Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువు ఏదో తెలుసా?
ఈ భూమ్మీద ఏ ప్రాణికి లేనంత తెలివి మనిషికి ఇవ్వడింది. అయితే జంతువుల విషయానికొస్తే ఏది అత్యంత తెలివైన జంతువు అని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారంగా మన ఫ్రెండ్స్ లోనో లేక మన చుట్టు పక్కల ఉండే వ్యక్తులలో ఎవరైనా మరొకరికి హాని చేయడం కోసమో లేక దేని నుంచైనా తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఎక్కువగా తెలివితేటలను ప్రదర్శిస్తే వాళ్లని నక్కతో పోల్చుతుంటాం. వాళ్లకి నక్క తెలివితేటలు ఉన్నాయ్ అని అంటుటాం. కాబట్టి నక్క చాలా తెలివైనదని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే.
వాస్తవానికి నక్క అంత తెలివైన జంతువు కాదని సైంటిస్టులు చెబుతున్నారు. అలాంటప్పుడు భూమ్మీద మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువు ఏదబ్బా అని తెగ ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పడు తెలుసుకుందాం.

మనుషులు, చింపాంజీల డీఎన్ఏ 94శాతం మ్యాచ్ అవుతుందని సైన్స్ నిరూపించింది. అయినా కూడా మనుషుల తర్వాత తెలివైన జంతువు చింపాంజీ కాదు. కొందరి సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం మనిషి తర్వాత ఆక్టోపస్ అత్యంత తెలివైన జంతువు..మరికొందరు డాల్ఫిన్ అని అంటున్నారు.
డాల్ఫిన్
మానవుల తర్వాత అసాధారణ మేధస్సుకు అత్యంత ప్రసిద్ధ జంతువు డాల్ఫిన్. ముఖ్యంగా బాటిల్‌నోస్ డాల్ఫిన్ లు బాగా కమ్యూనికేట్ చేయగలవు, సమస్యలను పరిష్కరించగలవు. డాల్ఫిన్ ల మేధస్సులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వాటి సాధనాలను ఉపయోగించడం. ఈ నైపుణ్యాలు ఆత్మరక్షణలో మాత్రమే ఉపయోగించబడవు. అవి తమ నెక్స్ట్ జనరేషన్ కి కూడా తమ స్కిల్స్ నేర్పుతాయి. అంటే తరం నుండి తరానికి వాటి నైపుణ్యాలు బదిలీ చేయబడతాయి.
ఆక్టోపస్
జంతువులలో ఆక్టోపస్ మరొక తెలివైన జంతువు. ఇవి స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకాలను కలిగి ఉంటాయి. ఇవి నీటి అడుగున చిట్టడవుల నుండి కూడా ఉద్భవించగలవు. ఆక్టోపస్ తరచుగా మత్స్యకారుల పడవలను అడ్డుకుంటుంది.
చింపాంజీ
జన్యువుల రహస్యం కనుగొనబడక ముందు ఆహారం కోసం మానవులు మాత్రమే యంత్రాలను ఉపయోగించగలరని భావించారు. అయితే చింపాంజీలు ఈ పనిని చక్కగా చేయగలవని ఇప్పుడు తెలిసింది. చింపాంజీలు అందమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదించగలవు. జీవిత భాగస్వామి చనిపోయినప్పుడు దుఃఖాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తాయి. మనుషుల మాదిరిగా భాష నేర్చుకోలేకపోయినా అవి సులభంగా సంభాషించగలవు.
ఏనుగు
భూమ్మీద ఉన్న జంతువులలో ఏనుగు అతిపెద్ద మెదడును కలిగి ఉంది. ఏనుగు మెదడులో 257 బిలియన్ల న్యూరాన్లు ఉన్నాయి..ఇది మానవ మెదడు కంటే మూడు రెట్లు ఎక్కువ. ఏనుగు తెలివితేటల యొక్క ఆసక్తికరమైన లక్షణం సహచర ఏనుగు మరణిస్తే సంతాపం తెలియజేయడం. చనిపోయిన మంద సభ్యుడిని సున్నితంగా తాకడం లేదా లాలించడం ద్వారా ఓదార్పునిస్తాయి.
కుక్క
కుక్క చాలా మంచి తెలివైన జంతువు. మీరు వాటికి బాగా శిక్షణ ఇవ్వవచ్చు. కుక్కలు మనుషుల మాటలను గుర్తించగలవు, ప్రతిస్పందించగలవు.
కాకి
కాకులు అత్యంత తెలివైన పక్షులుగా పరిగణించబడతాయి. కాకి ఐక్యూ..మానవుడు, కోతి మొదలైన వాటికి దగ్గరగా ఉంటుంది. కాకి ఆహారాన్ని పొందడానికి వివిధ వస్తువులు లేదా సాధనాలను ఉపయోగిస్తాయి. అంతేకాదు కాకులు భవిష్యత్తులో జరిగే సంఘటనలను అంచనా వేయగలవు.



Click it and Unblock the Notifications