Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నెంబర్ 13 వెనుక దాగిన రహస్యం ఏంటీ? లిఫ్ట్ లు, హోటల్స్ లో ఆ నెంబర్ ఎందుకు వదిలేస్తారు?
ఈ ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు బోలెడు ఉంటాయి. అలాంటి రహస్యాలలో ఒకటి నెం. 13. ఈ అంకెలో చాలా పెద్ద రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? సాధారణంగా ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవాళ్లకు కొంతవరకు దీని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. మిగతావాళ్లకు దీని గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే మీరు తరచుగా ట్రావెల్ చేస్తూ వేర్వేరు ప్రదేశాల్లో హోటల్స్ నివసిస్తుండే వాళ్లయితే గనుక ఆ హోటల్స్ లో లిఫ్ల్ 13 ఫ్లోర్ లో ఆగకపోవడం, అసలు 13వ నెంబరే కనిపించకపోవడం..అదేవిధంగా 13 ఫ్లోర్ లోకి ఎవ్వరికీ ఎంట్రీ లేకపోవడం వంటివి గమనించి ఉండవచ్చు.
మూఢనమ్మకమా
13 అనే సంఖ్య చుట్టూ ఎన్నో వింతైన నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. ఇది కేవలం ఒక సాధారణమైన అంకె మాత్రమే కాదు..చాలా మంది దీనిని దురదృష్టానికి, అశుభానికి సంకేతంగా భావిస్తారు. కొన్ని సంస్కృతుల్లో 13వ తేదీని అస్సలు మంచిగా చూడరు. శుక్రవారం 13వ తేదీ వస్తే ఇక చెప్పనక్కర్లేదు.. అది మరింత భయానకమైన కలయికగా పరిగణిస్తారు. విమానాల్లో 13వ వరుస ఉండదు, హోటళ్లలో 13వ అంతస్తు కనిపించదు. ఇదంతా ఎందుకంటే ఆ సంఖ్యతో ముడిపడిన బలమైన మూఢనమ్మకాలే కారణం.

ట్రిస్కెయిడెకాఫోబియా
మీరు ఎలాంటి భావన అనుభవించినా దానికి ఒక పేరు తప్పకుండా ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే..13 నెంబర్ అంటే విపరీతమైన భయం,మరణం, సాతానువాదం, క్షుద్ర శక్తులను సూచిస్తుంది. 13వ సంఖ్య పట్ల భయాన్ని ట్రైసైకోఫోబియా అంటారు. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు 13వ నెంబర్ ని చూసినప్పుడు తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం వంటి రియాక్షన్స్ వారి శరీరంలో వస్తాయి. గాలప్ అనే సంస్థ జరిపిన ఒక అధ్యయనంలో.. 13శాతం మంది ప్రజలు 13వ అంతస్తులో ఉండాల్సి వస్తే అసౌకర్యానికి గురవుతారని తేలింది. అందుకే ట్రిస్కెయిడెకాఫోబియాతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి కొన్ని హోటళ్లు 13వ నెంబర్ ను పూర్తిగా తీసివేశాయి.
పురాణాలు,చరిత్రలో ప్రత్యేక స్థానం
13వ నెంబర్ కి పురాణాలు, చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తరచుగా భయం, రహస్యంతో ఈ అంకె ముడిపడి ఉంటుంది. క్రైస్తవ మతంలోనూ 13వ సంఖ్యకు ఒక విషాదకరమైన అనుబంధం ఉంది. యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులతో కలిసి ఉన్నప్పుడు జుడాస్ ఇస్కారియోట్ అనే వ్యక్తి 13వ సభ్యుడిగా వారిలో చేరాడు. అందరికీ తెలిసినట్లుగా ఆఖరి భోజనంలో ఈ 13వ అతిథి అయిన జుడాసే యేసును మోసం చేశాడు.
బైబిల్ మాత్రమే కాకుండా నార్స్ పురాణాలు కూడా 13వ నెంబర్ కు ఒక రకమైన చెడు అర్థాన్ని ఆపాదించాయి. అయితే,20వ శతాబ్దంలో వచ్చిన ఒక కల్పిత రచన ఈ నెంబర్ విధిని మరింతగా మార్చేసింది. రచయిత థామస్ లాసన్ 1907లో 'శుక్రవారం,13వ' అనే ఒక నవల రాశాడు. ఈ కథ 13వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్ ను కూల్చివేయాలని ఒక బ్రోకర్ వేసిన పథకం చుట్టూ తిరుగుతుంది.
సంఖ్యాశాస్త్రాన్ని కొంతమంది బలంగా నమ్ముతాం. చాలామంది 11:11కి కోరికలు కోరుకోవడం శుభప్రదంగా భావిస్తారు. కానీ 13వ సంఖ్య మాత్రం ఎప్పుడూ దురదృష్టానికి, ప్రతికూలతకు చిహ్నంగానే ఉండిపోయింది. అందుకే లిఫ్ట్ లలో, హోటళ్లలో కూడా చాలామందికి సౌకర్యంగా ఉండటానికి ఆ సంఖ్యను దాటవేస్తారు.



Click it and Unblock the Notifications