Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Viral Video: డబ్బులు కావాలా,నాతో డేట్ కావాలా?.. మనోడి సమాధానానికి బిత్తరపోయిన విదేశీ యువతి
విదేశాల్లో కొంతమంది యువతీయువకులు రోడ్డున పోయే వాళ్లని కొన్ని ప్రశ్నలు అడుగుతుండటం,దానికి వాళ్లు చెప్పే సమాధాలు కొన్నిసార్లు ఫన్నీగా,ఇంట్రెస్ట్ గా ఉంటుడటం తరుచూ మనం సోషల్ మీడియాలోని కొన్ని వీడియోల్లో చూస్తుంటాం. సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. సడెన్ గా ఒక అపరిచిత వ్యక్తి దారిన పోయే వారిని ఆపి ఏదైనా చిత్రమైన లేదా ఆలోచింపజేసే ప్రశ్న అడుగుతారు.. కొందరు తడుముకోకుండా సమాధానమిస్తే, మరికొందరు అసలేం జరుగుతుందో అర్థంకాక అయోమయంలో పడిపోతారు. తాజాగే ఓ ఫారిన్ అమ్మాయి అడిగిన ప్రశ్నకు మన భారతీయ వ్యక్తి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బంపరాఫర్ ఇచ్చిన అమ్మాయి
వైరల్ వీడియోలో.. రూబీ హెక్స్ అనే ఒక అమ్మాయి.. సైకిల్ పై తన పక్కగా వెళ్తున్న ఒక హర్యానా కుర్రాడిని ఆపింది. ఆ కుర్రాడు అప్పటికే తన సోదరుడితో ఫోన్ లో ఏదో సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. ఇంతలో రూబీ హెక్స్ అతని ముందు ఒక విచిత్రమైన ఆఫర్ ఉంచింది. నీకు 100 కావాలా లేక నాతో డేటింగ్‌కు వచ్చి సరదాగా గడపాలనుకుంటున్నావా? ఈ ప్రశ్న విన్న ఆ కుర్రాడు ఒక్కసారిగా బిత్తరపోయి ఆపై గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. అతను ఊహించని ఈ పరిస్థితికి ఎలా స్పందించాలో తెలియక ఒక క్షణం తడబడ్డాడు. నవ్వు ఆపుకుంటూ అతను తన సోదరుడికి పరిస్థితిని ఫోన్ లో చెప్పాడు. "భయ్యా ఇక్కడో విచిత్రమైన ఆప్షన్ వచ్చింది..ఒకమ్మాయి 100 డాలర్లు ఇస్తానంటోంది లేదా ఆమెతో డేట్‌కి వెళ్లాలంట. ఈ రెండింటిలో ఏది ఎంచుకోమంటావ్?" అని సలహా అడిగాడు. ఆ సమయంలో రూబీ కూడా నవ్వుతూ ఆసక్తిగా గమనిస్తున్నట్లు వీడియోలో కనబడుతుంది.

ఫోన్ అవతలి నుంచి సోదరుడు ఏదో సలహా ఇచ్చాడు. అది విన్న ఆ కుర్రాడు నిజంగానా? సరే అంటూ రూబీ వైపు తిరిగాడు. ఆ తర్వాత అతను ఇచ్చిన సమాధానం రూబీని నివ్వెరపరిచింది. అతను నవ్వుతూనే క్షమించండి నాకు మీ డబ్బు వద్దు, మీతో డేటింగ్‌కు వచ్చే ఉద్దేశం కూడా లేదు అని సున్నితంగా తిరస్కరించాడు.
ఈ వీడియోను స్వయంగా రూబీ హెక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. రూబీ ప్రొఫైల్ ప్రకారం ఆమె ఇలాంటి ప్రశ్నలతో ఒక ప్రచారాన్ని నిర్వహిస్తోందని తెలుస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా ఆమె ఇప్పటికే చాలా మందిని ఇదే ప్రశ్న అడిగింది. ఆశ్చర్యకరంగా, చాలా మంది యువకులు రూబీతో డేటింగ్‌కు వెళ్లే అవకాశాన్ని కాదని రూ. 8500 తీసుకోవడానికే మొగ్గు చూపారు. కానీ మన హర్యానా కుర్రాడి విషయంలో కథ పూర్తిగా అడ్డం తిరిగింది.
ఆ కుర్రాడి సమాధానం విన్న రూబీ షాక్ అయింది. అతను రెండింటినీ తిరస్కరించాడా? సరే నా గొంతు విని నన్ను తిరస్కరించాడు కానీ కనీసం నన్ను సరిగ్గా చూడనైనా చూడలేదు అని ఆశ్చర్యపోతూ వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆ కుర్రాడి నిజాయితీకి, పెద్దలను గౌరవించే తీరుకు ఫిదా అవుతున్నారు. డబ్బుకు లొంగకుండా, ఆకర్షణకు తలొగ్గకుండా, తనదైన శైలిలో ఎంతో హుందాగా ఆ విదేశీ యువతి ఆఫర్‌ను తిరస్కరించిన ఆ హర్యానా కుర్రాడు నిజంగా ఎందరికో ఆదర్శం అంటూ కామెంట్స్ చేస్తున్నారు



Click it and Unblock the Notifications