Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నార్మల్ డెలివరీ అంటే భయపడి సీ-సెక్షన్ చేయించుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
ప్రసవం.. ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చి ఆరోగ్యంగా ఇంటికి వచ్చే వరకు చాలా కుటుంబ సభ్యులే భయపడిపోతుంటారు. ముఖ్యంగా ప్రసవం చేయించుకనే మహిళకు అనేక భయాలు ఉంటాయి. నార్మల్ డెలవరీ అంటే ఎక్కువ నొప్పులు భరించాల్సి వస్తుందని... అదే సీ సెక్షన్ అయితే ఎలాంటి నొప్పీ లేకుండా ప్రసవం అవ్వొచ్చని అనుకుంటున్నారు.

కానీ నార్మల్ డెలివరీ మంచిదా, సీ సెక్షన్ మంచిదా అనేది చాలా మందికి తెలియదు. ప్రసవం చేయించుకోబోయే వాళ్లకు ఈ విషయాలపై పూర్తి అవగాహన ఉండాల్సిందే. దేని వల్ల ఆరోగ్యం బాగుటుంది, బాగుండదు.. సీ సెక్షన్, నార్మల్ డెలివరీ వల్ల కల్గే సమస్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సి-సెక్షన్ కంటే సహజ ప్రసవం కష్టమే..!
సహజ ప్రసవం అందరికీ కష్టం కాదు. కొందరికి నొప్పులు ప్రారంభమైన పది నిమిషాలకే ప్రసవం జురుగుతుంది. బిడ్డ పుట్టిందో లేదో కూడా తెలియక ముందే అంటే వెంటనే బిడ్డ పుడుతుది. అది గ్రహించేలోపే నొప్పులు కూడా మాయమవుతాయి. కానీ మరి కొంత మందికి మాత్రం కొన్ని గంటల నొప్పి తర్వాత డెలివరీ అవుతుంది. సీ సెక్షన్ సమయంలో.. పిల్లలను బయటకు తీసేముందు తల్లులకు అనస్తీషియా ఇస్తారు. అప్పుడు ఎలాంటి నొప్పీ తెలియదు. కానీ ఆ తర్వాత కాలంలో విపరీతమైన నడుము, తలనొప్పి వస్తుంది. కాబట్టి నార్మల్ డెలివరీ చాలా కష్టం అని చెప్పడం అపోహ మాత్రమే.
నొప్పి లేకుండా సీ సెక్షన్..!
ప్రసవ సమయంలో నొప్పులు వస్తాయని.. నార్మల్ డెలివరీ చేయించుకునేందుకు చాలా మంది ఇష్పడడం లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సీ సెక్షన్ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ నార్మల్ డెలివరీ సీ సెక్షన్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఇది తల్లి ఆరోగ్యానికి మంచిది. శిశువు జననేంద్రియ మార్గం ద్వారా వచ్చినప్పుడు.. జననేంద్రియ మార్గంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా శిశువుకు చేరుతుంది. తద్వారా శిశువు యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డెలివరీ కష్టంగా ఉన్నప్పుడు లేదా బొడ్డు తాడు మెలితిప్పినట్లు ఉన్నప్పుడు లేదా కడుపులో బిడ్డ తిరగడం లేనప్పుడు సీ-సెక్షన్ చేస్తే సరి. తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడేందుకు మాత్రమే సీ సెక్షన్ వైపు మొగ్గు చూపాలి.
నార్మల్ డెలివరీ తర్వాత శృంగారంపై ఆసక్తి తగ్గుతుందా..!
నార్మల్ డెలివరీ తర్వాత శృంగారంపై ఆసక్తి తగ్గడం అనేది అపోహ మాత్రమే. సహజ ప్రసవం తర్వాత లైంగిక ఆసక్తిపై ఎలాంటి ప్రభావం ఉండదు. సహజ ప్రసవానికి స్త్రీలలో లైంగిక ఆసక్తి తగ్గడానికి ఎటువంటి సంబంధం లేదు.
మొదటి కాన్పు సీ సెక్షన్ అయితే రెండో కాన్పు నార్మల్ డెలివరీ కాదా?
మొదటి కాన్సులో సీ సెక్షన్ జరిగితే... రెండో కాన్పులో నార్మల్ డెలివరీ కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా అపోహనే. మొదటి సారి సీ-సెక్షన్ అయితే రెండవ డెలివరీలో నార్మల్ డెలవిరీ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మీరు రెండు సంవత్సరాల సీ-సెక్షన్ తర్వాత గర్భవతి అయితే.. నార్మల్ డెలివరీకి ప్రయత్నించవచ్చు.
బొడ్డు తాడు ప్రోలాప్స్ అయితే సీ సెక్షన్ చేయాలి..!
సాధారణంగా వైద్యులు సీ-సెక్షన్‌ని ఇలా సూచిస్తారు. కానీ అన్ని సందర్భాల్లో సీ సెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. బొడ్డు తాడును చుట్టుకున్నా సాధారణ ప్రసవం జరుగుతుంది. ఇది బిడ్డకు హాని కలిగించదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications