Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
చల్లటి వర్షపు జల్లులు, వేడి వేడిగా రుచిగా ఏమైనా తినాలనిపిస్తోందా.. వీటిని ట్రై చేయండి మరి!
ఆకాశం నిండా మేఘాలు, ఉరుములు, మెరుపులు. వీటికి తోడుగా వర్షపు జల్లులు. వీటిని కిటికీల్లోంచి చూస్తూ జనాలు. ఇలాంటి సమయాల్లోనే ఎవరికైనా సరే మనసుకు నచ్చే మ్యూజిక్ తో పాటు వేడి వేడి ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంటుంది.
ముఖ్యంగా కరకరలాడుతూ కారంగా ఉండే కమ్మటి పదార్థాలంటే మరింత ఇష్టపడుతుంటారు. అయితే సులువుగా తయారు చేసుకోగలిగే, చాలా టేస్టీగా ఉండే ఐటమ్స్ అంటే ఎవరు ఇష్ట పడరు చెప్పండి. అయితే చిటికెలో తయారై.. చాలా రుచిగా ఉండే పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. పకోడీ
వర్షం విత్ పకీడో డెడ్లీ కాంబినేషన్. వర్షం కురుస్తుందంటే చాలు చాలా మంది మిర్చి బజ్జీలతో పాటు పకోడీలు తయారు చేసుకుంటారు. పకోడీలు, మిర్చీ బజ్జీలు లేకుండా వర్షాకాలం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. వివిధ రకాల కూరగాయలు (సాధారణంగా బంగాళదుంపలు, మిరపకాయలు లేదా ఉల్లిపాయలు) వంటి వాటిని కలిపి శనగ పిండితో వేసే పకోడీలు చాలా బాగుంటాయి. క్రిస్పీగా, కమ్మగా ఉండే పకోడీలు వర్షానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్.
2. మొక్కజొన్న కంకులు
మొక్కజొన్న అనేది ప్రపంచవ్యాప్తంగా విభిన్న వంటకాలలో ఉపయోగించే బహుముఖ పదార్ధం. భారతదేశంలో మొక్కజొన్న అత్యంత ప్రజాదరణ పొందిన పంట. సాధారణ సమయాలతో పాటు వర్షాకాలంలోనూ వేడి వేడి నిప్పులపై కంకులను కాల్చి.. దానికి కారం, ఇప్పు, నిమ్మకాయ, వెన్న రాసి తింటే ఉంటుంది.. ఆహా.
3. సమోసాలు
బంగాళ దుంపలు, క్యారెట్లు, బఠానీలు, ఉల్లిపాయలతో తయారు చేసే వెజ్ సమోసాలు అంటే అందరూ ఇష్టపడతారు. వేడి వేడిగా వర్షాకాలంలో వీటిని తింటుంటే చాలా బాగుంటుంది.
4. ఆలూ టిక్కీ
ఢిల్లీ వాసులు చాలా ఇష్టంగా తినే ఆలూ టిక్కీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మసాలాలు, బంగాళా దుంపలు బ్రెడ్ క్రంబ్స్‌తో కలిపి దీన్ని చ్నీలో లేదా పెరుగులో తింటే రుచి అదిరిపోతుంది.
5. వడా పావ్
వడా పావ్.. ఇదంటే ఇష్టపడని ఇండియన్స్ ఉండరేమో. బంగాళ దుంపలు, మసాలా దినుసుల కలయికతో తయారు చేయబడిన ఒక పట్టీ (వడ) శనగ పిండిలో వేయించి, రెండు బన్స్ మధ్య శాండ్విచ్ లా తయారు చేసే ఈ వడాపావ్ చాలా రుచిగా ఉంటుంది. ఇది దేశీ బర్గర్ లాగా ఉంటుంది. రుచితో ప్యాక్ చేయబడిన ఈ మహారాష్ట్ర వంటకం వర్షాకాలంలో చాలా ఇష్టంగా తింటారు.
6. టీ (చాయ్)
నిజం చెప్పాలంటే బలమైన కప్పు టీని ఆస్వాదించడానికి నిర్దిష్ట వాతావరణం అవసరం లేదు. కానీ వర్షం పడుతున్న సమయంలో టీ తాగే వారు చాలా ఎక్కువగా ఉంటారు. కిటికీ వద్ద నిల్చొని వర్షాన్ని చూస్తూ.. టీ ని సిప్ చేస్తూ వచ్చే కిక్కు ఇక దేనికీ రాదు. అల్లం, ఏలకులు, తులసీ, పుదీనా ఆకులతో చేసే టీ మరింత రుచిగా ఉంటాయి.
పైన చెప్పిన ఆహార పదార్థాలన్నీ చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు చాలా కమ్మగా, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ వర్షా కాలంలో మీరూ వీటిని ట్రై చేసి చూడండి. ఆనందమైన సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో లేదా భాగస్వామితో గడపండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications