వల్ల అనవసరమైన వాటిని కొనుక్కోకుండా ఉంటాం. అలాగే ఖర్చు తగ్గుతుంది డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇంట్లోకి ఏది అవసరముంటుందో దానిని మాత్రమే బయటికి వెళ్లి తీసుకునేందుకు ప్రయత్నించాలి.
కొందరు కావాలని, అవసరం లేనప్పుడు కూడా ఆన్లైన్‌లో షాపింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వృధాగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. అందుకే అనవసరమైన సమయంలో కాకుండా అవసరమైన సమయంలో మాత్రమే దుస్తులు కొనుక్కోవాలి. లేదంటే మానేయాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మీరు కచ్చితంగా డబ్బును సేవ్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications