Latest Updates
-
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే!
Friendship Marriage : ప్రేమ లేదు, సెక్స్ లేదు.. ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్.. జపాన్‌లో ట్రెండింగ్...
ప్రపంచంలో టెక్నాలజీలో అందరికంటే ముందున్న జపాన్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన జపాన్‌లో ఇప్పుడు ఒక కొత్త మ్యారేజ్ సిస్టమ్ ప్రారంభమైంది. కొన్నేళ్ల క్రితం జపాన్‌లో వృద్ధులు ఎక్కువండే వారు ఆ సమయంలో అత్యతం వృద్ధ దేశంగా జపాన్ ఉండింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారి అక్కడ యువుత సంఖ్య పెరిగింది. కొత్తగా వీరు ఓ నయా వివాహ సంబంధంలోకి వెళ్తున్నారుదానిపూనే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్. ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో శారీరక సుఖం కన్నా మానసిక సుఖం, ప్రేమకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌కు సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో ఇద్దరూ ప్రేమించుకుంటారు, తరువాత పెళ్ల కూడా చేసుకుంటారు కానీ వారి ఇద్దరి మధ్య శారీరకంగా కలుసుకోవడం, శృంగారం లాంటివి ఏవీ ఉండవు. వారికి పిల్లలు కావాలనుకుంటే ఆర్టిఫీషియల్ సిమినైజేషన్ పద్ధతిలో పిల్లలను కంటారు. ఆర్టిఫీషియల్ సిమినైజేషన్‌లో వీర్యాన్ని మెడికల్ పద్ధతిలో గర్భంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియలో భార్య భర్త ఇద్దరూ శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం కూడా ఉండదు.

ఇప్పుడు జపాన్‌లో వేల మంది ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ను చేసుకొని ఉన్నారని జపాన్‌లోని ఓ ప్రముఖ సర్వే సంస్థ కొలోరస్ తెలిపింది. 2015 నుంచి ఇప్పటి వరకు జపాన్‌లో 500ల మంది ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో ఉన్నట్లు అధికారక లెక్కలు చెబుతున్నాయ్. అనధికారికంగా ఈ సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయ్.
ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అగ్రిమెంట్‌లో పార్ట్‌నర్స్ ఇద్దరూ చాలా విషయాలను చర్చించుకుంటున్నారు. వారి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయ్, చదువు, ఉద్యోగం, అభిరుచులు, ఖర్చులు ఎలా ఉంటాయ్. పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారు లాంటి వాటి గురించి ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌కు ముందుగానే మాట్లాడుకుంటున్నారు.
అయితే ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో ఆశ్చర్యగొలిపే విషయమేంటంటే.. ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ కోరుకున్న వారు హోమోసెక్షువల్ క్యాటగిరీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. జపాన్ వాసులకు కూడా ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌పై భిన్న వాదనలు ఉన్నాయ్. స్నేహానికి ఎక్కువ, ప్రేమికులకు తక్కువగా ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఉందని జపాన్‌లోని కొందరు భావిస్తున్నారు.
ఇదే కాకుండా జపాన్‌లో మరో కొత్త రకమైన డైవర్స్ ప్రారంభమైంది. దీన్నే మనము స్లీప్ డైవర్స్ అంటాం. ఈ స్లీప్ డైవర్స్‌లో భార్యా భర్త ఇద్దరూ బెడ్‌పై కలిసి పడుకోకుండా ఎవరికివారే యమునా తీరే అన్న విధంగా పడుకుంటారు. భార్యా, భర్త ఇద్దరూ వేరే వరే ప్రదేశాల్లో కూడా పడుకుంటారు. దీనికి వారి మధ్య అనేక కారణాలున్నాయ్. ఈ ట్రెండ్ అటు పాశ్చాత్య దేశాల్లో ఇటు భారత దేశంలో కూడా పాపులర్ అవుతోంది. దీన్ని స్లీప్ డైవర్స్‌గా గుర్తిస్తున్నారు. ఈ రిలేషన్‌లో ఇద్దరూ డైవర్స్ తీసుకున్న భార్య భర్తల్లా వేరు వేరుగా పడుకోవడం వల్ల దీనికి స్లీప్ డైవర్స్‌గా పేరు వచ్చింది. ఈ స్లీప్ డైవర్స్ క్రమంగా మొత్తం డైవర్స్‌కే దారి చూపుతుంది. ఇది వారిద్దరి రిలేషన్‌లో మరిన్ని ఘర్షనలకు దారితీసి ఇద్దరూ విడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోలేక అలా తాత్కాలికంగా స్లీప్ డైవర్స్‌కు వెళ్తున్నారని కూడా అంటున్నారు.



Click it and Unblock the Notifications











