Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
Unfriendliest Cities: 'అన్‌ఫ్రెండ్లీ సిటీ'లుగా ముంబై, ఢిల్లీ.. తేల్చి చెప్పిన సర్వే
కొంత మందికి కొత్త వారితో స్నేహం చేయడం చాలా సరదాగా ఉంటుంది. మరికొందరు పెద్దగా తెలియని వారితో త్వరగా కలిసిపోరు. కొందరైతే వృత్తి, వ్యాపారం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి స్థానికులతో స్నేహం ఏర్పరచుకుంటారు. అది చాలా సాధారణంగా జరిగేదే. అయితే ముంబై, ఢిల్లీ నగరాల్లోని ప్రజలతో స్నేహం చేయడం చాలా కష్టమని, వారు ఏమాత్రం ఫ్రెండ్లీగా ఉండరని అంటోంది ఓ సర్వే.
ఈ రెండు ఇండియన్ మేజర్ సిటీలు అయిన ముంబై, ఢిల్లీలను 'అన్ ఫ్రెండ్లీ సిటీ'ల జాబితాలో చేర్చింది ఓ సర్వే. ది కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్: ది వరల్డ్స్ ఫ్రెండ్లీఎస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ పేరుతో ప్రపంచంలోని 53 నగరాల్లో సర్వే నిర్వహించింది. తాజాగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఆయా నగరాల్లోని ప్రజలు స్థానికేతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తారనే అంశాల ఆధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు.

ఆరు కీలక అంశాలతో సర్వే:
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఫ్రెండ్లీ నగరాలను గుర్తించడానికి ఈ సర్వే ఆరు కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంది. సందర్శకుల రాబడి రేటు, భద్రతా రేటింగ్స్, LGBTQ+ పట్ల సమానత్వం, ఓవర్ ఆల్ హ్యాపీనెస్, సాధారణ భాష ద్వారా కమ్యూనికేషన్ సౌలభ్యం, సిబ్బంది స్నేహపూర్వక ప్రవర్తన(ఫ్రెండ్లీ స్టాఫ్) వంటి అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.
అన్‌ఫ్రెండ్లీ సిటీలుగా ముంబై, ఢిల్లీ:
ఈ సర్వేలో ముంబై, ఢిల్లీ అన్‌ఫ్రెండ్లీ సిటీల జాబితాలో నిలిచాయి. ఇక్కడ ఉండే స్థానికులు స్థానికేతరులతో పెద్దగా కలవరని, ఫ్రెండ్లీ ఉండరని సర్వేలో తేలింది. దేశ రాజధాని ఢిల్లీలో 17 శాతం, ముంబైలో 12 శాతం మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటారని ఈ సర్వేలో తేలింది. ఈ జాబితాలో ఆఫ్రికా దేశం ఘనా రాజధాని అక్రా అత్యంత తక్కువ స్కోర్ సాధించింది. అత్యంత తక్కువ స్నేహపూర్వక నగరంగా అక్రా నిలిచింది. మొత్తం 10 పాయింట్లకు గాను అక్రాకు కేవలం 3.12 స్కోర్ లభించింది. మొరాకోలోని మర్రకేజ్ 3.69 స్కోర్ తో రెండో స్థానంలో నిలిచింది. ముంబై, కౌలాలంపూర్, రియో డి జెనీరో, ఢిల్లీ నగరాల్లో అన్‌ఫ్రెండ్లీ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఫ్రెండ్లీ సిటీలుగా టొరంటో, సిడ్నీ:
ప్రపంచంలో ఫ్రెండ్లీగా ఉండే నగరాల జాబితాలో కెనడాలోని టొరంటో, ఆస్ట్రేలియా నగరం సిడ్నీ లు మొదటి స్థానాల్లో నిలిచాయి. ఇక్కడి స్థానికులు స్థానికేతరులతో చాలా స్నేహపూర్వకంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ సిటీలు 10 పాయింట్లకు గాను 7.97 స్కోర్ సాధించి మొదటి స్థానంలో నిలిచాయి.
ఎడిన్ బర్గ్, మాంచెస్టర్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఎడిబన్ బర్గ్ 100కి 68.92 సేఫ్టీ ఇండెక్స్ స్కోర్ తో 7.78 అత్యధిక స్నేహపూర్వక స్కోర్ ను అందుకుంది. మాంచెస్టర్ 10కి 7.72 స్కోర్ సాధించింది. స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి అంటూ సెర్చ్ చేసిన నగరాల జాబితాలో బ్రెజిల్ లోని సావోపాలో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా.. న్యూయార్క్, పారిస్ నగరాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఫ్రెండ్లీ నగరాల జాబితాలో కనిపించని ఇండియన్ సిటీ:
ప్రపంచంలో ఫ్రెండ్లీగా ఉండే నగరాల జాబితాలో భారత దేశం నుంచి ఒక్క నగరం కూడా చోటు దక్కించుకోలేదు. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో 17 శాతం, ముంబై 12 శాతం మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటాయని ది కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్: ది వరల్డ్స్ ఫ్రెండ్లీఎస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ పేరుతో చేసిన సర్వేలో తేలింది. ఫ్రెండ్లీ స్టాఫ్ కేటగిరీలో ముంబై 3.91 శాతం రేటింగ్ ను, ఢిల్లీ 3.27 శాతం రేటింగ్ ను సాధించాయి. హ్యాపీనెస్ స్కోర్ లో ముంబై 3.78, ఢిల్లీ 4.01 స్కోర్ సాధించాయి.



Click it and Unblock the Notifications