Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మీకోసం మీరు ఎన్నో పనులు చేస్తారు, అయితే ఈ పనులు మాత్రం అస్సలు చేయొద్దు
మన కోసం మనం ఎలాంటి పనులు చేయకూడదు, వ్యక్తిగత అభివృద్ధికి ఎలాంటి పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన కోసం మనం చాలా పనులు చేసుకుంటాం. కొన్ని మనకు ఇష్టమై చేస్తాం, మరికొన్ని మనకు ఇష్టం లేకపోయినా చేస్తాం. కొన్ని చర్యల ప్రభావం మన జీవితంపై ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ పని చేసినా దాని నుండి మనకు ప్రయోజనం చేకూరాలి. లేకపోతే అలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మనకు మనం పనులు చేసుకోవడమే కాదు కొన్ని పనులను చేయకుండా ఉండటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

మన కోసం మనం ఎలాంటి పనులు చేయకూడదు, వ్యక్తిగత అభివృద్ధికి ఎలాంటి పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తప్పు వ్యక్తులతో సమయం గడపొద్దు
ఆనందాన్ని హరించే వ్యక్తులతో సమయం గడపకపోవడమే మంచిది. మీకు గౌరవం ఇవ్వని, మీ సౌకర్యాన్ని పట్టించుకోని, మీ విలువ ఇవ్వని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. కష్టంలోనూ, సుఖంలోనూ వెంట ఉండే వ్యక్తులే నిజమైన స్నేహితులు. అలాంటి వారితో సమయం గడపడం ముఖ్యం.
2. సమస్యల నుండి పరిగెత్తడం ఆపండి
సమస్యలను ధీటుగా ఎదుర్కోవాలి. కొన్ని సమస్యలను తక్షణం పరిష్కరించలేకపోవచ్చు. మనం చేసే కొన్ని పొరపాట్లు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. వాటిని ఎదుర్కోవాలి కానీ వాటిని వదిలి దూరంగా పరిగెత్తవద్దు. సమస్యలు ఎదుర్కొంటేనే బలంగా తయారుకాగలం.
3. మీతో మీరు అబద్ధాలు చెప్పొద్దు
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే జీవితాలు మెరుగుపడతాయి. మనతో మనం నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం.
4. మిమ్మల్ని మీరు కోల్పోవద్దు
ఒకరిని ఎక్కువగా ప్రేమించే ప్రక్రియలో మిమ్మల్ని మీరు కోల్పోవడం జరుగుతుంది. ఎదుటి వారికి సహాయం చేస్తున్నప్పుడు మీకు మీరు కూడా చేసుకోవాలి. ఒకరి కోసం మీకిష్టమైనవి వదులుకోవడం, అలవాట్లను మార్చుకోవడం, వ్యక్తిత్వం వదిలిపెట్టడం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోతారు.
5. మీరు కాని వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించడం మానేయాలి
మీరు మీరుగా ఉండేలా చూసుకోండి. ఒకరికి ఏదో నచ్చుతుందని, ఇంకేదో ఇష్టమని అలాంటి పనులు చేస్తూ పోతే మీరు మీరుగా ఉండలేరు. కాబట్టి ఆల్ పర్‌ఫెక్ట్ వ్యక్తిలా కాకుండా మీరు మీరులా ఉండటానికి ప్రయత్నించండి.
6. గతంలో జీవించొద్దు
గతం గతః. జరిగినపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అయింది కాకుండా పోదు.

7. తప్పు చేయడానికి భయపడొద్దు
తప్పు చేయడం మానవ సహజం. తప్పులు చేస్తున్నప్పుడే కొత్త విషయాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోగలం. ఒక పని చేస్తున్నప్పుడు తప్పు జరిగితే దానిని సరిదిద్ది మరోసారి కరెక్టుగా చేయడం తెలిసి వస్తుంది.
8. ఆనందాన్ని కొనడానికి ప్రయత్నించవద్దు
ఆనందాన్ని కొనడానికి ప్రయత్నించవద్దు. నిజమైన ఆనందాన్ని ఇచ్చేవి ప్రేమ, నమ్మకం, స్వేచ్ఛ, నవ్వు. ఖరీదైన వస్తువు కొంటే వచ్చే ఆనందం తాత్కాలికమైనది మాత్రమే.
9. ఆనందం కోసం ఇతరులపై ఆధారపడొద్దు
మీతో మీరు సంతోషంగా లేకపోతే ఇతర వ్యక్తులతోనూ సంతోషంగా ఉండలేరు. మీకు మీరుగా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
10. రెడీగా లేనని అనుకోవద్దు
అవకాశం వచ్చినప్పుడు వంద శాతం సిద్ధంగా ఉన్నట్లు భావించడం కొద్దిగా కష్టమే. జీవితంలో చాలా గొప్ప అవకాశాలు మన కంఫర్ట్ జోన్‌లకు మించి ఎదగడానికి బలవంతం చేస్తాయి.
11. తప్పుడు సంబంధంలో ఉండొద్దు
సంబంధాలను తెలివిగా ఉంచుకోవాలి. చెడు సాంగత్యంలో ఉండటం కంటే ఒంటరిగా ఉండటం మంచిది. హడావిడి అవసరం లేదు. ఏదైనా జరగాలని భావించినట్లయితే అది సరైన సమయంలో సరైన వ్యక్తితో ఉత్తమ కారణంతో జరుగుతుంది.
12. ఇతరులపై అసూయ పడొద్దు
అసూయ పడటం సాధారణం. ఒక స్థాయి వరకు అసూయ అందరికీ మేలు చేస్తుంది. కానీ అసూయతో రగిలిపోతే ప్రశాంతత దూరం అవుతుంది. అసూయ పడటం మానేసి విజయం ఎలా సాధించాలో తెలుసుకోవడం ముఖ్యం.



Click it and Unblock the Notifications