Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్వదేశానికి తిరిగివస్తున్న భారతీయులు.. అక్కడ పెరిగిపోతున్న డాక్యుమెంటరీ డ్రీమర్లు..!!
చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన లక్షలాది మంది భారతీయులు ప్రస్తుతం అగ్రరాజ్యం నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. శాశ్వత నివాస అర్హత లేదా తాత్కాలిక వీసాలు రాక స్వదేశానికి తిరిగి రాక తప్పడం లేదు. అమెరికాలో ఇలాంటి వారిని డాక్యుమెంటరీ డ్రీమర్స్‌గా పిలుస్తారు. వీరి మొత్తం సంఖ్య 2.5 లక్షలకు పైనే ఉంటుంది. డాక్యుమెంటరీ డ్రీమర్స్‌లో భారతీయులే అత్యధికం అని స్వయంగా వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అమెరికా నిబంధనల ప్రకారం తల్లిదండ్రులతోపాటు అమెరికాకు వచ్చే చిన్నారులను వీసాదారులపై ఆధారపడే వారిగా పరిగణిస్తారు. 20 ఏళ్ల వరకు వారు దేశంలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ లోపు గ్రీన్‌కార్డు దక్కితే చట్టబద్ధంగా అగ్రరాజ్యంలో నివసించవచ్చు. లేకపోతే నిబంధనల ప్రకారం వారిని గ్రీన్‌కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ లేదా వీసా కోసం సొంతంగా ప్రయత్నించాలి. ఇందులో విఫలమైతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి.

అమెరికాలో ప్రస్తుతం భారతీయులు, వారి పిల్లలు సహా మొత్తం 12 మిలియన్ల మంది వివిధ కేటగిరీల్లో. దరఖాస్తు చేసుకొని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొందరు భారత సంతతి యువతి యువకులు ఇప్పటికే అమెరికాలోని తమ కుటుంబాలను వీడి భారత్ లో బంధువుల వద్ద తలదాచుకుంటున్నారు. డాక్యుమెంటరీ డ్రీమర్స్ సమస్య పరిష్కారానికి రిపబ్లికన్స్ చట్టసభల్లో మోకాలడ్డుతున్నారని వైట్ హౌస్ ఆరోపించింది. అన్ని వర్గాలకు అనుకూలమైన ఒప్పందాన్ని తాము రూపొందిస్తే రిపబ్లికన్లు రెండుసార్లు వ్యతిరేకంగా ఓటు వేశారని గుర్తుచేశారు. కాగా, గత నెలలో వివిధ పార్టీలకు చెందిన 43 మంది చట్టసభ సభ్యులు. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రీన్ కార్డు కోసం కొందరు దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష అభ్యర్ధి కోసం ఎన్నికలు జరగుతున్నాయ్. ఈ అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష బరిలో ఉండి గునుక ఈసారి గెలిస్తే ఎన్నారైల సమస్యలు చాలా వరకూ తగ్గుతాయ్. ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన వ్యక్తి అయితే అమెరికా అధ్యక్షులుగా కాలేదు. ఒక వేల అయితే అది కూడా పెద్ద చరిత్ర అవుతుంది. కమలా హ్యారిస్‌కు ఆ అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయ్.



Click it and Unblock the Notifications