Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Blue Hole: మెక్సికో తీరంలో అంతుచిక్కని బ్లూ హోల్..
ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు, ఇంకెన్నో విశేషాలు. శాస్త్రవిజ్ఞానం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధి చెందుతున్నా కొన్ని వింతల వెనక కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు. వాటి పుట్టుపుర్వోత్తరాలు కూడా తెలుసుకోలేకపోతున్నారు.
అలాంటి వింతల్లో ఒకటి బ్లూ హోల్. అంటే సముద్రలో ఏర్పడే భారీ నీటి గుంత. తాజాగా శాస్త్రవేత్తలు మెక్సికో చెటుమల్ బేలోని యుకాటన్ ద్వీపకల్ప తీరంలో ఈ బ్లూ హోల్ ను గుర్తించారు. ఇది ప్రపంచంలోనే రెండో లోతైన బ్లూ హోల్ గు సైంటిస్టులు తేల్చారు.

(Image: Twitter)
భారీ బ్లూ హోల్.. 900 అడుగుల లోతు:
లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం ఈ బ్లూ హోల్ ఏకంగా 900 అడుగుల లోతులో 1.47 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. గత ఏడాది సెప్టెంబర్ లో ఓ పబ్లిక్ రిసర్చ్ సెంటర్ ఈ భారీ బ్లూ హోల్ ను గుర్తించింది. తాజాగా ఫ్రాంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్ అనే సైంటిఫిక్ జర్నల్ లో దీని గురించి రావడంతో.. ఇప్పుడు బ్లూ హోల్ చర్చనీయాంశంగా మారింది.
బ్లూ హోల్ లోపల ఏముంటుంది:
సముద్రంలో ఏర్పడే ఈ భారీ నీటి గుంతలు నీలి రంగులో ఉంటాయి. అలా వీటికి బ్లూ హోల్ అనే పేరు వచ్చింది. అయితే కాలక్రమేణా మొక్కలు, వాటి ఆకులు కుళ్లిపోయే బ్యాక్టీరియా వల్ల ముదురు నీలం రంగు వస్తుంది. ఈ బ్లూ హోల్స్ లోపల చిన్న చిన్న సున్నపు రాయి గుహలు ఉంటాయి. ఇందులోకి సూర్య కాంతి చొచ్చుకు పోదు. దాని వల్ల లోపల నలుపులో, పైకి నీలి రంగులో కనిపిస్తుంది.
బ్లూ హోల్స్ లోపలికి వెళ్లొచ్చా:
బ్లూ హోల్స్ లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సూర్యకాంతి ఉపరితలంపై మాత్రమే ప్రకాశిస్తుంది. చుట్టూ ఉండే సున్నపురాయి వల్ల సూర్యకాంతి ఎక్కువ లోతుగా వెళ్లలేదు. ఇందులోకి వెళ్లడం కొంత సాహసమనే చెప్పాలి.
స్కూబా డైవింగ్ చేసే వారు సరైన రక్షణ పరికరాలు ధరించి బ్లూ హోల్ లోకి వెళ్తుంటారు. ఇందులోని జీవజాలం కోసం అందులోని పరిస్థితులను తట్టుకునేలా జీవపరిణామం చెంది ఉంటాయి. వేల సంవత్సరాల క్రితం జీవం ఎలా మొదలైందో ఈ బ్లూ హోల్స్ ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
డ్రాగన్ హోల్ అతిపెద్దది:
డ్రాగన్ హోల్ 987 అడుగుల లోతు ఉంటుంది. ఇది దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవులకు సమీపంలో ఉన్న తీర్పు అటోల్ లో ఉంటుంది. ఇప్పటి వరకు గుర్తించిన అతి పెద్ద బ్లూ హోల్స్ లో ఇదే నంబర్ వన్.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications