Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
తరం మారింది తమ్ముడూ..బీటా బేబీస్ వచ్చేసారు..2025లో మామూలుగా ఉండదు
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాం. అయితే 2025 అనేక రకాలుగా చాలా చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఈ ఏడాది ఆకాశంలో మార్పులతో సహా అనేక ఇతర పెద్ద మార్పులు జరగనున్నాయి. ఈ ఏడాదికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే కొత్త జనరేషన్ కూడా ప్రారంభమవడం. జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవడమే కాకుండా కొత్త తరం కూడా ప్రారంభమైంది. జనవరి 1,2025 నుండి పుట్టిన పిల్లలను జనరేషన్ బీటా అంటారు. అసలు ఏంటీ జపరేషన్ బీటా,ఎప్పటి దాకా పుట్టినవాళ్లని ఈ తరంగా పరిగణిస్తారు, వారి జీవితం ఎలా ఉంటుంది, ఎదుర్కోబోయే సవాళ్లేంటి అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
జనరేషన్ బీటా అని ఎందుకు పిలుస్తారు,ప్రత్యేకతలు
సాధారణంగా ప్రతి 15 నుండి 20 సంవత్సరాలకు ఒక తరం పేరు మారుతుంది. తరాలకు పేర్లు పెట్టడం వెనుక చాలా కారణాలున్నాయి. తరాల పేర్లు చారిత్రక, సాంస్కృతిక , అనేక ఇతర సంఘటనల ఆధారంగా నిర్ణయించబడతాయి. 1981-1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్ అని పిలుస్తారు. 1996-2010 మధ్య పుట్టినవారిని జెనరేషన్ Z అని అంటారు. 2010-2024 మధ్య పుట్టినవారిని ఆల్ఫా జనరేషన్ గా పరిగణిస్తారు. ఈ తరం పుట్టకముందే సోషల్ మీడియా,ఇంటర్నెట్ ఉన్నాయి.
అలాగే 2025-2039 మధ్య పుట్టిన తరాన్ని బీటా బేబీస్ గా పిలవనున్నారు. ఈ తరం AI ,స్మార్ట్ పరికరాల మధ్య పెరుగుతుంది. జనరేషన్ బీటా పిల్లల దైనందిన జీవితంలో విద్య నుండి ఆరోగ్య సంరక్షణ, వినోదం వరకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ప్రధాన భాగంగా ఉంటాయి. ఈ తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా ఆధారపడతారని, సమస్యలను పరిష్కరించడానికి వాటిని ఉపయోగిస్తారు.

కొత్త శతాబ్దాన్ని చూసేది వీళ్లే
సాంకేతిక యుగంలో బీటా బేబీలు పెరుగుతారు కాబట్టి వర్చువల్ వాతావరణాన్ని అర్థం చేసుకునే మొదటి తరం వారు వీళ్లే కానున్నారు. టెక్నాలజీని పుట్టినప్పటినుంచే నేర్చుకుంటారు కాబట్టి బీటా తరం తక్కువ సవాళ్లను టెక్నాలజీ పరంగా ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎదుర్కొనే సమస్యలు
బీటా తరం పర్యావరణ, సామాజిక సవాళ్లను ఎదుర్కోనుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటిని జనరేషన్ బీటా పిల్లల జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలుగా ఉండనున్నాయని తెలిపారు. 2039 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో 16 శాతం మంది బీటా,Y,Z జనరేషన్‌గా ఉంటారని అంచనా. వీరిలో చాలా మంది 22వ శతాబ్దపు ఆవిర్భావాన్ని చూడగలుగుతారు. ఈ తరం కొత్త శకానికి నాంది పలుకుతుంది. దీంతో సాంకేతికతకు కొత్త రూపురేఖలు రానున్నాయి.



Click it and Unblock the Notifications