Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
New year 2025: ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ ని ఎలా స్వాగతిస్తారు? పాటించే ఆచారాలు ఇవే
కొత్త సంవత్సర వేడుకల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ 2025ని స్వాగతించే ఏర్పాట్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బిజీబిజీగా ఉన్నారు. తీర్మానాల ఆలోచన నుంచి న్యూ ఇయర్ పార్టీ ప్లాన్ దాకా కొత్త సంవత్సరం రాకముందు జనాల్లో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తోంది. అయితే కొన్ని దేశాలలో వినూత్న విధానంలో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు ప్రజలు. ఇవి సంవత్సరాలుగా అక్కడ ఆచారంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలని ఎలా జరుపుకుంటారు,పాటించే ఆచారాలు ఏంటీ అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు చూద్దాం.
అమెరికా
అమెరికాలో టైమ్ స్క్వేర్‌లో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటారు. న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు వస్తారు. ఈ సందర్భంగా టైమ్స్ స్క్వేర్‌లో జనం గుమిగూడతారు.. అందరి చూపు కూడా ఎత్తైన జెండా స్తంభంపై ఉంటుంది. ఇక్కడ నుండి ఒక బంతి క్రిందికి వస్తుంది, ఇది కౌంట్ డౌన్ యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే అమెరికా నగరాల్లోని ప్రజలు పుచ్చకాయల వంటి వాటిని ఎత్తు నుంచి కిందకు విసిరేస్తుంటారు.

స్పెయిన్‌లో నూతన సంవత్సరాన్ని రాజధాని మాడ్రిడ్ నగరంలో, కానరీ దీవులలో చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. స్పెయిన్ నూతన సంవత్సర సంప్రదాయం 12 ద్రాక్షలను తినడం. రాత్రి 12 గంటలకు, ప్రజలు 12 నెలలకు పేరు పెట్టడానికి 12 ద్రాక్షలను తింటారు. ఈ సమయంలో 12 గంటలు మోగిస్తారు, ప్రతి గంటతో ఒక ద్రాక్షను తింటారు. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. అందుకే వీటిని అదృష్ట ద్రాక్ష అని కూడా అంటారు. ఈ ఆచారాన్ని అనుసరించి ప్రజలు డ్యాన్స్ లు, పాటలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు.
నెదర్లాండ్స్
నెదర్లాండ్స్‌లో నూతన సంవత్సరాన్ని జరుపుకునే విధానం కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సందర్భంగా రాజధాని ఆమ్ స్టర్ డామ్(Amsterdam) నగరంలో ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది. ఇక్కడ న్యూ ఇయర్ జరుపుకునే విధానం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ రోజున ప్రజలు నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఉదయాన్నే సముద్రపు నీటిలో స్నానాలు చేస్తారు. దీని కోసం వారు షెవెనింగెన్ బీచ్ దగ్గర సమావేశమవుతారు. సముద్రంలో స్నానం చేయడం వల్ల కొత్త సంవత్సరం శుభప్రదం అవుతుందని నమ్ముతారు.
కంబోడియా
కంబోడియా ప్రజలు కొత్త సంవత్సరం సందర్భంగా దేవాలయాలలో అగరబత్తులు కాల్చుతారు. ఈ సమయంలో ప్రజలు అదృష్టం కోసం బుద్ధుడిని ప్రార్థిస్తారు. సంవత్సరంలో రెండవ రోజు ప్రజలు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం కూడా పూజలు చేస్తారు. ఈ రోజు పేదలకు కూడా దానాలు చేస్తారు. మూడవ రోజు ప్రజలు తమ పెద్దలు, బుద్ధ భగవానుడి పాదాలను కడుగుతారు. అదృష్టాన్ని ఆహ్వానించడానికి, ప్రతికూలతను నివారించడానికి ఇలా చేస్తుంటారు.
జపాన్-కొరియా
జపాన్, కొరియా దేశాల్లో న్యూ ఇయర్ స్పెషల్ గ్లో కనిపిస్తుంది. ఈ రెండు దేశాల్లోనూ గంటలు మోగిస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అది కూడా ఒకటి రెండు సార్లు కాదు 108 సార్లు. ఇక్కడ నూతన సంవత్సరంలో 108 సార్లు బెల్ మోగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే ఎక్కడ చూసినా న్యూ ఇయర్ సందర్భంగా గంటలు మోగిస్తూ కనిపిస్తారు.



Click it and Unblock the Notifications