Latest Updates
-
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.?
సాల్టీ, స్వీటీ ఉస్మానియా బిస్కెట్లు ఎప్పుడైనా తిన్నారా? అవి ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసా?
గరమ్ గరమ్ ఇరానీ ఛాయ్‌లో సాల్టీ, స్వీటీ ఉస్మానియా బిస్కెట్లను ఎప్పుడైనా ముంచుకు తిన్నారా? ఛాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్లు కాంబో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది ఈ రుచిని చూసే ఉంటారు. ఉస్మానియా బిస్కెట్లు గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఈ బిస్కెట్లు చాలా విరివిగా లభిస్తుంటాయి. ఉస్మానియా బిస్కెట్లు అంటే మొదట గుర్తుకు వచ్చేది హైదరాబాద్. అయితే ఈ ఉస్మానియా బిస్కెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా. ఈబిస్కెట్లు మొదట ఎక్కడ తయారు చేశారు, ఎలా ఇంత ఫేమస్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉస్మానియా బిస్కెట్ల మూలం:
హైదరాబాద్ ఏడో నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాల మేరకు 1900 మొదట్లో ఈ ఉస్మానియా బిస్కెట్లను తయారు చేసినట్లు చెబుతారు. తియగా, ఉప్పగా ఉండేలా ఓ చిరుతిండిని తయారు చేయాలని ఆస్థాన చెఫ్ ను ఆదేశించాడట. అలా హైదరాబాద్ న్యూ గ్రాండ్ లోని బేకర్లు ఉస్మానియా బిస్కెట్లు తయారు చేసినట్లు చెబుతారు.
మరో కథనం ప్రకారం.. 1911 లో నిజాం స్థాపించిన ఉస్మానియా హాస్పిటల్ లోని డైటీషియన్ ఈ బిస్కెట్లను తయారు చేశారట. రోగులకు తేలికపాటి, పోషకమైన అల్పాహారంగా బిస్కెట్లను తయారు చేసినట్లు చెబుతారు. ఈ బిస్కెట్లు రుచిగా ఉండటంతో రోగుల్లో, సందర్శకుల్ల మంచి ప్రాచుర్యం పొందాయి.
ఈ రెండు స్టోరీలు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. మీరి ఉస్మాన్ అలీఖాన్ తయారు చేయాలని ఆదేశించడం, ఉస్మానియా ఆస్పత్రిలో తయారు చేయడం వల్ల ఈ బిస్కెట్లకు ఉస్మానియా బిస్కెట్లు అనే పేరు వచ్చినట్లు చెబుతారు.
అద్భుతమైన రుచికి చిరునామా ఉస్మానియా బిస్కెట్లు:
ఉస్మానియా బిస్కెట్లు అద్భుతమైన రుచితో ఉంటాయి. బయట కరకరలాడుతూ ఉంటాయి. లోపల ఇర్రెసిస్టిబుల్ గా మృదువుగా ఉంటాయి. నోట్లో పెట్టగానే అలా కరిగిపోతాయి. కచ్చితమైన బేకింగ్ సమయపాలనను పాటించడం వల్ల అద్భుతంగా ఉంటాయి.
కొనసాగుతున్న వారసత్వం:
ఉస్మానియా బిస్కెట్లు తయారు చేసిన తర్వాత వీటి అద్భుతమైన రుచికి అందరూ ఫిదా అయిపోయారు. అలా నిజాం ఆస్థానం నుంచి జనజీవనంలోకి వచ్చేసింది ఉస్మానియా బిస్కెట్లు. సాధారణ ప్రజలు కూడా ఈ బిస్కెట్లను ఇష్టపడటం మొదలుపెట్టారు. అలా ఈ రాయల్ బిస్కెట్ కాస్త ప్రజలకు ఇష్టమైన రుచికరమైన స్నాక్ గా మారిపోయింది.
హైదరాబాద్ గుర్తింపుకు చిహ్నంగా:
ఉస్మానియా బిస్కెట్ అంటే హైదరాబాద్. ఉస్మానియా బిస్కెట్లకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇక్కడ దొరికే నాణ్యమైన బిస్కెట్లను చాలా మంది ఇష్టపడతారు. ఇరానీ ఛాయ్ ఎంతగా ప్రజాదరణ అందుకుందో.. ఉస్మానియా బిస్కెట్లు కూడా అంతే ప్రజాదరణ అందుకున్నాయి. గరమ్ గరమ్ ఇరానీ ఛాయ్ లో కరకరలాడే ఉస్మానియా బిస్కెట్లను ముంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ లోని చిన్న చిన్న హోటల్లు, కిరాణ దుకాణాల నుంచి ప్రసిద్ధి బేకరీల వరకు ప్రతి చోట ఉస్మానియా బిస్కెట్లు లభిస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications