Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
ఉదయం మీరు నిద్రలేవగానే వీటిని చూస్తే అదృష్టం! శుభం కలుగుతుంది.!
ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేచి ఆ రోజు మొత్తం వారి జీవితంలో ఎలాంటి ప్రమాదాలు ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగిపోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఉదయం నిద్ర లేవగానే వారికి ఇష్టమైన దేవుడిని స్మరించుకుంటూ నిద్రలేస్తారు. అయితే ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులను కనుక చూస్తే మనకు ఆ రోజు మొత్తం ఎంతో ఉత్సాహారంగా ఉంటుంది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడిచిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు..
శాస్త్రాలలో ఉదయం నిద్ర లేచిన వెంటనే కనిపించే కొన్ని శుభ, అశుకరమైన వస్తువుల గురించి పేర్కొన్నారు. మన రోజు మొత్తం రహస్యం మనం ఉదయం నిద్ర లేవగానే చూసే కొన్ని విషయాలలో దాగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలసి రాకపోయినా అంతా చెడే జరుగుతున్నా ఉదయం నిద్ర లేచి ఎవరి ముఖం చూసామో అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే శాస్త్రాలు మన పూర్వీకుల నమ్మకాల ప్రకారం నిజానికి ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని చూడకూడదు. ఇక అదృష్టం కలిసి రావాలంటే నిద్రలేవగానానే కొన్నింటిని చూడాలి. అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం నిద్ర లేవగానే చూడదగినవి
- ఉదయం నిద్ర లేచిన వెంటనే భూదేవిని నమస్కరించాలి. ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే దేనికి నమస్కరించి కాళ్ళను కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఉదయం నిద్ర లేవగానే మన అరచేతిని మనం చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటే ఆ రోజంతా అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
- ఇక పురుషులు వారి భార్యను చూసినా, అగ్నిని చూసినా యజ్ఝం చేసే వారిని చూసిన వారి పిల్లలను చూసిన తల్లిదండ్రులని చూసినా కూడా మంచే జరుగుతుంది.
- ఉదయం ఇంట్లో నుంచి నిద్ర నుంచి బయటకు వచ్చాక గోమాత దూడకు పాలు ఇవ్వడం లేదా తెల్లని ఆవుపాలు మీ ఇంటి దగ్గర కనిపిస్తే మీ వ్యక్తిగత జీవితంలో కచ్చితంగా శుభఫలితాలు వస్తాయని నమ్ముతారు. అంతేకాదు మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఆ రోజంతా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఆర్థికపరంగా మంచి లాభాలు పొందుతారు.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయించే సూర్య భగవానుడిని చూడడం వలన ఆ రోజంతా మనం పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తాం.
- తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే ఇంటికి గుమ్మం వద్ద ఆవు కనిపిస్తే అది శుభసూచకమని, అలాంటి పరిస్థితుల్లో ఆకు తినడానికి ఆహారం పెట్టాలని చెబుతారు.
- మీరు నిద్రలేవగానే వెంటనే బల్లిని చూస్తే మీ దురుద్రుష్టం తొలగిపోయి అదృష్టం ఏర్పడుతుందని అర్థం చేసుకోండి.
- కళ్ళు తెరిచిన వెంటనే బల్లిని చూడడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలో త్వరలో విజయం వస్తుందని అర్థం .ఉదయాన్నే ఆలయంలో సుప్రభాతం, మంత్రాలు, గుడిగంటలు మోగడలాంటి వినిపిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- నిద్రలేవగానే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే మంచిది. వంటింట్లో అడుగు పెట్టినప్పుడు పాలు లేదా పెరుగు చూడటం వల్ల భవిష్యత్తులో మీకు అదృష్టం కలిసొచ్చే అవకావం ఉంది. అలాగే ఉదయం నిద్రలేచినప్పుడు మీ ఇంటి పైకప్పు నుంచి పక్షుల కిలకిల రావాలి వింటే ఆ రోజు మీకు ఏదో ఒక ప్రయోజనం కలుగుతుందని అర్థం.
