Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఆలూ సమోసా, ఆనియన్ సమోసా.. ఈ ఫేమస్ చిరుతిండి ఏ దేశానిదో తెలుసా?
వేడి వేడి ఉల్లిపాయ సమోసా తింటే స్వర్గం కళ్ల ముందు కదలాడుతుంది. ఇదేం అతిశయోక్తి కాదు. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఉండే చిట్టి సమోసాలు లేదా ఉల్లిపాయ సమోసాలను తిని చూడండి. ఆ ఫీలే వేరేగా ఉంటుంది. సమోసాలను చాలా మంది ఇష్టపడతారు. ఇష్టపడటంతో ఆపరు.. వాటిని ప్రేమించేస్తారు. కరకరలాడుతూ, టేస్టీగా, కొద్దిగా స్పైసీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే సమోసాలు అంటే చెవి కోసుకునే వాళ్లు కోకొల్లలు.
ఈవినింగ్ స్నాక్స్ అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది సమోసానే. వేడి వేడి మసాలా చాయ్ తో క్రిస్పీ సమోసా తింటే అద్భుతంగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్నాక్స్ లో సమోసాదే నంబర్ వన్ ప్లేస్. ఇంత మంది మనసును దోచేసిన సమోసా ఏ రాష్ట్రానికి చెందింది, అసలు ఈ వంటకం ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ ఎప్పుడైనా వచ్చింది. సమోసా తింటూ దానిని ఆస్వాదించడానికి దాని పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదులే. కానీ, తెలుసుకుంటే ఓపనైపోద్ది కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం.

సమోసా భారతీయ వంటకం కాదా..?
భారతదేశంలో రోజూ లక్షలాది సమోసాలు అమ్ముడవుతాయి. చాలా మందికి ఇష్టమైన వంటకం కూడా. ఇలాంటి సమోసా భారతీయ వంటకం అనే అనుకుంటారు చాలా మంది. కానీ సమోసా భారతీయ వంటకం కాదు అనేది వాస్తవం. సమోసాలు 10వ శతాబ్దంలో మధ్యప్రాచ్యంలో మొదట తయారు చేసినట్లు అంటారు.
సమోసా వంటకాన్ని మొదటిసారి అధికారికంగా ఇరానియన్ చరిత్రకారుడు అబోల్ ఫజల్ బేహాకి రాసిని తారిఖ్-ఇ బేహాగీ రచనలో గుర్తించారు. ఆ కాలంలో సమోసాను సంభోసా అని పిలిచే వారు. సమోసాలు అప్పుడు చిన్న చిన్న పరిమాణంలో తయారు చేసేవారు. వాటి వల్ల చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. అలా స్నాక్స్ గా సమోసాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రయాణాలు చేసేటప్పుడు సమోసాలు వెంట తీసుకెళ్లడం, ప్రయాణాలు చేస్తున్నప్పుడు సమోసాలు అమ్ముతుండటం కూడా తెలిసిందే.
సమోసా గురించి చరిత్రకారులు ఏం చెబుతున్నారు?
ఢిల్లీ సుల్తానేట్ కు చెందిన ప్రముఖ కవి, పండితుడు అమీర్ ఖుస్రో మాంసం, నెయ్యి, ఉల్లిపాయలను ఉపయోగించి సమోసాలు తయారు చేశాడు. సమోసా రాచరికపు కాలంలో మొదటిసారి తయారు చేసినట్లు పేర్కొన్నారు. 14వ శతాబ్దంలో కూడా సమోసాలు మాంసం, వాల్‌నట్‌లు, పిస్తా, బాదం, మసాలా దినుసులతో కలిసి తయారు చేసే వారని ఇబ్న్ బటూటా పేర్కొన్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థాతనంలో రాజ విందులు భాగంగా సాంబుసక్ (సమోసా) వడ్డించినట్లు బటూటా తెలిపారు. మొఘల్ రాజవంశంలో, ఐన్-ఇ-అక్బరీ సన్బుసా అని పిలిచే సమోసాల గురించి మొఘల్ రావంశ చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
సమోసాల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే..
సమోసాల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు, మాంసాలు, చీజ్, చిరుధాన్యాలతో సమోసాలు తయారు చేస్తుంటారు. ఒక్కో రకం సమోసా ఒక్కో రకమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది. అయితే చాలా మంది ఇష్టంగా తినేది మాత్రం ఉల్లిపాయ సమోసా లేదంటే ఆలూ సమోసా. సమోసా చాలా ప్రాంతాల్లో లభిస్తుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో సమోసాను పిలుస్తుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications