Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
అత్యంత పెద్ద వయస్కుడిగా ఆల్ఫ్రిడ్ రికార్డ్..
ప్రపంచంలో అత్యంతపెద్ద వయస్కుడిగా ఎవరైనా రికార్డు సృష్టిస్తే వాళ్లు బ్రతికినంత కాలం ఆ రికార్డు అలాగే ఉంటుంది. వారు మరణిస్తే ఇక తరువాత వరుసలో ఉన్నవారు నిలబడిపోతారు. అలాగే బ్రిటన్‌కు చెందిన ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వూడ్ 111 ఏళ్లతో అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనకు ఈ సత్కారాన్ని అందజేసింది.

రికార్డు బద్దలు
ఇటీవల కేవలం కొన్ని రోజుల క్రితం ఈ రికార్డును అప్పటికే సాధించిన వెనిజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంట్ పెరెజ్ అనారోగ్యంతో మరణించాడు. దీంతో జువాన్ స్థానాన్ని అల్ఫ్రెడ్ భర్తీ చేశారు. అంతకు ముందు జపాన్‌కు చెందిన గిసాబురో సోనోబే 113 ఏళ్లతో రికార్డు నెలకొల్పాడు కానీ ఆయన కూడా మార్చ్ 31నే మరణించాడు. వీరి మరణాలను అత్యంత వృద్ధ పురుషుడిగా ఆల్ఫ్రెడ్‌ను రికార్డు వరించింది.
ఇక అత్యంత వృద్ధ మహిళగా స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్ మోరేరా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం భూమిపైన అత్యంత వృద్ధ మహిళగా ఆమె కొనసాగుతున్నారు.
గతంలో ఆర్మీ ఉద్యోగిగా..
తాజాగా అత్యంత వృద్ధుడిగా రికార్డ్ సృష్టించిన ఆల్ఫ్రెడ్ గతంలో ఆర్మీలో పనిచేశారు. అకౌంటెంట్‌గా ఆర్మీకి సేవలందించిన పదవీ విరమణ చేశారు. ఇన్నేళ్లు పూర్తి ఆరోగ్యంగా ఎలా ఉన్నారనే ప్రశ్నకు ఆల్ఫ్రెడ్ సమాధానమిచ్చాడు. ధూమపానం ఎప్పుడూ చేయలేదన్నారు. మద్యం అప్పుడప్పుడు మాత్రమే తీసుకునేవాడినన్నాడు. వారానికి ఒకసారి మాత్రమే చేపలు తినేవాడినని, చిప్స్ కూడా తినేవాడినంటూ చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లు తాను ఆరోగ్యంగా ఉండడానికి కారణం జీవినశైలితోపాటు అదృష్టం కూడా కారణమన్నారు. అదృష్టం లేకపోతే తాను ఇన్నేళ్లు ఇలా వుండేవాడిని కాదంటున్నారు ఆల్ఫ్రెడ్.
వివాహం
మీడియాతో ఆల్ఫ్రెడ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన జీవితంలో ప్రపంచం మారుతుండగా చూశానని అన్నాడు. ప్రపంచం రోజురోజుకూ మారి అభివృద్ధి చెందుతుంది కాని అంతగా ఏమీ మారట్లేదన్నారు. ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ 1942లో బ్లాడ్ వెన్‌ను వివాహం చేసుకున్నారు. 44ఏళ్ల వైవాహిక జీవితం తరువాత భార్య మృతిచెందింది. ఎక్కువ ఏది చేసినా మంచిదికాదని ఆల్ఫ్రెడ్ అందరికీ చెబుతున్నాడు. ఎక్కువ తిన్నా, ఎక్కువ తాగినా, ఎక్కువ నడిచినా, ఏది ఎక్కువ చేసినా తప్పకుండా బాధకు గురౌతారని అంటున్నాడు.



Click it and Unblock the Notifications