- అలాగే నిద్రలేచిన వెంటనే వివాహిత మహిళలు, పూజా సామాగ్రి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తే అది శుభప్రదంగా భావిస్తారు. ఉదయం నిద్ర లేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో, తులసి మొక్కలలో దేవతలు ఉంటారు. కాబట్టి వాటిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచాక అగ్నిని కానీ , దీపంను కానీ, యజ్ఝం చేసేవారిని కానీ చూసినా శుభం కలుగుతుంది. వీటిని మంగళకరమైన చిహ్నాలుగా భావిస్తారు అందువల్ల వాటిని చూస్తే అంతా మంచే జరుగుతుంది.
- ఉదయం నిద్ర లేచాక బంగారం, సూర్యుడు, ఎర్రచందనాలను చూడవచ్చు. దీంతో అన్ని పనులు జరగడమే కాక అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఉదయం నిద్రలేచాక గుడి గోపురం ,పర్వతం వంటి వాటిని చూసిన మనకు శుభమే కలుగుతుంది వెంటనే దేవుడి చిత్రపటాలు నెమలి కన్నుల చిత్రాలు అలాగే ఉదయం లేవగానే వికసించే పువ్వులను చూడటం వలన కూడా మనకు చాలా శుభప్రదంగా అనిపిస్తుంది.
- ఉదయాన్నే ఆకాశం నీలిరంగులో కనిపిస్తూ ఉంటుంది దీనిని చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సప్తవర్ణాల ఇంద్రధనుస్సును చూస్తే మనసుకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అయితే ఇది అన్ని వేళలా సీతాకోకచిలుకలు మంచి శకునాల భావిస్తారు, కాబట్టి ఉదయాన్నే వీటిని చూస్తే మంచి జరుగుతుందట. అలాగే నేల మీద పడిన నాణ్యెం కూడా అదృష్టానికి సంకేతంగా భావిస్తారు .
- అదేవిధంగా ఉదయం ఎవరైనా చీపురుతో శుభ్రం చేస్తూ కనిపిస్తే మీరు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఉదయం నిద్రలేవగానే చూడకూడనివి
- ఉదయం నిద్ర లేచిన వెంటనే పాపాలు చేసే వారిని చూడకూడదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుంది అని పెద్దలు చెబుతుంటారు.
- జుట్టు విరబోసుకుని ఉన్న స్త్రీలను, బొట్టులేనివారిని చూడరాదు.
- ఇక నిద్ర లేచిన వెంటనే చాలామంది ఇళ్ల పెట్టుకునే కొన్ని వస్తువులను చూస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో అడవి జంతువుల బొమ్మలు, హింసాత్మకమైన ఘటనలను ఫోటోలు చాలా బాధాకరంగా ఉన్న ఆర్ట్ వంటివి పెట్టుకుంటుంటారు. వాటిని నిద్రలేచిన వెంటనే పొరపాటున కూడా చూడకూడదు.
- అసలు అటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. అంటే ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ వస్తువులు కూడా ఆ శుభ్రం చేయని గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అరిష్టం కలుగుతుందని, వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన పాత్రలు పనిచేయని గడియారం చూడడం మంచిది కాదు. అందువలన వీటిని ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది.
- కొందరు ఉదయం లేవగానే తమ ముఖాన్ని అద్ధంలో చూసుకుంటుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు ఉదయాన్నే వారి ముఖం చూసుకోకుండా అరచేతులను చూసుకోవడం మంచిది.
- అలాగే ఉదయాన్నే నూనె పాత్రలు చూడకూడదు వీటిని అపశకునంగా భావిస్తారు. ఉదయం మీ నీడను కూడా చూసుకోవడం మంచిది కాదు. పడమటి దిశ ఒకవేళ అకస్మాత్తుగా నీడను చూస్తే తులసి ఆకులను తినాలి అలాగని పూజ చేసే తులసి మొక్క నుంచి ఆకులు త్రుంచ కండి.
- వంట చేసిన పాత్రలు చూడకూడదు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి . అందుకే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత వెంటనే అశుభ్రంగా ఉన్న పాత్రలను శుభ్రం చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
- కొందరు ఉదయం నిద్ర లేవగానే తల దువ్వుకుని ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. కొందరు ఉదయం నిద్ర లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా టీ , కాఫీలను తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదు. అసలు మంచిది కాదు.
- మనం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరు చూడకపోవడమే మనకు చాలా మంచిదట. దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు శరీరానికి ఎండ తగలాలని ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే డబ్బు కూడా ఖర్చు అవుతుందని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications