Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Motivational Quotes : తనతో తను ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు..
జీవితం సమస్యల సుడిగుండం. మన జీవిత ప్రయాణంలో మనం చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు దూసుకెళ్లిపోతూ ఉండాలి. ఎక్కడా నిరుత్సాహం చెందవద్దు. కొన్ని సందర్భాల్లో సమస్యలన్నీ చుట్టుముట్టినప్పుడు ఒంటరిగా మిగిలిపోయినట్టు భావన కలుగుతుంది. అలాంటి సమయంలోనే మనకు మనం స్ఫూర్తిని రగిలించుకోవాలి. అలాంటి స్ఫూర్తిని నింపే వాక్యాలను మేము మీకోసం సేకరించి అందిస్తున్నాం.
మోటివేష్‌నల్ కోటేషన్స్
మోటివేష్‌నల్ కోటేషన్స్
మనలో చీకటి ఆవహించినప్పుడు వెలుగువైపు చూసే ప్రయత్నం చేయాలి
ఈ రోజు మీరు మంచి రీడర్ అవుతే రేపు లీడర్ అవుతారు మరచిపోకండి

విజయం సాధించిన మనిషిగా ఎదగడం కంటే విలువను పెంచుకున్న వ్యక్తిగా ఎదిగే ప్రయత్నం చేయాలి.
జీవితంలో సంతోషంగా ఉండాలంటే లక్ష్యాలను ఏర్పరచుకోండి కానీ వస్తువులను కొనాలని, కొందరిని మెప్పించాలనే లక్ష్యాలను అస్సలు పెట్టుకోకండి.
విజయానికి ప్రత్యేకమైన రహస్యం ఏమీ లేదు. అపజయాల నుంచి నేర్చుకోవడం, నిరంతరం శ్రమించడమే గెలుపువైపు నడిసిస్తుంది.
విజయానికి కావలసింది ట్యాలెంట్.. ఆ ట్యాలెంట్ చాలా సులభంగా దొరుకుతుంది, కానీ దానికోసం కొంత కష్టపడాలి.
మీపై నమ్మకం ఉండే ఒకేఒక్క వ్యక్తి మీరే కావచ్చు, అది మీ విజయానికి సరిపోతుంది. భూమిపై చీకటిని పారదోలడానికి ఒక చిన్న తారాజువ్వ చాలనే విషయాన్ని మరచిపోవద్దు.
కష్టపడకుండా పైకి వచ్చినవాళ్లెవ్వరినీ చూడలేదు. విజయం మీ దగ్గరకు రాదు, మీరు విజయం వద్దకు వెళ్లాలి.
మీకు ఏదైనా చేయాలనే తపన, లక్ష్యం లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ ఉత్తేజపరచి ప్రోత్సహించలేరు.
మీరు రోజు చేసే పనే మీ భవిష్యత్తుకు పునాది లాంటిది.
మీ జీవితంలో సంతోషం, మీరు ఆలోచించే విషయాలను బట్టి ఉంటుంది.
సంతోషమనేది మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ వస్తువు కాదు. దాన్ని మనకు మనమే మన చేతల నుంచి సృష్టించుకోవాలి.
ఇదే మీ చివరిరోజు అనేలా జీవించండి, మీరెప్పుడూ ఇక్కడే ఉండేవారిలా అన్ని విషయాలనూ నేర్చుకోండి.
జీవితంలో ప్రపంచం ముందు ఎప్పుడూ తలవంచుకొని ఉండవద్దు, తలఎత్తుకొనే అన్ని సమస్యలను ఎదుర్కోవాలి.
మీరు గెలివడానికి పుట్టారు అనేలా జీవించాలి. గెలవడం కోసం శ్రమించాలి, గెలవడం కోసమే ప్లాన్ చేయాలి, గెలవడం కోసమే సన్నద్ధం కావాలి.
తుఫాను దిశను నేను మార్చలేను కావచ్చు, కానీ తుఫాను సాయంతో నా లక్ష్యానికి నేను చేరుకునే ప్రయత్నం చేయగలను.
మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. ఎవ్వరో మీ జీవితాన్ని తలరాతను రాసే అవకాశం ఇవ్వ వద్దు.



Click it and Unblock the Notifications