Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Mothers Day 2023: మీ సోదరికి రీసెంట్‌గా డెలివరీ అయిందా? ఇలా సహాయం చేయండి
రోజు ఈమధ్యే బిడ్డకు జన్మనిచ్చిన మీ సోదరిని మీరెంత జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పడానికి ఈ మదర్స్ డే అద్భుతమైన అవకాశం. వారు తల్లిగా మారిన సందర్భంగా మీరు చూపించే ప్రేమకు, చేసే సేవకు మదర్స్ డే రోజు మరింత ఎక్కువగా గుర్తింపు వస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున ఆమెకు సహాయం చేయడానికి మీరు చేసే ప్రయత్నాన్ని ఆమె తప్పకుండా అభినందిస్తుంది.

ఓ మంచి బహుమతి, లెటర్, ప్రశంసించే ఓ చిన్న నోట్, ప్రేమను చూపించే ఓ హగ్ ఇలా ఏదైనా కావొచ్చు. మీరు వారిపై ప్రేమను చూపించడానికి మదర్స్ డే కంటే మంచి సమయం, సందర్భం దొరకదు.
ఈమధ్యే బిడ్డకు జన్మనిచ్చిన సోదరికి ఎలా సహాయం చేయాలంటే..
1. బుజ్జాయిని మీరే చూసుకోండి:
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లులు చాలా బలహీనపడిపోతారు. త్వరగా అలసిపోతారు. అలాంటి సమయంలో ఆ బుజ్జాయిని ఆడించడానికి, వారికి సేవ చేయడానికి మీరు సహాయం చేస్తుంటే అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏదీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లి తగినంతగా విశ్రాంతి తీసుకునేలా చేయగలిగితే చాలు. వారు ఆ సమయంలో అంతకంటే మరొకటి కోరుకోరు.
2. ప్రత్యేకమైన బహుమతి ఇవ్వొచ్చు:
మదర్స్ డే రోజు ఈమధ్యే బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారిన మీ సోదరికి ఏదైనా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఏదైనా కావొచ్చు. పూల బొకే నుండి పుస్తకం వరకు, అలాగే బుజ్జాయికి పనికొచ్చే ఇతర వస్తువుల వరకు ఏదైనా ఇవ్వొచ్చు.
3. వండటం ఇష్టమైతే అదే చేయండి:
మీకు వంట చేయడం ఇష్టమైతే, కొత్తగా ఏవైనా చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుండే వారు అయితే.. ఇప్పుడూ అదే చేయండి. ఏదైనా స్పెషల్ గా వండి పెట్టండి. రుచికరమైన, పోషకాహారం తల్లులు చాలా అవసరం.
4. మసాజ్ చేయండి:
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలా మంది తల్లులు ఒంటి నొప్పులతో బాధపడుతుంటారు. మీ సోదరి అలాగే బాధపడుతుందే మెల్లిగా, నెమ్మదిగా మసాజ్ చేయండి. కాళ్లు, చేతులకు నెమ్మదిగా మసాజ్ చేయడం. తలకు ఆయిల్ పట్టడం లాంటివి చేయాలి.
5. ఆమెతో సమయం గడపండి:
బాలింతలతో సమయం గడపడానికి ప్రయత్నించండి. వారికి సహాయం చేయడంతో పాటు వారితో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించండి



Click it and Unblock the Notifications