Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆస్కార్ అవార్డుల వేదికలో RRR పూనకాలతో మరోసారి ఊగిపోయిన హాలీవుడ్, నాటునాటు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు సోమవారం వేకువ జామున టీవీలకు అతుక్కుపోయారు. సోమవారం వేకువజామున లాస్ ఏంజిల్స్ లోని డాల్ఫీ థియేటర్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం చూడటానికి సినీ ప్రేమికులు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూశారు. 96వ ఆస్కార్ అవార్డుల వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. భారతదేశంలోని సినీ అభిమానులు సైతం ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో ఉత్కంఠతో చూశారు.
గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో చూసిన భారత సినీ ప్రేమికులు ఈసారి కూడా అంతే ఆసక్తితో చూశారు. గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమా పోటీ పడింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం పోటీపడింది. ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు అందుకుంటుందా ? అని అప్పట్లో సినీ అభిమానులకు టెన్షన్ మొదలైయ్యింది.

Image courtesy
ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన RRR సినిమా అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం, అదే సమయంలో నాటునాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడటంతో భారతదేశంలోని సినీ ప్రేమికులు అందరూ ఆనందంతో కేరింతకలు కొట్టారు. అప్పటికే ప్రపంచంలోని అత్యున్నత సినీ అవార్డులను ఆర్ఆర్ఆర్ సినిమా గెలుచుకోవడంతో నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని భారతీయులు దేవుడిని వేడుకున్నారు.
ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లో మొదటి ఇండియన్ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో నిలిచిన నాటునాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఇంతకాలం భారతీయులకు కలగానే మిగిలిన ఆస్కార్ అవార్డు భారత్ లో అడుగుపెట్టింది. నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో భారతదేశంలోని సినీ ప్రేమికులు సంబరాలు చేసుకున్నారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నాటునాటు పాట రాసిన చంద్రబోస్, ఆ పాటకు సంగీతం అందించిన ఎంఎం కీరవాణిలు తల ఎత్తుకుని ఆస్కార్ అవార్డు అందుకుని వారి ఆనందాన్ని అదే వేదిక మీద కొన్ని మాటల్లో పంచుకున్నారు.
తెలుగు సినీ అభిమానులు కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డును RRR సినిమాలోని నాటునాటు పాటకు రావడంతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగిచూసింది. అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళితో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రపంచ వ్యాప్తంగా ఫైమస్ అయిపోయారు. ఆ సందర్బంలో ఆస్కార్ అవార్డు వేదిక మీద నాటునాటు పాటకు హాలీవుడ్ ప్రముఖులు సైతం చిందులు వెయ్యడానికి సిద్దం అయ్యారు.
అయితే ఇప్పుడు భారతదేశం నుంచి ఎలాంటి సినిమా ఆస్కార్ అవార్డుకు పోటీ పడకపోయినా మరోసారి భారతీయులు తీసిన సినిమా ఆస్కార్ అవార్డుల వేదిక మీద దర్శనం ఇచ్చింది. సోమవారం జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్బంగా వేదిక మీద ప్రదర్శించిన ప్రత్యేక వీడియోలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొన్ని సీన్లు ప్రదర్శించారు. RRR సినిమాలోని కొన్ని స్టంట్స్, నాటునాటు పాటకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీర్ వేసిన డ్యాన్స్ కు సంబంధించిన సీన్లు ఆస్కార్ అవార్డు వేదిక మీద స్క్రీన్ లో ప్రదర్శించారు.
నాటునాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని ఏడాది అయిపోయినా హాలీవుడ్ మాత్రం ఇంకా ఆ పాట మైకంలోనే ఉందని చెప్పడానికి ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఆ పాటను మరోసారి ప్రదర్శించడం చూస్తే అర్థం అవుతోంది. మొత్తం మీద ఆస్కార్ అవార్డుల వేదిక మీద మరోసారి RRR సినిమాకు సంబంధించిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రాధానోత్సవం సందర్బంగా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ చూపించడంతో ఆ సినిమా యూనిట్ ఆ లింక్ ను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అది వైరల్ అవుతోంది.



Click it and Unblock the Notifications