Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
ప్రతి ఇంట్లో వంటగదికి గుండెకాయ లాంటిది గ్యాస్ స్టవ్. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఇది లేకుండా మనకు పూట గడవదు. ఎంతో ఉత్సాహంగా వంట చేస్తున్నప్పుడు.. ముఖ్యంగా ఏదైనా పండగ పూట లేదా ఇంట్లో బంధువులు ఉన్నప్పుడు అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే? ఆ టెన్షన్ అంతా ఇంతా కాదు.
సిలిండర్ ఐరన్ తో తయారవడం వల్ల లోపల ఎంత గ్యాస్ ఉందో పైకి కనిపించదు. కాబట్టి గ్యాస్ పూర్తిగా అయిపోయి, స్టవ్ ఆరిపోయిన తర్వాతే చాలామంది కంగారు పడుతుంటారు. కానీ ఇకపై ఆ చింత వదిలేయండి, మీ సిలిండర్‌లో ఇంకా ఎంత గ్యాస్ మిగిలి ఉందో ముందే పసిగట్టి, కొత్త సిలిండర్ బుక్ చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన, సులువైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

తడి గుడ్డతో అదిరిపోయే చిట్కా
salve 6717 అనే పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ తెలపబడింది. దీనికోసం మీరు పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. ముందుగా ఒక కాటన్ గుడ్డను నీటిలో నానబెట్టి, నీళ్లు కారకుండా గట్టిగా పిండేయండి. ఇప్పుడు ఆ తడి గుడ్డతో గ్యాస్ సిలిండర్ పై నుంచి కింద వరకు పూర్తిగా తుడవండి. ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయండి.
ఆ తర్వాత సిలిండర్ ను గమనిస్తే.. గ్యాస్ లేని ఖాళీ భాగం త్వరగా ఆరిపోయి పొడిగా మారుతుంది. లోపల గ్యాస్ ఉన్న భాగం మాత్రం ఇంకా తడిగానే ఉంటుంది. ఎందుకంటే LPG గ్యాస్ స్వతహాగా చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి గ్యాస్ ఉన్నంత వరకు సిలిండర్ భాగం చల్లగా ఉండి, అక్కడి నీరు త్వరగా ఆవిరి కాదు. తడి ఉన్న భాగాన్ని బట్టి గ్యాస్ ఎంత ఉందో ఇట్టే పసిగట్టవచ్చు.
నీటితో మరో సులువైన పద్ధతి
మీరు గుడ్డతో తుడవడానికి బదులుగా నేరుగా నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఒక పెద్ద గ్లాసు లేదా మగ్గు నిండా నీళ్లు తీసుకోండి. ఆ నీటిని సిలిండర్ పైభాగం నుంచి కిందికి నెమ్మదిగా ధారలా పోయండి. ఒక నిమిషం ఆగి, మీ చేతితో సిలిండర్ ను పై నుంచి కిందకు తాకుతూ రండి.
పైన ఖాళీగా ఉన్న భాగం సాధారణ ఉష్ణోగ్రతతో (కొంచెం వెచ్చగా) ఉంటుంది. కానీ గ్యాస్ ఉన్న భాగం మాత్రం చాలా చల్లగా తగులుతుంది. మీ చేతికి ఎక్కడి నుంచి చల్లదనం అనిపిస్తుందో అక్కడి వరకు గ్యాస్ ఉన్నట్లు మీరు సులభంగా అంచనా వేయవచ్చు.
బరువును బట్టి కచ్చితమైన లెక్క
గ్యాస్ ఎంత ఉందో పక్కాగా తెలుసుకోవాలంటే సిలిండర్‌ను తూకం వేయడమే సరైన మార్గం. ప్రతి గ్యాస్ సిలిండర్ పైన దాని ఖాళీ బరువు (Tare Weight - సుమారు 15.3 నుంచి 15.5 కిలోలు) అని ప్రింట్ చేసి ఉంటుంది. పూర్తి గ్యాస్ బరువు 14.2 కిలోలు ఉంటుంది. మీ దగ్గర బరువు చూసే యంత్రం ఉంటే, దానిపై సిలిండర్ పెట్టండి.
ఉదాహరణకు సిలిండర్ మొత్తం బరువు 20 కిలోలు చూపిస్తుందనుకుందాం. అందులోంచి ఖాళీ సిలిండర్ బరువు (15.5 కిలోలు) తీసేయండి. అంటే మీ సిలిండర్‌లో ఇంకా 4.5 కిలోల గ్యాస్ మిగిలి ఉందని అర్థం. ఈ లెక్కతో మీకు ఇంకా ఎన్ని రోజులు గ్యాస్ వస్తుందో పక్కాగా తెలిసిపోతుంది.



Click it and Unblock the Notifications