Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
మంకీవైరస్ వచ్చేస్తోంది.. లక్షణాలు, జాగ్రత్తలు ఇవే..
హాంకాంగ్‌లో కొత్త వైరస్ ఇప్పుడు ప్రపంచంలో అందరికీ గుబులు పుట్టిస్తుంది. కోతుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ డేంజర్ "మంకీ వైరస్" కేసులు ఇప్పటికే పలుదేశాల్లో బయటపడ్డాయ్.
హాంకాంగ్‌లో మొట్టమొదటి కేసు 37 ఏళ్ల పురుషుడికి సోకింది. పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో వెంటనే వైద్యులు అందరినీ అప్రమత్తం చేసారు. ఈ వైరస్ కోతుల నుంచి మనుషులకు వ్యాప్తిచెందుతుండడంతో కోతులకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. లేదంటే వాటి నుంచి వైరస్ తొందరగా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు.

మంకీ వైరస్ (హెర్పెస్ బి వైరస్)
మంకీ వైరస్‌కు మరోపేరు హెర్పెస్ బి వైరస్. బర్డ్ ఫ్ల్యూకు ఉన్న లక్షణాలే ఈ బివైరస్‌కు ఉన్నట్లు అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు కనుగ్గొన్నా్. ఈ వైరస్ సోకినవాలల్లో జ్వరం, కండరాల్ల నొప్పులు, తలనొప్పి, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం, వికారంగా ఉండడం లాంటి లక్షణాలు ఉంటాయ్. వ్యాధి సోకిన వారం తరువాత ఈ లక్షణాలుకనిపిస్తాయ్.
శరీరంలో మంకీ వైరస్ పెరుగుతున్నకొద్దీ వంటిపై దద్దుర్లు, కురుపులు వంటివి వస్తాయ్.
మంకీవైరస్ ట్రీట్మెంట్
ఈ మంకీవైరస్‌ను గుర్తించడానికి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఈ టెస్టులు నోటిలోని లాలాజలంతో లేదంటే దద్దుర్లు, కురుపుల నుంచి సాంపుల్స్‌ను తీసుకొని ఈ పీసీఆర్ టెస్ట్‌ను చేపడతారు.
ఈ వైరస్ కోతులకు సంబంధించిన లాలాజలం, మూత్రం, విసర్జనాల నుంచి వ్యాపిస్తుంది. కోతులు కరిచినా సరే ఈ బి వైరస్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. మనుషులు డైరక్ట్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఈ వైరస్ సులభంగా వ్యాప్తిచెందుతుంది. చింపాంజీలకు కూడా ఈ వైరస్ సోకినా వాటి నుంచి మనుషులకు వ్యాప్తి చెందినట్లు ఇప్పటి వరకైతే పరీక్షల్లో తేలలేదని తెలుస్తోంది.
వైరస్ సోకగానే ఏమి చేయాలి
కోతులు కరవడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్ కాబట్టి.. కరవగానే ఆ గాయాన్ని వెంటనే మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. టాప్ కింద గాయాన్ని ఉంచితే లేదా గాయంపై నీళ్లు ప్రవహించేలా శుభ్రం చేసుకుంటే వైరస్ కణాలు ఏవైనా ఉంటే శరీరంలోపలికి వెళ్లకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. 1932 నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభంచినా ఇప్పటి వరకు మొత్తం 50 కేసులను నేరుగా పరీక్షించామని కానీ అందులో 21 మంది మృతి చెందినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
మంకీ వైరస్ (బి వైరస్) నివారణ మార్గాలు
కోతులవద్దకు వెళ్లినప్పుడు ఖచ్ఛితంగా పీపీఈ కిట్లను ధరించి వెళ్లాలి. కోతులకు సంబంధించిన వేటికైనా సరే దూరంగానే ఉండాలి. కోతుల వద్దకు వెళ్లినప్పుడే కాకుండా ఏ జంతువు వద్దకు వెళ్లినా చేతులను 20 సెకన్లపాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
కోతులు కరిస్తే వెంటనే టాప్ కింద మంచినీటితో 15 నిమిశాలపాటు శుభ్రం చేసుకోవాలి. తరువాత వెంటనే వైద్యులను సంప్రదించాలి. కోతుల వద్ద పనిచేసేవారికి, లేదా కోతులకు పెంచుకునేవారికి ఈ వైరస్ పై అవగాహన కలిగించాలి. వారికి నిబంధనలను పాటించమని సలహా ఇవ్వాలి.
కోతులు జంతువుల వద్దకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోతుల వద్దకు వెళ్లిన ఇతర జంతువల నుంచి కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయ్ కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.



Click it and Unblock the Notifications