Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
గమనిక: ఈరోజు నుంచి కొత్త రూల్స్.. తెలుసుకోండి లేకపోతే నష్టపోయేది మీరే!
2025లో రెండో నెల అయిన ఫిబ్రవరి కూడా అయిపోయింది. నేటితో మార్చి నెల మొదలైపోయింది. మార్చి నెలలో అనేక విధాలు మార్పులు ఉండబోతున్నాయి. ఈనెలలో మొదటగా వాతావరణంలో మార్పు వస్తుంది. అలాగే ఈ నెలతో ఆర్ధిక సంవత్సరం కూడా ముగుస్తుండడంతో కొత్త ఆర్ధిక విషయాలు కూడా వేలులోకి వస్తాయి. ఈరోజు నుంచి కొన్ని నియమాలు మారుతున్నాయి. అయితే ఈ స్టోరీలో మార్చి నుంచి ఎలాంటి నియమాలు మారుతున్నాయి? ఏ విధమైన మార్పులు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మార్చి నుండి సెబీ కొత్త నియమాలు
నేటి నుంచి కొత్త సెబీ రూల్స్ రాబోతున్నాయి. ఆ రూల్స్ ప్రకారం.. మీరు ఆర్థిక లావాదేవీలలో పాల్గొంటుంటే, ముఖ్యంగా మీకు మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడులు లేదా ఇతర డీమ్యాట్ ఖాతాలు ఉంటే, మీరు ఇప్పుడు అటువంటి ఖాతాలకు నామినీలుగా 10 మంది పేర్లను జోడించవచ్చు. పెట్టుబడిదారు అనారోగ్యానికి గురైనా, లేదా కొన్ని కారణాల వలన మృతి చెందినా.. ఆస్తుల బదిలీని సులభతరం చేయడానికి 10 మంది పేర్లను నామినేట్ చేయవచ్చు.

LPG గ్యాస్ ధరలో మార్పు
చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి రోజున ఎల్‌పిజి సిలిండర్ ధరలను నవీకరిస్తాయి. అందువల్ల, మార్చి 1న కూడా ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. గత నెలలో కూడా ధర పెరిగింది.
FD వడ్డీ రేట్లలో ఊహించిన మార్పు
కొన్ని బ్యాంకులు మార్చి 1 నుండి తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించవచ్చు. చాలా బ్యాంకులు ఇటీవల వడ్డీ రేట్లను సవరించాయి. అదేవిధంగా, FD వడ్డీ రేట్లను పెంచవచ్చు.
మార్చిలో కొత్త పన్ను విధానం
ఈ సంవత్సరం బడ్జెట్ చాలా మందికి పన్ను మినహాయింపులను అందించింది. లబ్ధిదారులు ఈ మార్చి నుండి వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. పాత శ్లాబుకు ఈ పన్ను పరిమితిని సవరించే అవకాశం ఉంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది.
CNG PNG, ATF ధరలో మార్పు
ప్రతి నెల ప్రారంభంలో CNG, PNG మరియు ATF ధరలు సవరించబడతాయి. చమురు కంపెనీలు 1వ తేదీన కొత్త ధరలను సవరిస్తాయి.
GST పోర్టల్ అప్‌గ్రేడ్
ఒకే రోజులో లక్షలాది మంది GST పోర్టల్‌ను సందర్శిస్తారు. చాలా మంది తమ ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలను ఈ పోర్టల్‌లో పంచుకుంటారు. కాబట్టి అదనపు భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే GST సంబంధిత ప్రక్రియల కోసం GST పోర్టల్ అప్‌గ్రేడ్ చేయబడుతుంది. దీనివల్ల సురక్షితమైన ఆన్‌లైన్ సేవలను పొందవచ్చు. వేగం కూడా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications