Latest Updates
-
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం!
ఈ బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లి ఖర్చుతో ఊర్లే కొనొచ్చు?
డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఈమధ్యకాలంలో తెగ ట్రెండ్ అవుతోంది. సాధారణ ప్రజలకు అదో అందని ద్రాక్ష అయినప్పటికీ.. సెలబ్రిటీల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఫుల్ క్రేజ్ ఉంది. విలాసవంతంగా, అత్యంత ఆడంబరంగా ఉండటం వీటి ప్రత్యేకత. సౌకర్యాలు, హంగూ ఆర్భాటాలు, ప్రత్యేకమైన దుస్తులు, మరింత ప్రత్యేకంగా తీర్చిద్దిద్దే పెళ్లి వేదికలు ఇలా.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే ఆ రేంజ్ వేరు అంతే.
వివాహ ఆహ్వానాల నుంచి డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్రత్యేకతే వేరు. ఆహ్వానాల ఆలోచనే అదిరిపోయేలా ప్లాన్ చేస్తారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే మనకు మొదట గుర్తుకు వచ్చేది సెలబ్రిటీలే. అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులే గుర్తుకు వస్తారు. అయితే ఇప్పటి వరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ లో అత్యంత ఖరీదైన పెళ్లి వేడుకలు ఏవో మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్:
ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ కు 2018 లో వివాహం జరిగింది. రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్నారు. వేడుకలు మొత్తం మూడ్రోజుల పాటు జరిగాయి. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం అత్యంత ఆడంబరంగా వివాహ వేడుకలు జరిపించారు. అతిథుల కోసం, పెళ్లి వేడుకల కోసం అన్నింటికి కలిపి దాదాపు 4,61,000 డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. దీనికి డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, ఫుడ్ ఖర్చులు అదనం.

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ:
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 2017 లో ఇటలీ టుస్కానీలోని ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన రిసార్ట్ లో పెళ్లి చేసుకున్నారు. బోర్గో ఫినోషిటో వద్ద పెళ్లి వేదిక ఏర్పాటు చేసి వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి వచ్చిన అతిథుల కోసం బుక్ చేసిన ఒక్కో గదికి రూ.13.5 లక్షలు.

ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్:
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ 2007 ఏప్రి 20వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరు బాలీవుడ్ అగ్ర తారల వివాహం ముంబైలోని బచ్చన్ బంగ్లా ప్రతీక్షలో అత్యంత ఆడంబరంగా జరిగింద.

దీపికా పదుకొణె - రణవీర్ సింగ్:
బాలీవుడ్ క్యూట్ అంట్ పవర్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ 2018లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. వివాహ వేడుక లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో జరిగింది. ఈ రిసార్ట్ లో 5 రోజుల పాటు అత్యంత ఘనంగా పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఇక్కడ ఒక్క రోజు ఒక్కో గదికి రూ. 24 లక్షలు ఖర్చు అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు, పెళ్లి వేడుకలు, జ్యూవెల్లరీ, వివాహ వేదిక డెకొరేషన్, డిజైనర్ దుస్తులు, ఆహార ఖర్చులు అన్నీ అదనం.

సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్:
LOC కార్గిల్, ఓంకార సెట్స్ లో సైఫ్, కరీనా కలిపి నటించగా.. అప్పుడు వారి మధ్య ప్రేమ చిగురించింది. అలా ప్రేమలో మునిగిపోయిన ఈ జంట.. 2012లో పెళ్లి బంధంతో ఒక్కటైంది. దిల్లీలోని ఔరంగజేబ్ రోడ్డులో ఉన్న వీవీఐపీ బంగ్లా నం.31 అలాగే సైఫ్ కు చెందిన పటౌడీ హౌస్ లో వివాహ వేడుకలు చాలా ఆడంబరంగా జరిగాయి.

శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా:
శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా 2009 నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన శిల్పా శెట్టి పెళ్లి చీర అప్పట్లోనే రూ.50 లక్షల కంటే ఎక్కువ. అలాగే ఆమె ఎంగేజ్మెంట్ ఉంగరం ఖరీదు రూ.3 కోట్లు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
