Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు, స్నేహితులతో కలిసి బయటికి వెళ్లాలనిపిస్తుంది. కానీ బయటికి వెళ్లాలంటేనే చాలామందికి భయం.. ఎందుకంటే కేఫ్ లు, రెస్టారెంట్లు, మాల్స్ అంటూ వెళితే కనీసం వేలల్లో ఖర్చవుతుంది. జేబులో డబ్బులు తక్కువగా ఉన్నాయి, కానీ ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని ఉందా? అయితే జస్ట్ 200 రూపాయల బడ్జెట్ లో, హైదరాబాద్ లో ఫ్రెండ్స్ తో కలిసి అద్భుతమైన సమయాన్ని గడపడానికి కొన్ని బెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లాన్స్ ఇక్కడ చూడండి.

నెక్లెస్ రోడ్ లో స్మార్ట్ బైక్ రైడ్ (ఎలక్ట్రిక్ సైకిల్ తో షికారు)
సిటీ ట్రాఫిక్ నుంచి కాస్త రిలీఫ్ కావాలంటే చల్లని గాలిని ఆస్వాదిస్తూ సైకిల్ తొక్కడం కంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లేదా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో స్మార్ట్ బైక్ ద్వారా ఎలక్ట్రిక్ సైకిళ్లను అద్దెకు తీసుకోవచ్చు.
ఏం చేయొచ్చు?: యాప్ ద్వారా సైకిల్‌ను అన్ లాక్ చేసి గంటపాటు రైడ్ చేయవచ్చు. గంటకు దీని అద్దె చాలా తక్కువే ఉంటుంది. హుస్సేన్ సాగర్ అందాలను చూస్తూ, చెరువు కట్టపై వీచే చల్లని గాలికి సైకిల్ తొక్కుతుంటే ఆ కిక్కే వేరు. ఒకేసారి వ్యాయామంతో పాటు, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడపడానికి ఇది బెస్ట్ యాక్టివిటీ.
వాల్ రైడ్ పార్క్ (స్కేటింగ్ డేట్ అండ్ చిల్)
మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవరికైనా స్పోర్ట్స్ లేదా అడ్వెంచర్ అంటే ఆసక్తి ఉందా? అయితే మీరు తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం వాల్ రైడ్ పార్క్ .
ఏం చేయొచ్చు?: ఇక్కడ స్కేటింగ్ చేయడం రాకపోయినా పర్వాలేదు. అక్కడికి వెళ్లి లోకల్ స్కేటర్లు చేసే అద్భుతమైన ట్రిక్స్, ఫ్లిప్స్ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. మీలో ఎవరికైనా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, వాళ్ల దగ్గర కొన్ని బేసిక్ ట్రిక్స్ అడిగి తెలుసుకోవచ్చు. స్నేహితులతో కలిసి ఆ ఎనర్జిటిక్ వాతావరణంలో కూర్చుని సమయం గడపడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఫైకస్ గార్డెన్ (ప్రశాంతమైన పిక్నిక్ డే)
సినిమాలు, షాపింగ్ లు బోర్ కొట్టాయా? అయితే ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఒక పూట గడపడానికి ప్లాన్ చేయండి. సంజీవయ్య పార్క్ లేదా ఫైకస్ గార్డెన్ లాంటి పచ్చని ప్రదేశాలు పిక్నిక్ కి కేరాఫ్ అడ్రస్.
ఏం చేయొచ్చు?: బయట ఫుడ్ కొనడానికి బదులు, ఇంటి నుంచే కొన్ని స్నాక్స్, పండ్ల ముక్కలు ప్యాక్ చేసుకోండి. ఒక పెద్ద బెడ్ షీట్ లేదా మ్యాట్, మీకు ఇష్టమైన పుస్తకాలు, కొన్ని బోర్డ్ గేమ్స్ (లూడో, చెస్) తీసుకువెళ్లండి. పచ్చని చెట్ల కింద మ్యాట్ పరుచుకుని, ఫోన్లను పక్కనపెట్టి స్నేహితులతో మనసువిప్పి మాట్లాడుకోండి. 200 రూపాయల బడ్జెట్ లో ఇంతకంటే ప్రశాంతమైన డేట్ మరొకటి ఉండదు.
బన్సీలాల్ పేట్ మెట్ల బావి
హైదరాబాద్ అనగానే మనకు చార్మినార్, గోల్కొండ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇటీవల పునరుద్ధరించబడిన బన్సీలాల్ పేట్ మెట్ల బావి (Stepwell) ఇప్పుడు నగరంలో ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారింది. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ బావిని ఇప్పుడు ఎంతో అందంగా తీర్చిదిద్దారు.
ఏం చేయొచ్చు?: మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఇక్కడికి వెళ్లి, ఆనాటి శిల్పకళను ఆస్వాదించవచ్చు. ఇదొక మినీ హెరిటేజ్ వాక్ లాగా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. దీని ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువ (సుమారు రూ50 లోపు). మిగిలిన డబ్బులతో ఆరుబయట దొరికే వేడి వేడి సమోసా లేదా ఛాయ్ తాగుతూ చరిత్రను ఆస్వాదించవచ్చు.

లాడ్ బజార్ (ఓల్డ్ సిటీ వైబ్స్ - బజార్ షాపింగ్)
హైదరాబాద్ అసలైన అందం పాతబస్తీలోనే ఉంది. చార్మినార్ పక్కనే ఉండే లాడ్ బజార్ ఒక రంగుల ప్రపంచం. జేబులో పెద్దగా డబ్బులు లేకపోయినా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా ఉంది.
ఏం చేయొచ్చు?: ఫ్రెండ్స్ తో కలిసి లాడ్ బజార్ ఇరుకు వీధుల్లో నడుస్తూ, మెరిసిపోయే గాజులు, ఆభరణాలను చూస్తూ విండో షాపింగ్ చేయండి. చార్మినార్ బ్యాక్ గ్రౌండ్ లో మంచి ఫోటోలు దిగండి. అలసిపోయిన తర్వాత నిమ్రా కేఫ్‌లో ఓ 20 రూపాయలు పెట్టి ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్ తింటే.. ఆ ఓల్డ్ సిటీ వైబ్స్ మీకు ఓ మధురానుభూతిని మిగుల్చుతాయి.
ఐకియా హైదరాబాద్ (ఫ్రీ వెడ్నెస్ డే యాక్టివిటీస్)
ఐకియా అనగానే ఫర్నిచర్ కొనుక్కోవడానికో లేదా అక్కడి మీట్ బాల్స్ తినడానికో వెళతారని అందరూ అనుకుంటారు. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఐకియాలో అద్భుతంగా సమయం గడపొచ్చని మీకు తెలుసా?
ఏం చేయొచ్చు?: ఐకియాలో ప్రతి బుధవారం ఉచిత యాక్టివిటీస్ నిర్వహిస్తుంటారు. స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి పెయింటింగ్, జర్నలింగ్, బోర్డ్ గేమ్స్ లాంటి వాటిలో పాల్గొనవచ్చు. ఏసీ వాతావరణంలో, ఎంతో క్రియేటివ్ గా, ఆహ్లాదంగా గడపడానికి ఇదొక బెస్ట్ సీక్రెట్ హ్యాంగ్ అవుట్ స్పాట్. ఈ ఆర్ట్ థెరపీ మీ మనసుకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది.



Click it and Unblock the Notifications