Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
వానాకాలంలో పచ్చళ్లు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి?..ఈ టిప్స్ పాటిస్తే ఎన్నాళ్లయినా ఫ్రెష్ గా..
ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చేస్తోంది. అయితే సాధారణంగా ఎండాకాలంలో ఆవకాయ, మాగాయ, నిమ్మకాయ అనేక రకాల పచ్చళ్లను తయారుచేసి పెట్టుకుంటారు. వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఓ ముక్క ఊరగాయ వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే వానాకాలంలో చాలామందికి అతిపెద్ద సమస్య ఊరగాయలు పాడైపోవడం, బూజు పట్టడం. గాలిలో తేమ అధికంగా ఉండటం, వాతావరణం చల్లబడటం వంటి కారణాలతో ఊరగాయలు త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంటది. ఊరగాయ పెట్టడం ఎంత కళో..దాన్ని ఎక్కువ కాలం ఫ్రెష్ గా, రుచిగా కాపాడుకోవడం కూడా అంతే నైపుణ్యం. ఈ వర్షాకాలంలో మన ఊరగాయలను పాడవకుండా, వాటి అద్భుతమైన రుచిని నెలల తరబడి ఎలా ఆస్వాదించాలో ఇక్కడ చూడండి.
గాజు జాడీలు
ఊరగాయలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల కన్నా గాజు జాడీలే ఉత్తమం. ఇవి రసాయన ప్రతిచర్యలకు లోనుకావు. ఊరగాయ రుచిని, స్వచ్ఛతను కాపాడతాయి. జాడీని ఉపయోగించే ముందు వేడినీళ్లతో శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. అందులో ఏమాత్రం తడి ఉండకూడదు. ఊరగాయను జాడీలో వేసిన తర్వాత పైన తప్పకుండా ఆవనూనె లేదా నువ్వుల నూనె పొరలా వేయాలి. ఈ నూనె పొర ఒక రక్షణ కవచంలా పనిచేసి గాలి, తేమ లోపలికి చేరకుండా అడ్డుకుంటుంది. ప్రతిసారీ ఊరగాయ తీసినప్పుడు నూనె పొర సరిగ్గా ఉందో లేదో గమనించండి.

శుభ్రమైన చెంచా
తరచుగా మనం చేసే పొరపాటు ఏంటంటే.. ఊరగాయ లేదా పచ్చడిని జాడీలో నుంచి తీయడానికి తడి లేదా మనం అన్నం తిన్న చెంచాను ఉపయోగిస్తుంటాం. అయితే ఇట్ల చేయడం వల్ల ఊరగాయలోకి తేమ, ఇతర పదార్థాలు చేరి త్వరగా చెడిపోతుంది, బూజు పడుతుంది. కాబట్టి ఊరగాయను తీయడానికి ఎల్లప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉన్న చెంచానే వాడండి. అలాగే ఉపయోగించిన తర్వాత జాడీ మూతను గాలి చొరబడకుండా గట్టిగా మూసివేయడం మర్చిపోకండి.
వెనిగర్ లేదా సిట్రిక్ యాసిడ్
వర్షాకాలంలో ఊరగాయలను కాపాడుకోవడానికి వెనిగర్ లేదా సిట్రిక్ యాసిడ్ ఒక అద్భుతమైన ఉపాయం. ఇవి సహజసిద్ధమైన పరిరక్షకాలుగా (preservatives) పనిచేస్తాయి. ఊరగాయ కలిపేటప్పుడు లేదా కలిపిన తర్వాత ఒకటి లేదా రెండు చెంచాల వైట్ వెనిగర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఇది ఊరగాయ pH లెవల్ ని తగ్గించి, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి పెరుగుదలను అరికడుతుంది. సిట్రిక్ యాసిడ్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఇది పొడి రూపంలో మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. చిటికెడు సిట్రిక్ యాసిడ్ కలిపితే సరిపోతుంది. ఈ రెండూ ఊరగాయను సురక్షితంగా ఉంచడమే కాకుండా దాని సహజమైన రుచిని కూడా కాపాడతాయి.
ఎండలో ఆరబెట్టడం
ఊరగాయ పర్ఫెక్ట్ గా రావాలన్నా, ఎక్కువ కాలం నిల్వ ఉండాలన్నా అందులో వాడే ముడి పదార్థాలు (కాయలు, ముక్కలు), మసాలా దినుసులు పూర్తిగా పొడిగా ఉండాలి. తేమ అన్నది ఉండకూడదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది కొంచెం కష్టమైన పనే అయినా, ఎండ తగిలినప్పుడు ఒకటి రెండు రోజులు ఎండబెట్టడం తప్పనిసరి. ఊరగాయలో తేమ ఎంత తక్కువగా ఉంటే, అది అంత ఎక్కువ కాలం మన్నుతుంది.
నిరంతర పర్యవేక్షణ
ఊరగాయ జాడీని ప్రతి వారం లేదా పదిహేను రోజులకోసారి తనిఖీ చేస్తూ ఉండాలి. పైన ఏమైనా చిన్నపాటి బూజు ఏమాత్రం కనిపించినా, వెంటనే ఆ భాగాన్ని జాగ్రత్తగా తీసివేసి, అవసరమైతే కొద్దిగా నూనె కలపండి. ఊరగాయ రంగు, వాసనలో ఏమైనా తేడా ఉంటే గమనించండి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, వర్షాకాలంలో కూడా మీ ఊరగాయలు నెలల తరబడి తాజాగా, రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications