Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
నో హోం వర్క్, నగ్నంగా ఆఫీసు మీటింగులు..వరుసగా 8వ సారి సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్
ఒకటి కాదు,రెండు కాదు వరుసగా 8వ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. 55 లక్షల మంది వరకు జనాభా ఉండే ఫిన్లాండ్..ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, గాలప్, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా రూపొందించిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో మరోసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని, ఆనందమయ జీవితానికి తామే అసలైన చిరునామా అని నిరూపించుకుంది. ఆ దేశ ప్రజల జీవిత సంతృప్తి స్కోరు 7.741గా నమోదైంది. ఒకప్పుడు మనదేశంలో ఫేమస్ మొబైల్ బ్రాండ్ అయిన నోకియా ఈ దేశానికి చెందినదే.
అయితే వరుసగా ఇన్నిసార్లు సంతోషకరమైన దేశాల లిస్ట్ లో టాప్ లో నిలుస్తుందంటే అసలు ఫిన్లాండ్ లో అంత స్పెషల్ ఏంటా అని చాలామంది గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతటి అద్భుతమైన ఆనందం వెనుక ఉన్న రహస్యాలు కేవలం ప్రభుత్వ విధానాలు మాత్రమే కాదు ఫిన్స్ లైఫ్ స్టైయిల్, కల్చర్, సామాజిక విలువల్లోనే దాగి ఉన్నాయి.

సంస్కృతికి ఆత్మ వంటి సౌనా సంప్రదాయం
ఫిన్లాండ్ అనగానే గుర్తొచ్చేది వారి సౌనా సంప్రదాయం. ఇది కేవలం స్నానాల గది కాదు, వారి సామాజిక జీవనంలో ఒక భాగం. సౌనా అనేది వేడి రాళ్లపై నీళ్లు చల్లి, ఆవిరిని సృష్టించే ఒక చెక్క గది. ఉష్ణోగ్రత 70 నుండి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజల దృష్టిలో సౌనా అంటే శరీరానికి, మనసుకు ఒకేసారి శుద్ధి చేసే ఒక ప్రక్రియ. ఫిన్లాండ్ జనాభా సుమారు 55 లక్షలు అయితే, దేశవ్యాప్తంగా 30 లక్షలకు పైగా సౌనాలు ఉన్నాయి. సౌనా అనేది కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మాట్లాడుకోవడానికి, మనసు విప్పి తమ భావాలను పంచుకోవడానికి ఒక వేదిక. అక్కడ టీవీలు, ఫోన్లు ఉండవు. కేవలం మనుషులు, వారి మధ్య సంభాషణలు మాత్రమే ఉంటాయి.
ఒకప్పుడు ఫిన్లాండ్ లో మహిళలు సౌనాలలోనే పిల్లలకు జన్మనిచ్చేవారు. అలాగే, చనిపోయిన వారి శరీరాలను చివరి స్నానానికి సిద్ధం చేసేది కూడా అక్కడే. అంటే, పుట్టుక నుండి మరణం వరకు సౌనా వారి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి సేద తీరడమే కాదు, కీలకమైన వ్యాపార ఒప్పందాలు, దౌత్య చర్చలు సైతం సౌనాలలో జరుగుతాయి. బట్టలతో పాటు హోదాలను కూడా పక్కనపెట్టి నిజాయితీగా సంభాషించుకుంటారు. ఫిన్లాండ్ పర్యావరణ మంత్రి సారా వరాలా..సౌనా మనల్ని ప్రతికూల శక్తుల నుండి విముక్తి చేసి, ఆనందానికి పునాది వేస్తుందని చెప్పారు.

ఒత్తిడి లేని విద్య
ఫిన్లాండ్ ఆనందానికి మరో మూలస్తంభం దాని విద్యా వ్యవస్థ. ఇక్కడి పిల్లలు ఇతర దేశాల విద్యార్థులతో పోలిస్తే పాఠశాలల్లో తక్కువ సమయం గడుపుతారు, వారికి హోంవర్క్ భారం కూడా చాలా తక్కువ. అయినా సరే, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల్లో ఎప్పుడూ ముందుంటారు. దీనికి కారణం ఆటపాటలతో కూడిన అభ్యసనం, నిపుణులైన ఉపాధ్యాయులు, ఒత్తిడి లేని వాతావరణం. సంతోషంగా నేర్చుకున్న చదువు జీవితకాలం ఆనందానికి పునాది వేస్తుందని ఫిన్లాండ్ విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఈ ఒత్తిడి లేని వాతావరణం వల్లే ఫిన్నిష్ పిల్లలు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన విద్యార్థులుగా నిలుస్తున్నారు.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు పెద్దపీట
ఫిన్నిష్ ప్రజలు పని-జీవిత సమతుల్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. సాధారణంగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే పని చేస్తారు. అంతేకాకుండా ఏడాదికి ఐదు వారాల శాలరీతో కూడిన లీవ్స్ పొందుతారు. ఇది వారికి రెస్ట్ తీసుకోవడానికి, ఫ్యామిలీతో సమయం గడపడానికి, తమ అభిరుచులను కొనసాగించడానికి పుష్కలమైన సమయాన్ని ఇస్తుంది. ఈ విధానం వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది.
ప్రకృతితో మమేకం, బలమైన బంధాలు
ఫిన్లాండ్‌లో ప్రతి ఒక్కరి హక్కు అనే సాంస్కృతిక నీతి ఉంది. దీని ప్రకారం ఎవరైనా అడవులు, సరస్సులను స్వేచ్ఛగా ఆస్వాదించవచ్చు. ప్రకృతితో ఈ అనుబంధం వారి శ్రేయస్సును మరింత పెంచుతుంది. సామూహిక కార్యకలాపాలు, బలమైన సామాజిక బంధాలు వారి ఆనందానికి పునాదులు వేస్తాయి.



Click it and Unblock the Notifications