Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కిమ్ మామ ఏం తింటాడు? నార్త్ కొరియా నియంత లైఫ్ స్టైల్ ఎలా ఉంటదోొ తెలుసా..
ఈ భూగ్రహం మీద ఏదైనా అత్యంత రహస్య ప్రదేశం ఉందంటే అది ఉత్తరకొరియానే. నార్త్ కొరియా ప్రజలు దేవుడిగా భావించే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయనని మన భారతీయులు కిమ్ మామ అని పిలుస్తుంటారు. ఈ ఉత్తరకొరియా నియంతకి ప్రజల బాగుగుల కన్నా ఆయుధాలు పోగు చేసుకోవడంపై ఎక్కువ శ్రద్ద ఉంటుంది. అసలు ఉత్తరకొరియాలో చీమ కదిలినా అది కిమ్ ఆదేశాలతోనే కదలాలి అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. తనకు నచ్చని పని చేస్తే కిమ్ మామ వాళ్లకి విధించే శిక్షలు ఈ భూమ్మీద ఏ దేశంలో ఉండవు. దేశ ప్రజలు ఆహార కొరతతో చనిపోతున్నా కిమ్ మామ లైఫ్ స్టైల్ మాత్రం ఏ మాత్రం తగ్గదు.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ జీవనశైలి, ఆహారపు అలవాట్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కిమ్ జోన్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ సమాచారం బయటకు వస్తుంది, కానీ ఏ సమాచారం వచ్చినా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నియంత కిమ్ జోంగ్ ఉన్ జీవనశైలిలో ఖరీదైన మద్యం, ప్రత్యేక సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మాంసం ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం కిమ్ జోంగ్ ఉన్ పెద్ద డ్రింకర్. ప్రతి ఏటా బిలియన్ల విలువైన మద్యం తాగుతాడు. ఉత్తర కొరియా నియంత డైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కిమ్ ఫేవరెట్ ఫుడ్
మీడియా కథనాల ప్రకారం కిమ్ ఆవు పాలు, స్నేక్ వైన్‌తో చేసిన వాటిని ఇష్టపడతారు. ఇది కాకుండా జపనీస్ వంటకం సుషీ, షాంపైన్‌లను కూడా ఇష్టపడతాడు. జపాన్ నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న క్రాబ్ మాంసాన్ని ఇష్టపడతాడు. క్రాబ్ మాంసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, తక్కువ అందుబాటులో ఉన్న మాంసం. దీంతో పాటు డెన్మార్క్ నుండి టాప్ క్వాలిటీ పంది మాంసం, ఇరాన్ నుండి కేవియర్ తెప్పించుకొని తినడం కిమ్ చాలా ఇష్టం.
మందు,సిగరెట్లు
కిమ్ బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ, హెన్నెస్సీ బ్రాందీని తాగడానికి ఇష్టపడతాడు. ఇందులో ఒక సీసా 7,000 డాలర్ల వరకు ఉంటుంది. కిమ్ కి ఫ్రెంచ్ సిగరెట్లు తాగడం అంటే ఇష్టం. కిమ్ జోంగ్ ఉన్.. వైవ్స్ సెయింట్ లారెంట్ సిగరెట్లను మాత్రమే తాగుతాడు, దాని ప్యాకెట్ ధర 44 డాలర్లు అంటే దాదాపు 3 వేల రూపాయలు.



Click it and Unblock the Notifications