Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
నవంబర్ 2025లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవుల పూర్తి వివరాలు
ప్రతి నెలా మన ఆర్థిక ప్రణాళికలలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యమైన లావాదేవీలు, డిపాజిట్లు, రుణాల చెల్లింపులు వంటి పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే పండుగలు, ప్రభుత్వ సెలవుల కారణంగా బ్యాంకులు పనిచేయని రోజులుంటాయి. కాబట్టి బ్యాంకు సెలవుల గురించి ముందుగా తెలుసుకోవడం మన పనులను సకాలంలో పూర్తి చేసుకోవడానికి, అనవసరమైన ఇబ్బందులను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
నవంబర్ నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. 2025 నవంబర్ నెలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు పండుగలు, సాధారణ వారాంతపు సెలవులు రానున్నాయి. నవంబర్ నెలలో బ్యాంకులకు మొత్తం మీద దాదాపు 9 రోజుల వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నోళ్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం.

నవంబర్ 2025లో ప్రత్యేక సెలవులు
నవంబర్ 1 (శనివారం) - ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తించే ప్రత్యేక సెలవు. ఈ రోజున ఏపీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే తెలంగాణలోని బ్యాంకు శాఖలు యథావిధిగా పనిచేస్తాయి. ఇది మొదటి శనివారం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఏపీలో బ్యాంకులు పనిచేయవు.
నవంబర్ 3 (సోమవారం) - గురునానక్ జయంతి,కార్తీక పౌర్ణమి
సిక్కుల గురువు గురునానక్ దేవ్ జయంతిని పురస్కరించుకుని ఈ సెలవును జాతీయ స్థాయిలో పాటిస్తారు. అదే రోజు హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సాధారణ వారాంతపు సెలవులు
ప్రత్యేక సెలవులతో పాటు ప్రతి నెలా వచ్చే సాధారణ వారాంతపు సెలవులు కూడా నవంబర్ నెలలో వర్తిస్తాయి.
ఆదివారాలు: నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో ఆదివారాలు కావడంతో బ్యాంకులు పనిచేయవు.
రెండవ శనివారం: నవంబర్ 8వ తేదీ రెండవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
నాల్గవ శనివారం: నవంబర్ 22వ తేదీ నాల్గవ శనివారం సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఖాతాదారులకు ముఖ్య సూచనలు
నవంబర్ నెల ప్రారంభంలోనే వరుస సెలవులు వస్తున్నాయి. నవంబర్ 1 (ఏపీలో), నవంబర్ 2 (ఆదివారం), నవంబర్ 3 (సోమవారం) వరుసగా మూడు రోజులు సెలవులు రావడం గమనార్హం. నగదు విత్ డ్రాలు, చెక్కుల క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు (DD) వంటి పనులను అక్టోబర్ చివరి వారంలోనే పూర్తి చేసుకోవడం మంచిది



Click it and Unblock the Notifications